Top 9th Actors 2024
టాప్ 9వ యాక్టర్ 2024
తెలుగు పరిశ్రమలో చాలామంది హీరోలు ఉన్నారు. వారికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అందరిలో ఎవరు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అంటే మాత్రం అంత సులువుగా చెప్పడం కష్టం. అయితే సినిమా విజయాన్ని బట్టి ఏ హీరో అగ్రస్థానంలో ఉన్నాడో చెప్పగలం. అలాగే సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి, హీరో తీసుకున్న పారితోషికాన్ని బట్టి, హీరో చేసిన సినిమాలను బట్టి కూడా వారి స్థానాలను నిర్ణయించడం ఒక పద్ధతి. అయితే 2024లో విడుదలైన సినిమాలు ఆ చిత్రాలలో కథానాయకులుగా వారు పోషించిన పాత్రలు అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి టాప్ 10 హీరోలలో తొమ్మదవ స్థానంలో ఉన్న హీరో దుల్కర్ సల్మాన్.
వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కించిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ చిత్రంలో కథానాయకుడు దుల్కర్ సల్మాన్ నటనకు తెలుగు ప్రేక్షకులు ముగ్దులయ్యారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ, అప్పులు, ఆశ నిరాశలతో పాటు డబ్బు సంపాదించినప్పుడు ఆయన చూపించిన దర్పం, గర్వం లాంటి భావాలతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. అందుకే టాప్ టెన్ స్థానంలో 9వ స్థానంలో చోటు దక్కించుకున్నారు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడు. 2012లో సెకండ్ షో అనే మలయాళ చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు. తెలుగులో మహనటి చిత్రంతో అందరికి పరిచయం అయ్యారు. ఆ తరువాత సీతారామమ్, కల్కి, లక్కీభాస్కర్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాబోయే తెలుగు ప్రాజెక్ట్ ఆకాశంలో ఒక తార అనే చిత్రం చేయనున్నారు.