Reading Time: 2 mins
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్ర యూనిట్ మీడియా సమావేశం
 
అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందరూబాగుండాలి. తాజాగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
 
ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ…
 
అలీ ఎంచుకున్న కథ కథనాలు బాగున్నాయి. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఈ సినిమా ఇప్పటివరుకు అరవై శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఉండబోతున్నాయి. సింగర్ మనో, భరణి గారు, పవిత్ర లోకేష్ వంటి పాపులర్ అర్టిస్ట్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం అద్భుతంగా ఉండబోతొంది. ఇప్పటివరకు తెరమీద కనిపించని విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండబోతొంది. అందరూ ప్రాణం పెట్టి ఈ సినిమాను చేస్తున్నారని తెలిపారు. 
 
అలీ మాట్లాడుతూ…
 
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా 2021లో నేను నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఇది. అందరూ ఒక మంచి సినిమా చేస్తున్నావని అంటున్నారు. నరేష్ గారు నేను పోటాపోటీగా నటిస్తున్నాము. 27 ఏళ్ల తరువాత మంజు భార్గవి నేను కలిసి నటిస్తున్నాను. యమలీల రోజులు గుర్తు వస్తున్నాయి.  దాదాపు అందరూ సీనియర్ ఆర్టిస్ట్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక మంచి వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ సజావుగా జరుగుతుంది. డైరెక్టర్ కిరణ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు, అందరూ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్నారు,  త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుపుతామని అన్నారు.
 
 మంజు భార్గవి మాట్లాడుతూ…
 
అలీ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు వెంటనే ఈ సినిమా నేను చేస్తున్నానని చెప్పాను. ఒక మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ కిరణ్ గారు బాగా తీస్తున్నారు. నరేష్, పవిత్ర లోకేష్ గర్లతో నటించడం సంతోషంగా ఉంది. అలీ గారి పిల్లలు నన్ను వాళ్ల సొంత మనిషిలా ట్రీట్ చేస్తుంటే సంతోషంగా ఉందని ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని తెలిపారు.
 
పవిత్ర లోకేష్…
 
సినిమా చూడ్డం ఒక పార్ట్ అయ్యింది లైఫ్ లోజ్ అటువంటి సినిమాలో అందరూ నటులు మంచి పాత్రల్లో నటిస్తున్న సినిమా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా. డైరెక్టర్ కిరణ్ గారు మంచి మార్పులతో ఈ సినిమా తీయ్యబోతున్నారు. అలీ గారు నిర్మాతగా  చేస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. 
 
డైరెక్టర్ శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ…
 
నాకు ఈ అవకాశం ఇచ్చిన అలీ గారికి ధన్యవాదాలు. మాకు ఏం కావాలో అన్నీ సమకూరుస్తున్నారు. సినిమా బాగా వస్తోంది. షూటింగ్ సమయంలో ఇలా మీడియా వారిని కలవడం సంతోషంగా ఉంది. నరేష్ గారు అలీ గారు అద్భుతమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మౌర్యని, పవిత్ర లోకేష్, రామ్ జగన్, భద్రమ్ అందరూ మంచి పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎస్. ముర‌ళి మోహ‌న్ రెడ్డి కెమెరా వర్క్,  రాకేశ్ ప‌ళిడ‌మ్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ కానుందని తెలిపారు.
 
 
హీరోయిన్ మౌర్యని మాట్లాడుతూ…
 
అలీ గారు నన్ను ఈ పాత్ర చెయ్యమని అడగ్గానే వెంటనే ఒప్పుకున్నాను. ఒక మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుకోవడం హ్యాపీగా ఉంది. త్వరలో విడుదల కాబోతున్న మా సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.
 
తారాగాణం: 
 
డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌యకృష్ణ న‌రేశ్, మౌర్యానీ, ప‌విత్ర లోకేశ్ త‌దిత‌రులు
 
టెక్నీషియ‌న్లు:
 
బ్యాన‌ర్ – అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత‌లు – అలీబాబ‌, కొనతాల మోహ‌న‌కుమార్
డిఓపి – ఎస్. ముర‌ళి మోహ‌న్ రెడ్డి
సంగీతం – రాకేశ్ ప‌ళిడ‌మ్
పాటలు – భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్
ఎడిట‌ర్ – సెల్వ‌కుమార్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ – ఇర్ఫాన్
ఆర్ట్ డైరెక్ట‌ర్ – కేవి ర‌మ‌ణ‌
మేక‌ప్ చీఫ్ – గంగాధ‌ర్
ర‌చన, ద‌ర్శ‌క‌త్వం – శ్రీపురం కిర‌ణ్