Vishwaksen’ Laila Stylish First Look Unveiled
విశ్వక్సేన్ ‘లైలా’ స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్
మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన అప్ కమింగ్ ‘లైలా’లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్ లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ని షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా ఐ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
క్రిస్మస్ సందర్భంగా, మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు, ఇందులో విశ్వక్సేన్ అద్భుతమైన స్టైలిష్, రిచ్ అవతార్‌లో కనిపించారు. మోడరన్ అవుట్ ఫిట్ లో స్పోర్టింగ్ షేడ్స్, గోల్డ్ యాక్ససరీస్ ధరించి కూల్ అండ్ కాన్ఫిడెంట్ గా కనిపించారు. అతని పాత్రను, సోను మోడల్‌గా ప్రజెంట్ చేస్తూ, అతను మెడపై పచ్చబొట్టు, చేతులపై “సోను లవర్”, సోను కిల్లర్” అని రాసి ఉన్న టాటూలతో కనిపించాడు. అతని బోల్డ్ ఎక్స్ ప్రెషన్స్ పాత్ర కాంప్లెసిటీ మల్టీ-డైమెన్షనల్ నేచర్ ని సూచిస్తాయి. పోస్టర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
విశ్వక్సేన్ ఈ చిత్రంలో అమ్మాయి పాత్రను పోషించడానికి బ్యూటీఫుల్ గా మేక్ఓవర్ అయ్యారు. ఇందులో చాలా వేరియేషన్స్ చూపించబోతున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున లైలా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నటీనటులు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రైటర్: వాసుదేవ మూర్తి
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో