Reading Time: 2 mins

Who Is G.O.A.T In Telugu Industry
తెలుగులో గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎవరంటే

దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు డైరెక్టర్‌గా వస్తున్న తాజా చిత్రం ది గోట్. గ్రేట్ ఆఫ్ ఆల్ టైం అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ చూస్తే సాలిడ్ యాక్షన్ డ్రామా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంలో విజయ్ డబల్ యాక్షన్‌లో కనిపిస్తుండడం విశేషం అయితే సినిమా మొత్తం స్టార్ యాక్టర్లే కనిపిస్తున్నారు. మాములుగా విజయ్ సినిమాల్లో స్టార్ యాక్టర్లు ఉండడం సహజం. ట్రైలర్‌లో చూపించినట్లు స్క్వాడ్ అనే యాంటి టెర్రరిస్ట్ సంస్థలో హీరో గాంధీ చేసే సాహసాలే ఈ చిత్రం అని తెలుస్తుంది. వెంకట్ ప్రభు తెరకెక్కించిన చిత్రాలలో కొంత మ్యాజిక్ ఉంటుంది. అదే ఈ చిత్రంలో రిపీట్ కాబోతుందని అర్థం అవుతుంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవ, ప్రశాంత్, స్నేహా, లైలా వంటి స్టార్ నటులు ఉన్నారు. యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ కూడా మెప్పించింది. ఇక థియేటర్లో ఎలా ఉంటుందో చూడాలి.

గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే అన్ని విషయాలలో, అన్ని సమయాలల్లో ఉన్నతంగా ఉండేవారిని గోట్ అంటారు. అలాగే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ గోట్ అని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ మధ్య హైదరాబాద్‌లో జరిగింది. ఆ సందర్భంగా మూవీ యాక్టర్లను అడుగుతూ.. తెలుగులో గోట్ ఎవరు అంటే వారికి నచ్చిన వారి పేర్లు చెప్పారు. అందులో డైరెక్టర్ వెంకట్ ప్రభు తెలుగులో బాలయ్య బాబు గ్రేట్ ఆఫీ ఆల్ టైమ్ అని చెప్పారు. హీరోయిన్ మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పుట్టిన రోజున మూవీ ఈవెంట్ జరుగుతుందని, ఆయన సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తన్నాని చెబుతూ పవన్ కల్యాణ్ రియల్ గోట్ అన్నారు. ఆ తరువాత స్నేహ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పేరు చెప్పారు.

అయితే గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ఆయా సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ ఒక్కరే నెం.1 స్థానంలో ఉండలేరు. అదీ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఇక విభాగాలుగా చూస్తే తెలుగు యాక్టింగ్ పరంగా గోట్ ఎవరంటే అందరూ చెప్పే పేరు జూనీయర్ ఎన్టీఆర్ అంటారు. అలాగే డ్యాన్స్‌లో చెప్పాలంటే అల్లు అర్జున్, రామ్ చరణ్  పేరు చెబుతారు. గ్రేస్ విషయంలో గోట్ ఎవరూ అంటే ఇప్పటికీ చిరంజీవి పేరు చెబుతారు. కలెక్షన్ల విషయంలో ప్రభాస్ గోట్. ఫాలోయింగ్ విషయంలో పవన్ కల్యాణ్ గోట్. హ్యండ్‌సమ్ విషయంలో మహేష్ బాబు గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్.. కామెడీ విషయంలో రవితేజ గోట్ అంటారు. టైమింగ్ విషయంలో నాని గోట్, మాస్ ఆడియన్స్‌‌కు గోట్ అంటే బాలయ్య బాబు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆల్ టైమ్ గోట్ అంటే వెంకటేష్, ఇప్పటికీ చెదరని ఫిట్ నెస్‌లో గోట్ అంటే నాగార్జున అంటారు. టాలీవుడ్‌లో అందరు హీరోలు వారికి నైపుణ్యం ఉన్నదాంట్లో ది బెస్ట్ ఇస్తున్నారు. ఇక అన్ని విషయాల్లో గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే అందరూ చెప్పే పేరు.. తెలుగు సినిమాను ఆదరించే ప్రేక్షకుడు అని అంటారు.

దళపతి విజయ్ నటించిన గ్రేట్ ఆఫ్ ఆల్ టైం చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది. ట్రైలర్‌తో అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. ఇక సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హీరో విజయ్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలసిందే. ఇప్పటికే ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగు పెద్ద హిట్ సాధించాయి. లోకేష్ కనగరాజు దర్శకత్వంతలో విజయ్ నటించిన లియో చిత్రం తెలుగులో మంచి ఓపనింగ్స్ సాధించింది. ఇక గోట్ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.