Top Heroes Cameo Roles
అతిథి పాత్రలు చేసిన టాప్ హీరోలు
హీరోలుగా ఎంత పెద్ద స్టార్లు అయినా క్యామియో కనిపిస్తే అభిమానులకు వచ్చే కిక్కే వేరు. ఇతర హీరోలతో ఎలాంటి విబేధాలు లేవనే సాంకేతాలు కూడా ఈ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తుంది. అయితే తెలుగులో అతిథి పాత్రల్లో నటించడం కొత్తేమి కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి ఈ విశేషణం ఉన్నప్పటికీ చిరంజీవి నుంచి ఇప్పటి హీరోల వరకు ఒక సారి చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు 155 చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ఇవి మత్రమే కాకుండా ఆయన అతిథి పాత్రలలో కూడా మెప్పించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తాయారమ్మ బంగారయ్య
కైకల సత్యనారయాణ, శావుకారి జానకీ ప్రధాన పాత్రలో 1979లో వచ్చిన తాయారమ్మ బంగారయ్య చిత్రంలో చిరంజీవి ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. ఆయన కెరీర్ తొలినాళ్లలో దరికి చేరిన అవకాశాలను వదులుకోలేదు. అందుకే ఏ పాత్రైనా సవాల్‌గా చేశారు.
కొత్తపేట రౌడీ
సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద హీరోహీరోయిన్లుగా నటించిన కొత్తపేట రౌడీ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు. 1980లో ఈ చిత్రం విడుదలైంది.
మప్పిలై
1989లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మప్పిలై చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం తరువాత రజనీకాంత్, చిరంజీవిల బంధం బలపడింది.
హ్యండ్సప్
జయసుధ, నాగబాబు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హ్యండ్సప్ చిత్రంలో చిరంజీవి ఓ క్యామియో రోల్ చేశారు. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి జయసుధనే స్టోరీని అందించారు.
శ్రీమంజునాథ
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు తెరకెక్కించిన శ్రీమంజునాథ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. శివుడి పాత్రలో ఆయన ప్రసన్నం అయిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. మాస్ పాటలు, ఫైట్లతో అలరించిన చిరంజీవి నిర్మలమైన పాత్రలో మెప్పించాడు. నిజానికి అది అతిథి పాత్రే అయినా మూడు గెటప్‌లలో అలరిస్తారు.
స్టైల్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన స్టైల్ చిత్రంలో చిరంజీవి ఓ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారు. లాస్ట్ ఫర్ఫార్మెన్స్ జరిగే ముందు ఫైట్ చేసి ఆ తరువాత ప్రైజ్ డిస్ట్రబ్యూట్ చేస్తారు.
మగధీర
మెగా తనయుడు రామ్ చరణ్ హీరోగా రూపొందిన రెండవ సినిమా మగధీరలో చిరంజీవి మెరుపులా అలా కనిపిస్తారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగస్టార్ సూపర్ హిట్ పాట బంగారు కోడిపెట్ట సాంగ్ ను రీమేక్ చేశారు. ఈ సాంగ్‌లో చిరంజీవి సైతం కాలు కదిపారు.
జగద్గురు ఆది శంకర
శ్రీకృష్ణడు, రాముడు గెటప్‌లలో ఎన్టీఆర్, వెంకటేశ్వస్వామి గెటప్‌లో సుమన్ ఆ తరువాత శివుడి పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు చిరంజీవి. 2013లో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి ఆ పరమేశ్వరునిలా దర్శనం ఇచ్చారు.
బ్రూస్లీ
శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ ఫైట్ మాస్టర్‌గా అలరించిన చిత్రం బ్రూస్లీ. 2015లో తెరకెక్కిన ఈ మూవీలో ఓ కీలక సన్నివేశంలో మెగాస్టార్ ఎంట్రీ ఉంటుంది. ఆయన ఎంట్రీ అప్పుడు వచ్చే బీజీఎం ఇప్పటికీ చాలా ఫేమస్.
వీటితో పాటు హనుమాన్ అనే 2డీ అనిమేషన్ చిత్రానికి బుల్లి హనుమాన్ పాత్రకు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంతే కాకుండా పలు సినిమాలకు ఓపెనింగ్ వాయిస్ ఓవర్ సైతం ఇచ్చారు. అందులో అల్లు అర్జున్ నటించిన వరుడు, జగద్గురు ఆది శంకర, రుద్రమదేవి, గుంటూరోడు, గాజీ, సన్ ఆఫ్ ఇండియా, బ్రహ్మాస్త్రా, పొన్నియన్ సెల్వన్ పార్ట్1, పార్ట్ 2 వీటితో పాటు రంగమార్తండ సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇతర హీరోల సినిమాల్లో ఎలాంటి అతిథి పాత్రలు చేయలేదు కానీ ఆయన కెరీర్ తొలినాళ్లలో తండ్రి నందమూరి తారక రామారావుతో కలిసి అనేక చిత్రాల్లో కనిపించారు. 1974లో తాతమ్మ కల చిత్రంతో ఆయన సిల్వర్ స్క్రీన్ ప్రస్థానం మొదలైతే.. డెబ్యూ హీరోగా ఆయన తొలి సినిమా సహసమే జీవితం వరకు మొత్తం 11 చిత్రాలలో నటించారు. అందులో రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమ కవి, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీం అనర్కలి, శ్రీమద్వీరాట్ పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, అనురాగ దేవత, సింహం నవ్వింది లాంటి చిత్రాలలో నటించారు.
అక్కినేని నాగర్జున సుడిగుండాలు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా తెరపై తెరంగేట్రం చేశారు. ఆ తరువాత 1988లో నాగేశ్వర్రావు నటించిన రావుగారి ఇల్లు చిత్రంలో నాగర్జున్ ఓ చిన్న పాత్రలో అలరించాడు. ఇక 1995లో కైకల సత్యనారాయణ లీడ్ రోల్ చేసి ఘటోత్కచుడు చిత్రంలో నటించారు. రాఘవ లారెన్స్ తెరకెక్కించిన స్టైల్ చిత్రంలో విలన్లను కుమ్మేసే సీన్లో కనిపించారు. ఆ తకిట తకిట, దొంగాట వంటి చిత్రాలలో కూడా ఆయన క్యామియో రోల్ చేశారు. తనయుడు అఖిల్ మొదటి చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో కనిపించారు. నిర్మల కాన్వెంట్ చిత్రంలో కనిపించారు. అలాగే ప్రేమమ్ చిత్రంలో విక్రమ్ ఫాదర్ క్యారెక్టర్‌లో మెరిసారు.
విక్టరీ వెంకటేష్ సైతం చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా 1971లో తెరకెక్కిన ప్రేమ్ నగర్ చిత్రంలో వెంకటేష్ కనిపించారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రంలో కనిపించారు. అబ్బాయి రానాతో కలిసి కృష్ణం వందే జగద్గురు చిత్రంలో చిందేశాడు. ప్రేమమ్ చిత్రంలో విక్రమ్ మామగా, అజ్ఞతవాసిలో పవన్ కల్యాణ్‌తో దర్శనం ఇచ్చారు. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా చిత్రంలో దేవుడి పాత్రలో నటించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాబ్ చిత్రాలలో అన్నయ్య చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
1979లో నీడ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు వరుసగా పోరాటం, శంఖారావం, బజారురౌడీ, ముగ్గురు కొడుకులు, గుడాచారీ 117, కొడుకు దిద్గిన కాపురం, అన్నదమ్ములు, బాలచంద్రుడు వంటి చిత్రాలలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత జల్సా, బాద్ షా, శ్రీశ్రీ, ఆచార్య వంటి చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్రస్తుతం ముఫాసా సిరీస్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
ఇక ప్రభాస్ కన్నప్ప చిత్రంలో శివుడిగా కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ సైతం బ్రహ్మర్షి విశ్వమిత్ర, రామాయణం వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యారు. ఆ తరువాత చింతకాయల రవి చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో కనిపించారు. అలాగే రామ్ చరణ్ ఖైదీ నెం 150 చిత్రంలో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే పాటలో స్టెప్ వేశారు. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన కిసికా బాయ్ కిసికా జాన్ బాయ్ మూవీలో లుంగి పాటకు డ్యాన్స్ చేశారు.