Reading Time: 3 mins

Utsavam Movie Pre Release Event Highlets
ఉత్సవం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

హార్నిబిల్ పిక్చర్స్ బ్యానర్ పై సురేశ్ పాటిల్ నిర్మాతగా అర్జున్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఉత్సవం. సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం రీసెంట్ గా గ్రాండ్ ప్రీ రిలీస్ ఈవెంట్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్సవం మూవీ కాస్ట్ అండ్ క్రూ పాల్గొన్నారు. యంగ్ హీరో దిలిప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రియాలతో పాటు సీనియర్ నటీనటులు బ్రహ్మానందం, ప్రకాశక్ రాజ్, రాజేంద్రప్రసాద్, రఘుబాబు, రచ్చరవి తదితరులు నటించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతులమీదుగా టికెట్ తలాంచ్ చేశారు.

ఈ సందర్భంగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. డైరెక్టర్ పేరు అర్జున్ సాయి అని కానీ ఆయన నిజానికి పట్టువదలని విక్రమార్కుడని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ చిత్రాన్ని భగీరథుడులా తెరకెక్కించారని కొనియాడారు. పౌరాణిక నాటక నేపథ్యంలో ఓ చక్కని లవ్ స్టోరీని తెరకెక్కించారని చెప్పారు. అలాగే హీరో దిలిప్ ప్రకాశ్ చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారని, ఎక్కడా కూడా కొత్తవాడనే ఆలోచన లేకుండా నటించారని తెలిపారు. ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ చాలా అభిరుచి ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఈలాంటి చిత్రాలు మరెన్నో చేయాలని కోరారు. కనుమరుగవుతున్న పౌరాణిక నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయడం జరిగిందని.. ప్రకాశ్ రాజ్ లాంటి నటులు ఈ సినిమాలో ఆక్ట్ చేయడం సంతోషమన్నారు. అంతే కాదు ప్రశాష్ రాజ్ నాటక రంగానికి ఎంతో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సినిమాను కచ్చితంగా థియేటర్లో చూసి ఆదరించాలని కోరారు.

రంగస్థలం నుంచి రంగులస్థలం వరకు రావడం సంతోషంగా ఉందని అనంత్ శ్రీరామ్ తెలిపారు. తాను కూడా చిన్నతనంలో నాటకాలలో యాక్టింగ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అర్జున్ సాయికి ధన్యవాదాలు తెలిపారు. అర్జున్ సాయి రెండు కళ్ళలో ఒకదానిలో కరుణ, మరోదానిలో హాస్యం ఉన్నాయని అందుకే ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీశారని తెలిపారు. ఈ కథ అందరికి నచ్చుతుందని, ఈ వేడుకకు వచ్చిన అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలిపారు.

నటుడు రఘుబాబు మాట్లాడుతూ ఎంతో మంది కలిసి పనిచేసిన ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. చాలా రోజుల తరువాత ఇలాంటి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని, షూటింగ్‌లో ఎంతో ఎంజాయ్ చేసినట్లు చెప్పారు. ముఖ్య అతిథి డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఉత్సవం సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చిందని. నాటకాల నుంచి వచ్చిన చాలా మంది నటులు వెండితెరను ఏలారని, అందులో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లు ప్రథమ స్థానంలో ఉంటారని చెప్పారు. నాటకం అనేది అమ్మ లాంటిది, సినిమా అనేది అమ్మ జన్మించిన బిడ్డలాంటిది అని చెప్పారు. నాటక రంగం ఇప్పటికి చాలా చోట్ల ఆదరణ పొందుతుందని, తానే చాలా సార్లు ఫ్రైజ్ లు ఇవ్వడానికి వెళ్లినట్లు చెప్పారు. ఉత్సవం చిత్రంలో చాలా మంది నటీనటులు ఉన్నారని, వారందరితో తాను పని చేసినట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. ఇక సెప్టెంబర్ 13న విడుదల అవుతున్న ఉత్సవం చిత్రం కచ్చితంగా విజయోత్సవం జరుపుకుంటుందని చెప్పారు.

ఇప్పటివరకు 50 చిత్రాలకు పైగా డిస్ట్రిబ్యూట్ చేశామని, అన్నింటిలో ఈ చిత్రం చాలా స్పెషలని డిస్ట్రీబ్యూటర్ శశిధర్ అన్నారు. హీరో దిలీప్ ప్రకాశ్‌కు ఇది ఫస్ట్ ఫిల్మ్ లా లేదని చెప్పారు. ఆయన హార్డ్ వర్క్, శ్రమ వలన ఆ ఫీలింగ్ వచ్చిందని పేర్కొన్నారు. తెలుగులో రెజినా అద్భుతమైన నటీ అన్నారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. సెప్టెంబర్ 13న ఫామిలీ అందరితో ఈ సినిమా చూసి ఆనందించండి అని కోరారు. మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రూబెన్స్ మాట్లాడుతూ.. నిజంగా ఈ చిత్రం ఉత్సవం లాంటిది అని చెప్పారు. తనకు చిన్నప్పటినుండి నాటకాలు అంటే ఇస్టమన్నారు. ఆడియన్స్ ముందు స్టేజి పైన నాటక వేయడం మాములు విషయం కాదన్నారు. ఇక డైరెక్టర్ అర్జున్ సాయి చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని చెప్పారు. ఈ చిత్రం లో డ్రామా మాత్రమే కాదు, మంచి లవ్ స్టొరీ ఉందని తెలిపారు. హీరో దిలీప్ ప్రకాశ్ చాలా బాగా చేశారు. తనకు ఇది ఫస్ట్ సినిమాల లేదన్నారు. రెజీనా చాలా మంచి యాక్టర్ అని చెప్పారు.

సురేష్ పాటిల్ మాట్లాడుతూ.. చిత్రంలో అందరూ చాలా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగుందన్నారు. ఈ చిత్రంతో చాలా మంది నటీనటులు పని చేశారని, వారిని తెరపై చూస్తూ ఉంటే సినిమా అయిపోతుందని చెప్పారు. అలాగే డైలాగ్ రైటర్ రమణ మాట్లాడుతూ.. మాములుగా ఇల్లు కంటి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కానీ సినిమా చేసి చూడు అని వాడలన్నారు. సినిమా చేయడం అనేది ఒక యుద్ధం. దాన్ని అర్జున్ సాయి చాలా అద్భుతంగా చేశాడన్నారు. కళాకారుల మీద సినిమా చేయడం అనేది చాలా రిస్క్, కళాకారుల నిజ జీవిత కథ ఆధారంగా, 157 ఎల్లా సురభి కుటుంబాల కథను తీసుకొని కథ తీశామన్నారు. సినిమాలు వచ్చిన తరువాత నాటకరంగం సన్నగిల్లిందని అన్నారు. అంతేకానీ కళకు చావు లేదని, నాటకం రూపాంతరం చెంది సినిమా అయిందని తెలిపారు. ముఖ్యంగా సినిమాకు రెజినా కసాండ్రియానే మెయిన్ అట్రాక్షన్ అని అన్నారు. కొత్త డైరెక్టర్, కొత్త హీరో అని చూడకుండా కథను నమ్మి చిత్రాన్ని చేయడానికి ముందుకొచ్చిందని చాలా మంచి వ్యక్తిత్వం గలది అని రమణ అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా సినిమా చూసినట్లు వెంటనే శశిధర్‌కు కాల్ చేసిన నిజాం డిస్ట్రీబ్యూటర్ తీసుకోవాలని చెప్పినట్లు, వెంటనే శశిధర్ సినిమా చూసి ఓకే చేసినట్లు చెప్పారు. సినిమాలు తీయడం మాత్రమే కాదు సరైన పద్దతిలో విడుదల చేయడం అంత ముఖ్యం అని అన్నారు. తరువాత డైరెక్టర్ అర్జున్ సాయి మాట్లాడుతూ. సురభి కళాకారుల జీవిత చరిత్రను ఈ సినిమాలో చెప్పాలనుకున్నట్లు చెప్పారు. అయితే వారి కథతో పాటు మంచి లవ్ స్టోరీ సైతం ఉంటుందని చెప్పారు. ఇది కచ్చింతంగా ఫుల్ మీల్స్ లాంటి చిత్రం అని చెప్పారు.

కథానాయకుడు దిలీప్ ప్రకాష్ మాట్లాడుతూ.. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారని తెలిపారు. సినిమాలో పెద్ద యాక్టర్లు, టెక్నిషన్స్ పని చేశారని, మూవీకి పెద్ద బలం హీరోయిన్ రెజీనా అని చెప్పారు. ఇక డైరెక్టర్ అర్జున్ సాయి చాలా ట్యాలెంట్ ఉన్న వ్యక్తి అని, నిర్మాత సురేష్ సైతం గొప్ప కళాభిరుచి ఉన్న వ్యక్తి అని సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని తెలిపారు. హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మీ అందరిని కలవడం నిజంగా ఉత్సవంలా ఉందని చెప్పారు. సురభి నాటక కళాకారులకు థ్యాంక్స్ చెప్పారు. సినిమా కచ్చితంగా బాగుంటుందని, ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. విజయోత్సవ వేడుకలో మాట్లాడుకుందాం అని చెప్పారు.