Reading Time: 3 mins

Vishwam Movie Review
విశ్వం మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

మాచో స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విశ్వం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఆడియన్స్ కు మంచి అంచనాలే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీను వైట్ల నుంచి ఆశించిన సినిమాలు రావడం లేదు, అలాగే హీరో గోపీచంద్ కు కూడా సరైన హిట్ లేదు. దీంతో వీరిద్దరికీ విశ్వం సినిమా హిట్ ఎంతో అవసరం. ట్రైలర్, ప్రచార చిత్రాలతో మంచి అంచనాలు తెచ్చుకున్న విశ్వం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ:
ఇండస్ట్రిలిస్ట్ బాచీరాజు (సునీల్) డబ్బుకు ఆశపడి టెర్రరిస్ట్ అయిన ఖురేషి(జిషు సేన్ గుప్తా) చెప్పిన పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. భారతదేశంలో ఇలాంటి ప్లాన్స్ చాలా ఉన్నాయని, దానికోసం ఇండియన్ స్టూడెంట్స్ ను హైరింగ్ చేసుకున్నట్లు చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న షఫీ, బాచీరాజు అన్నయ్య ఆయన మినిస్టర్(సుమన్) కు ఫోన్ చేసి వీరి కుట్రను చెప్తాడు. అలెర్ట్ అయిన ఖురేషి, బాచీరాజు షఫీని, సుమన్ ను చంపేస్తారు. సుమన్ చంపే క్రమంలో స్టూడెంట్ దర్శిని చూస్తుంది. తను చూడడం ప్రమాదం అని పాపను చంపాలని ఒక గ్యాంగ్ ను పంపిస్తారు అదే సమయంలో హీరో విశ్వం అమ్మాయిని కాపాడుతాడు. తాను గోపిగా అమ్మాయి ఫ్యామిలీతో కలిసి పోతాడు. అలా అమ్మాయిని కాపాడుతూ వస్తుంటాడు. శ్వేతా(కావ్య థాపర్), విశ్వకు ఇటలీలో పరిచయం ఉంటుంది. తనను అక్కడే ప్రేమిస్తాడు. స్వేత దర్శిని రిలేషన్ కూడా. విశ్వం పాపాను కాపాడాడా? లేదా?, విశ్వం గోపిగా ఎందుకు పరిచయం చేసుకున్నాడు? విశ్వం బ్యాగ్రైౌండ్ ఏంటి? విశ్వం, శ్వేతాల లవ్ స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే విశ్వం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
సినిమా టెర్రరిజంతో ప్రారంభం అవుతుంది. ఐఎస్ఎస్ టెర్రరిస్టులు ఇండియన్ స్టూడెంట్స్ ని ఎలా ట్రాప్ లో పడేస్తున్నారు, వారిని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది టచ్ చేశారు. ఇక సినిమా మెయిన్ ప్లాట్ సుమన్ చనిపోవడం, ఆ విషయాన్ని పాప దర్శిని చూడడంతో మొదలవుతుంది. సాక్ష్యంగా ఉన్న అమ్మాయిని చంపాలనేది విలన్ ప్లాన్, ఆ అమ్మాయిని కాపాడడంలో హీరో చేసే పోరాటమే ఈ సినిమాలోని కాన్ ఫ్లిక్ట్. ఇదే కథకు టెర్రరిజం అని మరో సబ్ ప్లాట్ ఆడ్ చేశారు. మొత్తంగా ఈ రెండు పాయింట్లను కలుపుతూ డైరెక్టర్ శ్రీనువైట్ల కథ రాసుకొని, కమర్షియల్ గా తెరకెక్కించి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. శ్రీనువైట్ల తనదైనా కామెడీ మార్కును ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్ ఆఫ్ లో హీరో ఎవరు, ఏంటి అనేది ఎక్కడా పెద్దగా రిజిస్టర్ అవ్వదు.. కానీ అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. దాంతో హీరో స్టోరీ ఏంటి అని ప్రేక్షకుల్లో ఉత్సుకత కలుగుతుంది.

ఇక సెకండ్ హాఫ్ లో కొంత భాగం ట్రైన్ ఎపిసోడ్ వెంకీ సినిమాను గుర్తుచేస్తుంది. అంత కామెడీ లేకపోయినా, వెన్నెల కిషోర్ పండించే కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత హీరో బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంది. టెర్రరిజం అంటే అతనికి ఎందుకు అంత కోపం అని చెప్పే పాయింట్స్ ఎమోషనల్ గా ఉంటాయి. చివర్లో ఒక చిన్న ట్విస్ట్ తో సినిమా ముగుస్తుంది. నిజానికి ఈ సినిమా పక్కా కమర్షియల్.

నటీనటులు:
విశ్వం సినిమా గోపీచంద్ వన్ మ్యాన్ షో. ఆయన యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. కానీ ఆయన కటౌట్ కు ఈ సినిమా సబ్జెక్టు కొంచెం తక్కువ అనిపిస్తుంది. కానీ ఆయన పాత్రలో చాలా బాగా మెప్పించారు. భిన్నమైన వేరియేషన్స్ ఉన్న పాత్ర లో ఒదిగిపోయారు. కావ్య థాపర్ కేవలం అందాలను ప్రదర్శించడానికి కాకుండా క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. రొమాంటిక్ గా, ఎమోషనల్ గా ఆకట్టుకున్నారు. ఇక దర్శనీ క్యారెక్టర్ చేసిన పాప చాలా నేచురల్ గా చేసింది. సునీల్ యాక్టింగ్ లోని వేరియేషన్ బాగుంది. సీనియర్ యాక్టర్ నరేష్, పృథ్వీ, వెన్నెల కిషోర్ తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక అంశాలు:
శ్రీను వైట్ల తన మార్కు చూపించాడు. విశ్వం కథతో మళ్లీ కం బ్యాక్ ఇచ్చాడు అని చెప్పవచ్చు. సినిమాలో స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇటలీలో తీసిన సీన్స్ చాలా బాగున్నాయి. సంగీతం విషయానికి వస్తే బీజిఎం ఎక్కడ ఇబ్బంది లేకుండా సాఫీగా సాగింది. అక్కడక్కడ కాస్త ఎడిటింగ్ షార్ప్ గా ఉంటే బాగుండు అనిపించింది. ఫైనల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఎక్కడ తగ్గలేదు.

ప్లస్ పాయింట్స్
హీరో యాక్టింగ్
ఎమోషనల్ సీన్స్
కామెడీ

మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేదు
అక్కడక్కడ స్లోగా సాగే కథనం

అంతిమ తీర్పు
విశ్వం.. ఈ దసరాకు వచ్చిన పక్కా కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

Movie Title : Viswam
Banner: People Media Factory, Chitralayam Studios
Release Date : 11-10-2024
Censor Rating : “U/A”
Cast : Gopichand, Kavya Thapar, Jisshu Sengupta, Naresh, Sunil, Pragathi, Kick Shyam
Director: Sreenu Vaitla
Music: Chaitan Bharadwaj
Cinematography : K V Guhan
Editor: Amar Reddy Kudumula
Producer: TG Vishwa Prasad, Venu Donepudi