Reading Time: 2 mins

Vijay Devarakonda’s Kingdom Teaser Review
విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్ రివ్యూ

విజయ్ దేవర కొండ నుంచి వస్తున్న ఆసక్తికరమైన సినిమా టీజర్, టైటిల్ విడుదల చేశారు. వీడి12 సినిమా పేరు కింగ్‌డమ్. టైటిల్ చాలా కొత్తగా ఉంది. ఇలాంటి టైటిల్స్ ను ఇంగ్లీష్ సినిమాలకు చూస్తూ ఉంటాము. గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా, సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి టీజర్ ను కూడా విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణగా ఈ టీజర్ నిలిచింది. టీజర్ అంతా ఒక యుద్ధ వాతవరణాన్ని చూపించారు. ఎగిసిపడే మంటలు, భీకర అరుపులు, తుపాకుల కాల్పులు, వీల్లులు ఇలా టీజర్ అంతా రక్తసిక్తంగా ఉంటే ఆ విజువల్స్ కు తోడు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ బీభత్సంగా ఉంది. ప్రతీ షాట్ విజువల్ పరంగా హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉంటే వాటికి ఎలివేషన్ ఇస్తూ యంగ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుద్ రవిచంద్రన్ చేసిన మ్యాజిక్ తారా స్థాయిలో ఉంది. టీజర్ లోని ఒక్కో పదం విల్లులా హృదయాన్ని తాకుతున్నాయి.

“అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం,
వలస పోయినా.. అలిసి పోయినా ఆగిపోనిది ఈ మహా రణం,
నేలపైన దండ యాత్రలు.. మట్టికింద మృతదేహాలు..
ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనాలు ఎవరికోసం?
రణ భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజుకోసం..
కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జాన్మాన్ని ఎత్తిన నాయకుడి కోసం. అంటూ సాగే ఈ వాయిస్ ఓవర్ చాలా బాగుంది. దానికి తగ్గట్లు విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. టీజర్ విజయ్ దేవరకొండ డైలాగ్ కూడా చాలా ఆసక్తిరేపుతుంది. రక్తపు మరకలతో పోలీసుల కస్టడీలో ఉన్నా విజయ్ దేవరకొండ… “ఎమైనా జేస్తా సర్… అవసరం అయితే మొత్తం తగలబెట్టేస్తా సర్” అనే ఫోర్స్ డ్ డైలాగ్ ఉంది.

1.55 సెకన్ల్ ఈ టీజర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఫస్ట్ యుగానికి ఒక్కడు, యుకలిప్టస్, కంగువా సినిమాలు గుర్తుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా నాగరికతకు, ఇంకా నాగరికతకు అలావాటు పడని ఒక ట్రైబ్స్ మధ్యసాగే యుద్ధంలా ఆ విజువల్స్ ఉన్నాయి. చాలా చోట్లా తుపాకులు పట్టుకొని పోలీస్ బలగాలు కాల్పులు జరుపుతుంటే వాళ్లతో సంప్రాదాయ ఆయుధాలు అయినా విల్లులు, బాణాలు పట్టుకొని కొంత మంది ట్రైబ్స్ యుద్దం చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఒక ఖైదీగా పట్టుబడ్డాడు. అక్కడి నుంచి పోలీసులకు సాయం చేయడానికి యుద్దరంగంలోకి దిగి ట్రైబల్స్ పై యుద్దం చేస్తాడు. అనేది టీజర్ చూస్తే అర్థం అవుతుంది. కానీ వాయిస్ ఓవర్ మాత్రం రణభూమిని చీల్చుకొనిపుట్టే రాజుకోసం అని ఒక వీరుడికోసం ఎలివేషన్ ఉంది. మరి ఆ రాజు ఎవరు? ఆ రాజు విజయ్ దేవరకొండ అయితే పోలీసులవైపు ఎందుకు యుద్దం చేస్తున్నాడు? అసలు జైలులో ఎందుకు ఉన్నాడు? అనే పాయింట్స్ ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. ఇక లాస్ట్ డైలాగ్ చెప్పే డైలాగ్ లో విజయ్ దేవరకొండ మెడలో బంగారు చైన్ ఉంది. అంటే ఆ సీన్ జరిగే సమయంలో ఇంకా ఆయన జైల్లో ఉండడు. ఎందుకంటే ఖైదీ ఒంటిపై ఎలాంటి అభరణాలు, తాడులు ఉండనివరు. కానీ అదే సమయంలో ఉక్రోషంతో ఆ డైలాగ్ ఎవరి కోసం చెబుతున్నాడు అనే పాయింట్ ఆసక్తిగా ఉంది. కేవలం టీజర్ మాత్రమే విడుదలైంది కాబట్టి ట్రైలర్ వస్తే కానీ కొన్ని డీటైల్స్ తెలియవు. టీజర్ బట్టి చూస్తే ఇది విజయ్ లో ఫైర్ లా అనిపిస్తుంది. అలాగే మే 30 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Written & Directed By: Gowtam Tinnanuri
Produced By: Naga Vamsi S – Sai Soujanya
Music Composed By: Anirudh Ravichander
Cinematography: Jomon T John ISC, Girish Gangadharan ISC
Editor: Navin Nooli
Production Designer: Avinash Kolla
Costume Designer: Neeraja Kona
Song Choreographer: Vijay Binni
Action Choreographer’s: Yannick Ben, Chethan D’Souza, Real Satish
Colorist: Ranga (Prasad Studio)
Sound Design: Sync Cinema
VFX Supervisor: Vasudeva Rao M
Co – Director: Sri Vastav
Production Team: Girish Dasika, Uma Mahesh Karumanchi
Chief Associate Director: Basher
Direction Team: B.V. Raveendra, Muthayam Vijay Kumar, Tirumala Reddy Akki, Mahesh Talluri, Geetha Vani Sapuri, Nallandula Jagadeesh, Vihari Mungamuri, Shrikaran Beecharaju, Akhil Raj, Parth Bane
Online Editor: Santosh Kiran
Still Photography: Prem
A Sithara Entertainments Production
in Association with Fortune Four Studios
Presented by Srikara Studios