Reading Time: < 1 min

VD13 మూవీ టైటిల్ టీజర్ అక్టోబర్ 18 విడుదల

ఈ నెల 18న విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల, దిల్ రాజు కాంబో సినిమా టైటిల్ టీజర్ విడుదల

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా వీడీ 13. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ కొత్త అప్ డేట్ వెల్లడించారు.

ఈ నెల 18న సాయంత్రం 6.30 నిమిషాలకు వీడీ 13 సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎస్వీసీ ఇవాళ అనౌన్స్ చేసింది. స్మాల్ టీజర్ ద్వారా ఈ సినిమా టైటిల్ వెల్లడించనున్నారు. ప్రస్తుతం వీడీ 13 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఈ జోడీకి ఎస్వీసీ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ తోడవడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

నటీనటులు:

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

టెక్నికల్ టీమ్ :

సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాతలు : రాజు – శిరీష్
రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల