Top 9th Directors 2024
టాప్ 9 డైరెక్టర్ 2024
తెలుగు పరిశ్రమలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ప్రతీ డైరెక్టర్ కు తనకంటూ స్పెషల్ స్టైల్ ఉంటుంది. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో చాలా రకాల జానర్స్ ను తెరకెక్కించారు డైరెక్టర్లు. అందులో కొంతమంది థ్రిల్ ని బాగా హ్యండిల్ చేస్తారు. మరొకొందరు ఎమోషనల్ సీన్స్ బాగా హ్యండిల్ చేస్తారు. అయితే ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే థ్రిల్ మాత్రమే కాదు ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించే సీన్స్ పండాలి. అలా పండాలంటే డైరెక్టర్ల శ్రమ, పట్టుదలతో పాటు ప్రతిభ కూడా కావాలి. మరి ఈ సంవత్సరం సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్లలో టాప్ 10 డైరెక్టర్లలో త్రివిక్రమ్ టాప్ 9వ స్థానంలో ఉన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం అమ్మ సెంటిమెంట్తో అందరినీ కట్టిపడేసింది. ప్రముఖ రచయిత యద్దనపూడి సులోచన రాసిన కీర్తికిరిటాలు నవల ఆధారంగా త్రివిక్రమ్ ఆయన స్టైల్ లో సినిమాను తెరకెక్కించారు. అయితే తల్లి, కొడుకు నడుమ ఎంతో భావోద్వేగం ఉన్నప్పటికీ తెరమీద అంతగా పండలేదు. త్రివిక్రమ్ డైలాగ్స్ ఎంత స్పెషల్ గా ఉంటాయో తెలుసు కానీ గంటూరుకారం సినిమాలో అవికూడ పండలేదు. త్రివిక్రమ్ మార్క్ సినిమా గుంటూరు కారం కాదని చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఆయన ఎంచుకున్న కథ ఎప్పుడూ సెన్సిటీవ్ గానే ఉంటుంది. గుంటూరు కారం సైతం అదే పంథాలో ఉంటుంది. మొత్తం మీద సినిమాకు మంచి కలెక్షన్లతో పాటు చాలా మందికి ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. అందుకే 2024 డైరెక్టర్ల వరుసలో త్రివిక్రమ్ 9వ స్థానంలో ఉన్నారు.