Top Police Characters In Tollywood
తెలుగు పరిశ్రమలో బెస్ట్ పోలీసు క్యారెక్టర్లు
సినిమాల్లోని క్యారెక్టర్లను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా రాయాలని ప్రతీ రచయితకు ఉంటుంది. కానీ అన్నిసార్లు అది కుదరకపోవచ్చు. ఏదైనా మూవీ చూసినప్పుడు ఫలానా క్యారెక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడకుంటాము. ఇటీవల విడుదల సరిపోదా శనివారం చిత్రంలో పోలీసు క్యారెక్టర్ చేసిన ఎస్.జే సూర్య గురించి మీడియాలో ఎలాంటి టాక్ నడిచిందో అందిరికీ తెలిసిందే. హీరో నాని కన్న ఎక్కువగా ఆయన చేసిన దయానంద్ పాత్ర గురించి మాట్లాడుకున్నారు. అలాంటి చరిత్రలో నిలిచిపోయిన పోలీసులు క్యారెక్టర్ల గురించి ఒక సారి చర్చిద్దాం.
పోలీసులు క్యారెక్టర్ అనగానే అందరికీ గుర్తుకుకొచ్చేది అగ్ని. అగ్నిగా సాయి కుమార్ డైలాగ్స్, ఆయన యాక్షన్ సీన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంటుంది. పోలీసు స్టోరీ సినిమాలో సాయి కుమార్ యాక్టింగ్ ఎంత వైవిధ్యంగా ఉంటుందో తెలిసిందే. ” కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలయితే కనిపించని నాలుగో సింహామేరా ఈ పోలీసు” అనే డైలాగ్ ఎంతో ఫేమస్ అయింది.
రౌడీ ఇన్స్ పెక్టర్ సినిమాలో బాలకృష్ణ నటన అందరినీ కట్టిపడేసింది. ఈ చిత్రం తరువాత లక్ష్మీనరసింహా చిత్రం సైతం పోలీసు గెటప్‌లో బాలకృష్ణకు మంచి పేరు తీసుకొచ్చింది. బాలయ్య అంటేనే భారీ డైలాగ్‌లకు ఫేమస్ కాబట్టి లక్ష్మీనరసింహాలో వచ్చే డైలాగ్స్‌కు థియేటర్లు బద్దలయ్యయి.
మహేష్ బాబు తొలిసారిగా పోలీసు క్యారెక్టర్ చేసిన చిత్రం పోకిరి. సినిమా అంతా ఆయన పోకిరిగా కనిపించే పోలీసు. ఇక క్లైమాక్స్ లో కృష్ణ మనోహర్ ఐపీఎస్‌గా మహేష్ బాబు ఎంట్రీ సినిమాకు హైలెట్. ఆ తరువాత దూకుడు చిత్రంలో పోలీసుగా చేశాడు కానీ మహేష్ కు మాస్ ఇమేజ్‌ను తెచ్చిన పోలీసు క్యారెక్టర్ మాత్రం పోకిరి సినిమానే.
పోసాని కృష్ణ మురళి ఎన్నో పోలీసులు పాత్రలు చేశారు. కానీ అందరికీ గుర్తుండేది మాత్రం మూర్తినే. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ చిత్రంలో దయాగా ఎన్టీఆర్ సైతం అద్భుతమైన మార్క్ కొట్టేశారు. ఈ చిత్రంలో ఈ రెండు పోలీసు క్యారెక్టర్లు తెలుగు సినిమాలో నిలిచిపోతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో కోర్టులో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది. అలాగే పోసనీ సెల్యూట్ చేస్తూ చెప్పే సీన్ సైతం గూజ్ బంప్స్ తెప్పిస్తుంది.
సిల్వర్ స్క్రీన్ పై గబ్బర్ సింగ్ క్యారెక్టర్ ఎవరూ మరిచిపోలేని ఓ అద్భుతం. పోలీసు క్యారెక్టర్ లో తొలిసారిగా కనిపించిన పవన్ కల్యాణ్ ఆయన అభిమానులను మాయ చేశాడు. ముఖ్యంగా ఆ పాత్ర స్వాభావం, టైమంగ్ అందరిని కట్టిపడేసింది. ఆ తరువాత సర్దార్ గబ్బర్ సింగ్ అని ఓ చిత్రాన్ని తీశారు కానీ అది పెద్దగా ఆడలేదు. ఇప్పుడు మళ్లీ హరీష్ శంకర్ కాంబినేషన్‌ల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది. చూడాలి మరీ గబ్బర్ సింగ్‌కు ఈక్వల్ గా ఉంటుందో లేదో.
అంకుశం సినిమాలో రాజశేఖర్ యాక్టింగ్ చూసీ ఫిదా కానివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. విజయ్ పాత్రాలో ఆయన సిన్సియారిటీ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. కోడిరామకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఓ ప్రభంజనం. రాజశేఖర్ కేరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం అంకుశం. ఆ సమయంలో చాలా మంది ఆయన్ను ప్రేరణగా తీసుకొని పోలీసులు అవ్వలని ట్రైనీంగ్ తీసుకున్నారు అంటే అంకుశం ఎంతలా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
నాగార్జున పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం శివమణి. శివమణి నాక్కొంచెం మెంటల్ అంటూ నాగార్జున చేసే రచ్చ మాములుగా ఉండదు. ప్రతీ ఒక్కరినికి ఉత్సాహాపరుస్తుంది. నాగార్జున కెరీర్ లో పోలీసులు క్యారెక్టర్ విషయానికి వస్తే శివమణి ది బెస్ట్, ప్రేక్షకులు సైతం ఆ క్యారెక్టర్ ను మరిచిపోలేరు.
ఖడ్డం సినిమాలో శ్రీకాంత్ క్యారెక్టర్ ఇప్పటికీ ఓ అద్భుతం అని పిస్తుంది. ఉగ్రవాదుల చేతులో తన ప్రేయసిని పొగొట్టున్న ఆయన దేశం మీద ప్రేమ, ఉగ్రవాదులు అంటే కోపంతో రగిలిపోయే క్యారెక్టర్ అందరిని ఇన్సిపైర్ చేసింది. ఈ చిత్రంలో ఆయన లుక్ రా గా కనిపించేందుకు అసలు మెకప్ వేయలేదు. అందుకే ఆ పాత్ర అంత నేచురల్‌గా వచ్చింది. ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తిండిపోయింది.
ప్రకాశ్ రాజ్ నటించిన పోలీసు క్యారెక్టర్లలో ఠాగూర్ సినిమా ఎంతో ప్రత్యేకమైనది. ప్రభుత్వ ఆఫీసులల్లో పని చేస్తున్న లంచగొండులను హతమారుస్తున్న హీరో చిరంజీవిని పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు యాజమాన్యం మొత్తం అహోరాత్రలు పనిచేస్తున్నా ఆయన ఆచూకీ కనపెట్టలేరు. అదే సమయంలో కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న ప్రకాశ్ రాజ్ అతని కాలేజీ డిటైల్స్ నుంచి హీరో ఫోటో వరకు అన్ని ఆధారాలను సేకరించిన విధానం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పటికీ ప్రకాశ్ రాజ్ పాత్ర గుర్తిండిపోతుంది.
విక్రమార్కుడు సినిమాలో రవితేజ పోలీసోడు అంటే ఇలానే ఉంటాడేమో అనిపించేలా యాక్ట్ చేశారు. ఆయన చెప్పే డైలాగ్స్ అందరికీ గూజ్ బంప్స్ తెప్పిస్తాయి. నిజాయితీగా సమస్యకు ఎదురెల్లి ప్రాణాలను సైతం లెక్కచేయని విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్ర ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఉంటుంది. భయం గురించి విక్రమ్ సింగ్ చెప్పే డైలాగ్, మీసం మీద చేయి ఉండాలి అని చెప్పే డైలాగ్స్ చాలా ఫేమస్. రాజమౌళి ఆ క్యారెక్టర్ ను రాసిన విధానం అందరిని మెపించింది. అదే తరహా క్యారెక్టర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు రాసినట్లు అనిపిస్తుంది. అల్లూరి సీతారామ రాజు కూడా లక్ష్యం కోసం దేన్ని పట్టించుకోని మొండితనం ఉంటుంది. ఈ రెండు పాత్రలకు దగ్గరి పోలికలు ఉంటాయి.
ఇలాంటి పోలీసు పాత్రలు ఎన్నో ఏళ్లుగా వెండితెరపై ప్రేక్షకుల మన్ననలను పొందుతూనే ఉన్నాయి. వాటిన్నింటిలో మూవీ లవర్స్ సులువుగా గుర్తుపట్టే పాత్రలు ఇవన్నీ. ఇదే తరహాలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఎస్పీ పరసురాం, ముగ్గురు మొనగాళ్లు వంటి చిత్రాలలో చిరంజీవి ఆకట్టుకున్నారు. అలాగే వెంకటేష్ హీరోగా చేసిన సూపర్ పోలీసు, ఘర్షణ చిత్రాలు కూడా ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి.