VV Vinayak Birthday Special
వీవీ వినాయక్ బర్త్ డే స్పెషల్
మాస్ ఆడియెన్స్ పల్స్ తెలిసిన తెలుగు డైరెక్టర్లలో వీవీ వినాయక్ ఒకరు. ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే విందు భోజనంలా ఉంటుందని అందరూ భావిస్తారు. ఆయన మొదటి సినిమా ‘ఆది’తోనే అది ప్రూవ్ చేసుకున్నారు. ఆ సినిమాకు ఉత్తమ డెబ్యూ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. టాలీవుడ్ హీరోలు సైతం ఆయన కాంబినేషన్ లో సినిమా చేయాలని తహతహలాడేవారు. ఫ్యాక్షన్, యాక్షన్, ఫ్యామిలీ డ్రాామాతో పాటు సందేశాత్మకమైన చిత్రాలను కూడా తెరకెక్కించారు. టాలీవుడ్ అగ్ర హీరోలతో బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించారు.
వినాయక్ 1974 అక్టోబరు 9 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు గ్రామంలో జన్మించారు. హీరో చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి అభిమానం. ఈ ఇష్టమే వి.వి. వినాయక్‌ను సినిమాల వైపు తీసుకొచ్చింది. దాంతో హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు మొదలు పెట్టారు. డైరెక్టర్ సాగర్ దగ్గర కో – డైరెక్టర్‌గా కొన్ని రోజులు వర్క్ చేశారు. ఎన్టీఆర్ ను కలిసి ఆది కథ చెప్పి ఒప్పించారు. ఈ సినిమాతో ఇద్దరికీ మంచి బ్రేక్ పడింది. రెండో సినిమాగా బాలకృష్ణతో ‘చెన్నకేశవరెడ్డి’ తీసీ హిట్ కొట్టారు. వెంటనే దిల్ రాజు ప్రొడ్యూసర్ గా తన మొదటి సినిమా దిల్ తీశారు. ఈ చిత్రం నితిన్ కు భారీ విజయాన్ని అందించింది. నెక్ట్స్ తన ఫెవరెట్ హీరో చిరంజీవితో ‘ఠాగూర్’ అవకాశం వచ్చింది. ఈ సినిమా విజయంతో టాప్ డైరెక్టర్ స్థానంలో కూర్చున్నారు.
అల్లు అర్జున్‌తో ‘బన్నీ’, విక్టరీ వెంకటేష్‌తో ‘లక్ష్మి’, మళ్లీ ఎన్టీఆర్‌తో సాంబ, యోగి, కృష్ణ, అదుర్స్, బద్రీనాధ్, నాయక్, అల్లుడు శీను, అఖిల్, ఖైదీ నెంబర్ 150, ఇంటిలిజెంట్ సినిమాలను తెరకెక్కించారు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. ప్రస్తుతం మంచి కథతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన డైరెక్షన్ లో సినిమా రావాలని బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున వీవీ వినాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.