Reading Time: 3 mins

Women Sports movies in India
మహిళ స్పోర్ట్స్ ఇండియన్ చిత్రాలు

మహిళలు అన్ని రంగాల్లో ఎలా దూసుకుపోతున్నారో చూస్తూనే ఉన్నాము. క్రిడారంగంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అందుకే వారి జీవిత కథ ఆధారంగా చలన చిత్రాలు తెరకెక్కాయి. నిజజీవితాలే కాకుండా ఎంతో మందికి స్పూర్తినిచ్చే కథలు కూడా తెరమీద ఆవిష్కరింప బడ్డాయి. ఈ రోజు జాతీయ మహిళాక్రీడల దినోత్సవం సందర్భంగా స్త్రీలపై వచ్చిన క్రీడాల చిత్రాలను ఒకసారి చూద్దాం.

అశ్విని

అశ్వని నాచప్ప జీవిత కథ ఆధారంగా 1991 లో ఈ చిత్రం తెరకెక్కింది. ఉషా కిరణ్ మూవీస్ పై పతాకంపై రామోజీరావు నిర్మాణంలో మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్వినీ నాచప్ప, భానుచందర్ నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు. 1991లో గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

చక్ దే ఇండియా

షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం చక్ దే ఇండియా. 2007లో విడుదలైన ఈ చిత్రాన్ని షిమిత్ అమీన్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. భారతీయ హాకీ కెప్టెన్ కబీర్ ఖాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో షారుక్ అద్బుతమైన నటనను కనబరిచారు. మహిళల హాకీ కెప్టెన్ గా మారి దేశం గర్వించే 2002లో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో గెలిచారు. ఈ సిినిమా ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.

మేరీ కమ్

ఇండియన్ లేడీ బాక్సర్ మేరీ కమ్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు ఓమంగ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2014లో విడుదలైన ఈ చిత్రంలో మేరీ కమ్ పాత్రలో ప్రియాంక చోప్ర నటించారు. ప్రియాంకతో పాటు రోబిన్ దాస్, సునిల్ తాప నటించారు.

దంగల్

భారతీయ రెజ్లింగ్ క్రీడాల విభాగంలో తెరకెక్కిన చిత్రం దంగల్. 2016లో విడుదలైన ఈ చిత్రం భారీ వసుళ్లను రాబట్టింది. నిషిత్ తివారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ సాక్షి తన్వర్, ఫాతిమా సనా షేక్, జైరా వసీం, సాన్య మల్హోత్రా, సుహానీ భట్నాగర్,అపరశక్తి ఖురానా నటించారు. 2017లో బీజింగ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. అలాగే రెండవ బ్రిక్స్ ఉత్సవంలో కూడా స్రీనింగ్ అయింది. 62వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో నాలుగు అవార్డులను గెలుచుకుంది.

గురు

ఓ సామాన్య యువతి బాక్సింగ్ లో ఎలాంటి విజయం సాధించింది అనే ఊహాజనితమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు సుధ కొంగర. 2017లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్, రితికా సింగ్, నాజర్‌, తనికెళ్ల భరణి నటించగా, సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించారు.

కౌసల్య కృష్ణమూర్తి

కౌసల్య కృష్ణమూర్తి 2019లో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా చిత్రం. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ. వల్లభ నిర్మించగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ , రాజేంద్ర ప్రసాద్ , కార్తీక్ రాజు, శివకార్తికేయన్ నటించారు.

విజిల్

తమిళంలో బిగిల్ పేరుతో విడుదలై ఈ చిత్రం మంచి వసుళ్లను రాబట్టింది. 2019లో అట్లీ దర్శకత్వంలో ఫుట్‌బాల్ ఆట నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్, నయనతార, వివేక్, యోగిబాబు, జాకీష్రాఫ్, డేనియల్ బాలాజీ, అనంత్‌రాజ్ నటించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించారు. గర్ల్స్ ను ఫుడ్ బాల్ ప్లేయర్స్ గా హీరో ఎలా తీర్చి దిద్దారు అనే పాయింట్ తో సినిమా తెరకెక్కింది.

సాండ్‌కే ఆంఖ్‌

సాండ్‌కే ఆంఖ్‌ 2019లో విడుదలైన హిందీ సినిమా. తుషార్ హీరానందని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 60 ఏళ్ల వయసులో షూటర్స్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్‌ నిజ జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. వాళ్ల జీవితంలో ఎదురైన సవాళ్లు వాటిని దాటి కొన్ని వందల పతకాలు అందుకున్న తీరును అద్భుతంగా అవిష్కరించారు. ఈ సినిమాలో తాప్సీ, భూమి ఫెడ్నేకర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

పంగా

కబడ్డి ఆట నేపథ్యంలో వచ్చిన పంగా చిత్రంలో కంగనా రనౌత్ నటించారు. ఈ చిత్రం 2020లో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది.

రష్మి రాకెట్

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన రష్మి రాకెట్ చిత్రం 2021లో విడుదలైంది. ఆకర్ష్ కురాన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రష్మీ విరా చిబ్బర్ పాత్రలో తాప్సీ నటించారు. గుజరాత్ కు చెందిన ఈ క్రీడాకారిణి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సైనా

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం సైనా. పరిణీతి చోప్రా టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమా 2021 లో విడుదలైంది. సామాన్య కుటుంబంలో పుట్టిన సైనా నెహ్వాల్ తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడాలో ఉన్నత స్థితిరి రావడానికి ఎలాంటి పరిస్థితులకు ఎదుర్కొన్నది అనేది ఈ సినిమా నేపథ్యం.అమోల్ గుప్త దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో విడదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

శబాష్ మిథాలి

ఇండియన్ మహిళ క్రికెటర్ మిథాలి రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం శబాష్ మిథాలి. 2022లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిథాలి పాత్రలో తాప్సీ పన్ను నటించారు.

గుడ్ లక్ సఖీ

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుడ్ లక్ సఖీ. 2022లో విడుదలైన ఈ చిత్రాన్ని నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. బ్యాడ్ లక్ సఖీగా పేరున్న ఒక అమ్మాయి షూటింగ్ ను ప్రొఫెషన్ గా ఎంచుకొని ఎలాంటి ఉన్నత స్థితికి వెళ్లింది అనేది కథాంశం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా.. జగపతి బాబు, ఆది పినశెట్టి తదితరులు నటించారు.

మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో 2024లో తెరకెక్కిన చిత్రం మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహిమ అగర్వాల్ పాత్రలో జాన్వీ మెప్పించింది.