Yash Movie Toxic Shooting Begins – Tel
యష్ చిత్రం టాక్సిక్ షూటింగ్ ప్రారంభం
కె జి ఎఫ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న కన్నడ నటుడు రాక్ స్టార్ యష్ నూతన చిత్రం TOXIC (టాక్సిక్) నేడు పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమాకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.కాగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్,సినిమా ఫైనాన్షియర్, నిర్మాత అయిన KVN ( వెంకట్ K నారాయణ్ ) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
గీతూ మోహన్ దాస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి, హీరోయిన్ గా,సపోర్టింగ్ యాక్టర్ గా దాదాపు 34 చిత్రాల్లో నటించారు. దాంతో పాటు మూడు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అందులో ప్రముఖ మలయాళీ హీరో నివిన్ పాళి చిత్రం MOOTHON ఒకటి.
కర్ణాటకలో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే టాక్సిక్ సినిమా కూడా ‘కేజీఎఫ్’ తరహాలో రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకూ వున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు సెలక్ట్ అయ్యారని టాక్. బాలీవుడ్ బ్యూటీలు కరీనాకపూర్, కియారా అద్వానీ, శ్రుతి హాసన్,తారా సుతారియా లతో పాటు హ్యూమా ఖురేషి ప్రతినాయకగా కనిపించబోతోంది. అంతే కాకుండా సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నాయన తార యష్ కి సిస్టర్ రోల్ పోషిస్తున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్, డ్రామా తో పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.