Top Telugu Villains
తెలుగు ప్రేక్షకులు మెచ్చే ప్రతీనాయకులు
తెరమీద కథానాయకుడి బలం తెలియాలంటే ప్రతి నాయకుడు బలంగా, క్రూరంగా ఉండాలి ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదే థీయరీని ఇన్ని సంవత్సరాలుగా అన్ని భాషల రచయిత, దర్శకులు ఫాలో అవుతున్నారు. సినిమాలో విలన్ పాత్రలు వచ్చినప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉండాలో రచయిత ముందే ఊహించి.. విలన్ పాత్రను రాసుకుంటాడు. అది తెరమీద వర్కౌట్ అయినప్పుడు సీన్ అద్భుతంగా పండుతుంది. దాంతో విలన్ కు ప్రేక్షకుల్లో ఆదరణ లభిస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలుగా తెరమీద ఎంతోమంది విలన్లు యాక్ట్ చేశారు. అందులో పేరు మోసిన ప్రతి నాయకులు ఎవరో ఒకసారి చూద్దాం.
తెలుగు సినిమా ప్రస్థానంలో జానపద, సోషల్ డ్రామా చిత్రాల తర్వాత కాస్త కమర్షియల్ చిత్రాలు మొదలయ్యాయి. ఆ సమయంలో రాజనాల పేరు వినే ఉంటారు. అప్పట్లో రాజనాల ఓ పెద్ద విలన్. రాజనాల తెరమీద కనిపిస్తున్నారు అంటే ప్రజల్లో ఒక రకమైన గగుర్పాటు వచ్చేది. నర్తనశాల(1963), పలనాటి యుద్ధం (1966), శ్రీకృష్ణ విజయం (1971) చిత్రాలలో ఆయన గొప్ప విలన్ గా పేరుగాంచారు.
ఈయన తర్వాత యాక్టర్ కైకాల సత్యనారాయణ విలన్ పాత్రలు చేశారు. ఆయన కెరీర్ మొదట్లో పౌరాణిక చిత్రాలతో పాటు జానపద, కమర్షియల్ చిత్రాలలో కూడా విలన్ పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆహార్యం, నడవడిక, గాంభీర్యం విలన్ గా ఆయన్ను ప్రేక్షకులను నమ్మించాయి. అందుకే ఆయన చాలా నాళ్ళు తెరమీద ప్రతినాయకుడి పాత్రలో జీవించారు. ఆయన తర్వాత నటుడు ప్రభాకర్ రెడ్డి, నాగభూషణ్ కొంతకాలం తెలుగు తెరపై విలన్ పాత్రలు చేశారు.
1981 సంవత్సరంలో రావు గోపాల్ వర్మ తెరమీదికి వచ్చి వినూత్నమైన విలనిజాన్ని ప్రేక్షకులకు రుచి చూపారు. విలన్ గా ఆయన బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉండేది. త్యాగయ్య, కొండవీటి దొంగ, ఊరికి మొనగాడు, వంటి చిత్రాలలో ప్రతి నాయకుడిగా గొప్ప పేరు సంపాదించారు. ఆయన ఆహార్యం, భాష కూడా విలన్ పాత్రకు సరిపోయినట్లు ఉండేది. ఆ తర్వాత నూతన ప్రసాద్ గొల్లపూడి మారుతి రావు, కోట శ్రీనివాసరావు, సైతం గూండా గిరిలో పేరుగాంచారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ వినూత్నమైన ప్రయత్నాలను చేశారు.
వీరి తర్వాత తెలుగు తెరపై అందరి చేత చివాట్లు తిన్న మరో ప్రతినాయకుడు రామ్ రెడ్డి. అప్పట్లో ఆయన పెద్ద విలన్. తెర మీదే కాదు బయట కూడా విలనే అని అందరూ నమ్మేవాళ్ళు అలా ఉండేది ఆయన స్క్రీన్ ప్రజెన్స్. అంకుశం సినిమాతో రామ్ రెడ్డి మొదటిసారి విలన్ గా కనిపించారు. ఆ తర్వాత ఒసేయ్ రాములమ్మా, పెద్దరికం, అమ్మోరు, గాయం, అనగనగా ఒక రోజు, అడవిచుక్క, నాగప్రతిష్ఠ (2003), తెలుగోడు, జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా, వీడు మనవాడే,నాయకుడు (2005) అతనికి బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు. అతని ఆఖరి చిత్రం మర్మం. ఎక్కువగా ప్రతినాయక పాత్రలే పోషించినా పెద్దరికం, అనగనగా ఒక రోజు లాంటి చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాడు.
ఆ తరువాత విలన్లను ఇతర ఇండస్ట్రీల నుంచి తీసుకొచ్చే ట్రెండ్ మొదలైంది. అలా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో అమ్రీష్ పూరిని బాలీవుడ్ నుంచి తీసుకొచ్చారు. ఆ తరువాత లక్ష్మీ ప్రసాద్ అనే మలయాళ నటుడిని విలన్ చేశారు. ఇక 2000 సంవత్సరం తరువాత వచ్చిన అన్నీ ఫ్యాక్షన్ చిత్రాలలో ముకేష్ రుషి చాలా పాపులర్. నరసింహారెడ్డి, ఇంద్ర సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈయన ఆ తరువాత తెలుగులో సెటిల్ అయిపోయాడు. అదే సమయంలో జయప్రకాశ్ నారయణ సైతం విలన్గా అలరించాడు. వరుసగా కొన్ని సినిమాల్లో విలన్ వేశాలు వేసి ఆ తరువాత కామెడీ విలన్ గా పేరు తెచ్చుకున్నారు.
ఇక అప్పటి నుంచి ప్రతీ సినిమాకు ఇతర భాషాలను నుంచి విలన్లను తీసుకొచ్చారు. అదే సమయంలో విలన్ పాపులారిటీ సంపాదించిన మరో స్టార్ నటుడు ప్రకాశ్ రాజ్. ఫ్యాక్షన్, యాక్షన్ మాత్రమే కాదు ఏ జోనర్ చిత్రం అయినా దానికి తగ్గట్లు నటించే నటుడు ప్రకాశ్ రాజ్. కామెడీ పంచే విలన్ అయినా, కమర్షియల్ విలన్ అయినా తన స్టైలే వేరు. ఒక్కడి చిత్రంలో ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ చూశాక విలన్ అంటే ఇలా కూడా ఉంటాడా అన్న అనుమానం వచ్చిందట. నిజాయితీగా అమ్మాయిని ప్రేమించే పైశాచిక ప్రేమికుడు.. ఈ పాత్ర తరువాత ఆయన చాలా సినిమాల్లో, ఇప్పటికీ కూడా విలన్ వేశాలు వేస్తున్నారు. తరువాత కాస్త స్టైలిష్ విలన్ గా పేరుతెచ్చుకున్న నటుడు సోనూసూద్. సూపర్ చిత్రంతో తెలుగుకు పరిచయం అయిన ఆయన ఎన్నో విలన్ పాత్రలు చేసినప్పటికీ అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ చేసి తెలుగులో ఉత్తమ విలన్ గా ఎదిగాడు.
ఆ తరువాత సరికొత్త ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. హీరోగా మార్కెట్ తగ్గిన నటులు విలన్ అవతారం ఎత్తారు. అందులో జగపతి బాబు మొదటి స్థానంలో ఉన్నారు. హీరోగా ఎన్నో చిత్రాలు చేశారు. ఆయన వేసే పాత్రలు సామాన్య మధ్యతరగతి భర్త పాత్రలు వేశారు. సౌమ్యుడిగా ఉన్నారు. ఇక లెజెండ్ చిత్రంతో రూట్ మార్చి గెటప్ ఛేంజ్ చేశారు. విలన్ గా తెరకు పరిచయం ఫుల్ బిజీ అయిపోయారు. అదే తరహాలో శ్రీకాంత్ సైతం విలన్ గా చేస్తున్నారు. ఆఖండ చిత్రంలో ఆయన చూపించిన టెంపర్ మెంట్కు చూసే జనాలకు మెంటల్ వచ్చేసింది. వీరికంటే ముందే బల్లలా దేవగా రానా అదరగొట్టాడు. ఇప్పుడు యువ హీరోలు అయినా ప్రిన్స్, సునిల్ కూడా విలన్లుగా నటిస్తున్నారు. పాత్ర ఏదైనా మెప్పించడమే నటుడి కర్తవ్యం అందుకే విలన్ పాత్రలు చేస్తున్న ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతేనే ఉంటారు.