Vidudhala 2 Movie Review
విడుదల 2 మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వున్న నటుడు విజయ్ సేతుపతి, డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో విడుదల పార్ట్ 2 పై అంచనాలుండటం, పైగా విడుదల పార్ట్ 1 కమర్షియల్ గా సక్సెస్ కావడంతో ప్రేక్షకులు ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై సంవత్సరం నుండి వెయిట్ చేస్తున్నారు..తమిళ నాట కమెడియన్ గా మంచి పేరున్న నటుడుసూరి ని మెదటిసారిగా ఒక సీరియస్ &సిన్సియర్ కానిస్టేబుల్ పాత్రలో హీరోగా దర్శకుడు వెట్రిమారన్ ప్రెజెంట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. పార్ట్ 2 విషయానికొస్తే విజయసేతుపతి హీరోగా, సూరి సపోర్టింగ్ పాత్రలో కనిపిస్తాడు,ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా మంజు వారియర్ నిలుస్తుండటం విశేషం.ఈరోజు విడుదలైన ‘ విడుదల పార్ట్ 2‘సినిమా ఫస్ట్ పార్ట్ మాదిరే ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్నది సమీక్ష చేద్దాం..
కథ
సుమారు నలభై ఏభై ఏళ్ళ క్రితం 1970-80 లలో తమిళనాడులోని ఉరవపాడు అనే కుగ్రామంలో దశకం మధ్యలో జరిగిన కథ. ఆ ఊర్లో ఓ ప్రభుత్వ మాస్టారు పెరుమాల్ అలియాస్ కరియప్పన్ (విజయ సేతుపతి) అందరికి చదువు చెబుతూ అందరిలో చైతన్యం తీసుకొస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ ఊరి జమీందార్.. ఆ ఊర్లో ఎవరికైనా పెళ్లి జరిగితే.. తొలి రోజు ఆ పెళ్లి కూతురును అనుభవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఈ ఊర్లో ఉండే ఓ కుర్రాడు ఓ ముఠాగా ఏర్పడి ఆ ఊరి జమీందారును నరికి చంపుతారు. ఈ క్రమంలో ఆ ఊరి జమీందారు కుమారుడు ఈ హత్య పాలుపంచుకున్న వాళ్లను హింసించి చంపుతుంటాడు. అయితే అసలు చంపిన కుర్రాడిని పెరుమాళ్ తప్పిస్తాడు. ఈ క్రమంలో ఊరి జమీందార్ ను చంపిన కుర్రాడిని పోలీసులకు పట్టించి కోర్టులో ప్రవేశపెడదమనుకుంాడు. ఈ విషయాన్ని పోలీసులు ద్వారా తెలుసుకున్న జమీందార్ తో పాటు అతని ప్రైవేటు సైన్యం అతన్ని చంపుతారు. ఈ క్రమంలో పెరుమాల్ తీవ్రంగా గాయపడతాడు. ఆ తర్వాత కేఆర్ అనే కమ్యూనిస్టు నాయకుడు అతన్ని కాపాడతాడు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై దళ సభ్యుడు అవుతాడు. ఈ క్రమంలో కేఆర్ ఆ ఊరిలో పెత్తందారులు అతి కిరాతకంగా చంపబడతాడు. ఆ తర్వాత తమ గురువును చంపిన పెత్తందార్లను భూస్వాములను వేటాడుతూ చంపుతుంటాడు పెరుమాళ్ల. ఈ క్రమంలో జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఇతన్ని బాధ్యుడిని చేస్తూ పెరుమాళ్ ను పట్టుకుంటారు పోలీసులు. ఆ తర్వాత అతన్ని పోలీసులు ఏం చేసారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కుమరశన్ పాత్ర ఏమిటనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
గత కొన్నేళ్లుగా తెలుగు సహా దక్షిణాది భాషలకు చెందిన దర్శకులు 1970-80 నేపథ్యంలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో 70 నుంచి 80వ దశకంలో పోలీసులు, నక్సల్స్ మధ్య జరిగిన సంఘర్షణను తెరపై ఆవిష్కరించాడు. ఎపుడో ఫేడౌట్ అయిన నక్సలిజం బ్యాక్ డ్రాప్ ను మళ్లీ తెరపై ఆవిష్కరించాడు. ఇలాంటి సినిమాలు తెలుగు సహా ఇతర భాషల్లో చాలానే తెరకెక్కాయి. ముఖ్యంగా దొరలు, జమీందారులకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ లోని నక్సల్ బరి గ్రామంలో చారు మజుందార్ నేతృత్వంలో ఈ ఉద్యమం మొదలైంది. కొత్తలో అణగారిన ప్రజల కోసం పాటుపడిన నక్సల్స్ ఉద్యమం.. క్రమంగా దారి తప్పింది. ఆ తర్వాత విదేశీయుల చేతిలో ముఖ్యంగా చైనా తొత్తులుగా మారి సీపీఐ మావోయిస్ట్ గా రూపాంతరం చెందింది. ఇందులో కూడా హీరోతో పాటు అణగారిన వర్గాలు .. ఊరి పెత్తందార్ల చేతిలో నలిగిపోవడం వంటివి 80వ దశకంలో జరిగిన సంఘటనలను తెరపై చూపించాడు. ఒకప్పటి అగ్ర వర్ణ ఆధిపత్యం ముగిసిన సమ సమాజ స్థాపన జరిగిన ప్రస్తుత సమాజంలో ఇలాంటి కథలతో వెట్రిమారన్ ఏం చెప్పాలనుకున్నాడో అర్ధం కానీ విషయం. కానీ ఒకప్పటి జమీందారి, పెత్తందారి వ్యవస్థ పోలీసులు, నక్సల్స్ పై ఎలాంటి ప్రభావం చూపించే అంశాన్ని మాత్రం మెచ్చుకోవాలి. పై అధికారుల ఒత్తిడితో నలిగిపోయే పోలీసు వ్యవస్థను చూపించాడు. మరోవైపు నక్సల్స్ ప్రేమకథను కూడా ప్రస్తావించాడు. మరోవైపు ఈ సినిమా తమిళ నేటివిటి కొంత ఇబ్బంది పెట్టే అంశం. మొత్తంగా యూనివర్సల్ అప్పీల్ లేకుండా చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా దర్శకుడు కోణంలో సాగే విడుదల 2 అన్ని వర్గాలను కాకుండా ఓ వర్గం ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసినట్టు కనిపిస్తుంది. ఆ ఐడియాలజీని ఈ సినిమాలో మొత్తంగా చూపించాడు.
ముఖ్యంగా ఓ నక్సల్ నాయకుడిని పట్టుకొని జైలుకు తీసుకెళ్లి అతన్ని కోర్టు కచేరిలు అని తిప్పడం .. ఈ క్రమంలో ఆ నక్సల్ నాయకుడు తన బయోగ్రఫీ రాసి .. రాబోయే తరాలు దళం వైపు ఆకర్షితులు అవుతారని ప్రభుత్వ అధికారులతో చెప్పించడం వంటి అంశాలను ఇందులో సున్నితంగా సృశించాడు. ముఖ్యంగా పోలీసు, నక్సల్స్, ప్రభుత్వం, పెత్తందారి వ్యవస్థల మధ్య ఒకదాని కొకటి ఉన్న సంబంధాన్ని చూపించాడు. సినిమాటోగ్రఫీ .. అడవిలో పిక్చరైజేషన్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా అడవిలో నక్సల్స్, పోలీసుల మధ్య ఎన్ కౌంటర్ వంటివి సీన్స్ బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదను పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
విజయ్ సేతుపతి ఎంత మంది నటుడితో మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఇందులో అణగారిన ప్రజలను కాపాడే ఊరి మాస్టారి పాత్రలో ఒదిగిపోయారు. ఆ తర్వాత ప్రజాదళం ఉద్యమ నాయకుడిగా.. షుగర్ పరిశ్రమలో యూనియన్ లీడర్ పాత్రలో వివిధ వేరియేషన్స్ చూపించాడు. సూరీ ఓ కామన్ కానిస్టేబుల్ పాత్రలో ఒదిగిపోయాడు. మంజు వారియర్.. జమీందార్ కూతరు నుంచి నక్సల్ వైపు ఆకర్షితురాలయ్యే యువతి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. కన్నడ నటుడు కన్నడ కిషోర్ కె ఆర్ అనే ఉద్యమ నాయకుడిగా,విజయసేతుపతి పాత్రని ఉద్యమం వైపు నడిపే కీలక పాత్రలో నటించారు.
ప్లస్ పాయింట్స్
విజయ్ సేతుపతి నటన
ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్
వెట్రి మారన్ దర్శకత్వం
మైనస్ పాయింట్స్
పాత కథ
కథనంలో స్పీడ్ మిస్సవడం
ఎక్కువ చోట్ల డాకుమెంటరీ లా నరేషన్ తో కథ నడుస్తుండటం
పంచ్ లైన్.. ‘విడుదల 2’ ..ఓ మోస్తరుగా ఆకట్టుకునే ఎమోషనల్ డాక్యూ డ్రామా.
Movie Title :- Vidudala 2(dubbed from Tamil)
Banner :- Sri Vedakshara Movies
Release date:-20.12.2024
Cast:- Vijay Sethupathi, Manju Warrier, Soori, Bhavani Sre, Gautam Vasudev, Rajiv Menon
Directed by: Vetri Maaran
Music :- Ilaiyaraaja
Cinematography: R Velraj
Editing: R Ramar
Producer: Elred Kumar
Nizam Distributors:-Global Cinemas