Victory Venkatesh Birthday Special
విక్టరీ వెంకటేష్ బర్త్ డే స్పెషల్
విక్టరీ వెంకటేష్ యాక్షన్ అయినా, కామెడీ అయినా, రొమాన్స్ అయినా, సెంటిమెంట్ అయినా తనకంటూ ఓ ప్రత్యకమైన స్టైల్ ను ఏర్పాటు చేసుకున్నారు. తండ్రీ మూవీమొగల్ రామానాయుడు. ఆయన వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి తనదైన స్టైల్లో రాణించారు. కమర్షియల్ ఫార్మెట్ మాత్రమే కాకుండా కొన్ని ప్రయోగాలు చేశారు. యాక్షన్ సినిమాల కన్నా ఫ్యామిలీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఆయన ఫ్యామిలీ స్టార్ అయ్యారు. తెలుగు పరిశ్రమలో ఉన్న నాలుగు పిల్లర్లలో వెంకటేష్ ఒక పిల్లర్ గా ఉన్నారు. ప్రస్తుతం క్లాస్, మాస్ మాత్రమే కాకుండా ఊర మాస్ పాత్రలు కూడా చేస్తున్నారు. నారప్ప సినిమాలో ఆయన కనబరిచిన నటన కౌశల్యం మరిచిపోలేనిది. ఈరోజు వెంకీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.
దగ్గబాటి వెంకటేష్ డిసెంబర్ 13 1960లో జన్మించారు. ఫ్యామిలీ అంతా ఫిల్మ్ బ్యాగ్రౌండే కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా 1971 లో ప్రేమ్ నగర్ చిత్రంలో నటించారు. ఇక హీరోగా 1986లో కలియుగ పాండవులు సినిమాతో తెరంగేట్రం చేశారు. వెంకటేష్ కేరీర్ ను నిలబెట్టిన సినిమాలు ధర్మచక్రం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, గణేష్, ప్రేమించుకుందాం రా, రాజా ఆ తరువాత నువ్వునాకు నచ్చావు, లక్ష్మీ, తులసి వంటి కమర్షియల్ సినిమాలు చేశారు. వెంకటేష్ ఫ్యామిలీ హీరో అంటారు. ఈ జాబితా సంక్రాంతి మొదలుకొని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వరకు చాలా సినిమాలు ఉన్నాయి. 38 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు 84 సినిమాల్లో నటించి 7 నందీ అవార్డులు, 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.
విక్టరీ వెంకటేష్ నటించిన 84 సినిమాల్లో 1 చైల్డ్ ఆర్టిస్ట్. 5 సినిమాల్లో క్యామియో. 3 హిందీ సినిమాలు, 2 వెబ్ సిరీస్ లు చేశారు. అందులో రానా నాయుడులో యాక్ట్ చేశారు. మయాబజార్ ఫర్ సేల్ అనే సిరీస్ ను ప్రొడ్యూస్ చేశారు. ఆయన 50 వ సినిమా వాసు. యాక్టింగ్ మాత్రమే కాకుండా గురు సినిమాలో ఒక సాంగ్ పాడారు. అలాగే శ్రీనివాస కల్యాణం, క్రాక్, మోసగాళ్లు చిత్రాలకు వాయిస్ ఓవర్ తో నరేట్ చేశారు. ఆల్లాద్దీన్ సినిమాలో జెన్నీ పాత్రకు తెలుగు డబ్బింగ్ ఇచ్చారు. నెక్ట్స్ ఎఫ్ 4, సంక్రాంతికి వస్తున్నాము సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇలాగే మరిన్ని సినిమాలు చేయాలని బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున వెంకటేష్ కు బర్త్ డే విషేస్ చెబుతున్నాము.