అజయ్ పాసయ్యాడు సినిమా రివ్యూ
పరీక్షే దండగ: ‘అజయ్ పాసయ్యాడు’ రివ్యూ
రేటింగ్ : 1/5
కొత్త హీరోలు పరిచయం అయినా, కొత్త దర్సకులతో సినిమా చేసినా మనవాళ్లు ఆదరిస్తున్నారు. ట్రెండ్ మారి సినిమాలో కంటెంట్ ఉంటే స్టార్స్ ఉండకపోయినా సూపర్ హిట్ చేసేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు ప్రూవ్ చేసాయి. చిన్న సినిమా ఒకటి హిట్ అయితే ఆ ఉత్సాహంతో పది నుంచి పదిహేను చిన్న సినిమాలు మొదలైపోతుంది. అయితే వాటిలో ఎన్ని విజయం సాధిస్తున్నాయనేది ప్రక్కన పెడితే…ఎన్ని రిలీజ్ అయ్యాయి అనే విషయం జనాలకు తెలుస్తున్నాయి…అనేది కూడా సందేహంగా మారిపోతోంది. ఈ రోజు రిలీజైన అజయ్ పాసయ్యాడు అనే సినిమాదీ అదే పరిస్దితి. చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అయ్యిందనే విషయం కూడా తెలియదు. ఇంతకీ ఈ సినిమాలో విషయం ఉందా..హిట్ అయ్యేటట్లు ఉందా రివ్యూలో చూద్దాం..
కథేంటి
చిన్న ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో కథ కన్నా సిట్యువేషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు. ఉన్నంతలో కథను చెప్పుకుంటే…అజయ్ ( అజయ్ అమన్ ) డిగ్రీ చదవుతూంటాడు. చదువుతో పాటు ప్రేమ కూడా ఉండాలి కాబట్టి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ… నందిని (అంబికా ) తో ప్రేమలో పడతాడు. ఆమె వెనకాల పడుతూంటే మొదట పట్టించుకోకపోయినా ఆ తర్వాత… అజయ్ చేసిన ఓ సినిమాటెక్ మంచి పనికి నందిని కూడా అమాంతం ప్రేమలో పడిపోతుంది. వీరి ప్రేమ కథ ఓ కొలిక్కి వస్తుందనగా…అజయ్ ఓ తింగరి పని చేసి ఆమె దృష్టిలో నెగిటివ్ ఇంప్రెషన్ వేయించుకుంటాడు. అది కూడా తన కోసం కాదు. తన స్నేహితుడు కు హెల్ప్ చేయబోయి ఇరుక్కుపోతాడన్నమాట. దాంతో తప్పుడు పని చేసావంటూ…నందిని ..మన హీరోని ప్రక్కన పెట్టేస్తుది.ఆ తర్వాత అసలు నిజం ఎలా ఆమెకు తెలిసింది..ఆ అపార్దాలు ఎలా తొలిగాయి… అసలు అజయ్ చేసిన తప్పుడు పనేంటి. చివరకు ఆ లవ్ స్టోరీ ఎలాంటి ముగింపుకు వచ్చింది.. వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
కొన్ని సినిమాలు తెరకు ఎందుకు ఎక్కుతాయో..వాటి వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో పొరపాటున కూడా అర్దం కాదు. అసలు ఆ కథ సినిమాగా పనికివస్తుందా లేదా కూడా చూసుకోరు. మరీ ముఖ్యంగా సినిమాకు పెట్టిన టైటిల్ కు , కథకు సంభందం ఉందనిపించదు. ఈ చిన్న సినిమా ..యూట్యూబ్ లో వస్తున్న షార్ట్ ఫిలింల కన్నా దారుణంగా సాగుతుంది. కథలో ఓ ట్విస్ట్ ఉండదు, మలుపు ఉండదు. పరమ రొటీన్ వ్యవహారం..దానికి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే కూడా చాలా విసుగ్గా ,బోరింగ్ గా సాగుతుంది. డైరక్టర్ కామెడీ అనున్న సీన్ ఒక్కటి కూడా పండదు. దానికి తగినట్లు సినిమాలో కొత్త నటులు ఎక్కవ అవటం, సీన్స్ సరిగా లేకపోవటం, వారి నుంచి సరైన నటన రాబట్టకపోవటం విరక్తి కలిగిస్తుంది. లవ్ స్టోరీలకు కీలకంగా ఉండాల్సిన సీన్స్ కానీ, క్యారక్టరైజేషన్స్ కానీ బలంగా రాసుకోలేదు. ఏదో మొక్కుబడిగా, సిల్లీగా ఉన్నట్లు ఉంటాయి. ఫస్టాఫ్ ని మించిపోయి సెకండాఫ్ డల్ గా సాగుతుంది.
చిన్న సినిమా బ్రతకాలి అని పెద్ద పెద్ద వేదికలు ఎక్కి సినిమా వాళ్లు మాట్లాడుతూంటారు. పెద్ద సినిమాల మధ్యన నలిగిపోతోంది సినిమా అంటారు. దియోటర్స్ దొరకటం లేదు అంటారు. అయితే అన్ని సవ్యంగా సెట్ అయిన చిన్న సినిమాలు ఎంతవరకూ సక్సెస్ సాధిస్తున్నాయి అంటే వేళ్ల మీద లెక్క పెట్టడం కూడా కష్టమనిపిస్తుంది. చిన్న సినిమాకు కంటెంట్ పెద్దగా ఉంటే కానీ వర్కవుట్ కాదని కూడా ఆలోచించకుండా వండి వడ్డించేస్తూంటారు. అలాంటి సినిమా ఇది.
టెక్నికల్ గా …
సినిమా అంతా చుట్టేసిన వ్యవహారంగా కనిపిస్తుంది. చాలా నాశిరకంగా ఉన్న నిర్మాణ విలువలు, డల్ గా ఉన్న కంటెంట్ తో పోటీ పడుతూంటాయి. టెక్నీషియన్స్ సత్తా ఏమన్నా ఉన్నా కూడా ఇలాంటి సినిమాలతో బయిటపడదు.
చివరి మాట…
కామెడీ పేరుతో తీసిన ఈ సినిమా టీవిల్లో వచ్చినా కూడా చూడటం కష్టమే..
తెర వెనక, ముందు
బ్యానర్ :భారతం క్రియేషన్స్ పతాకం
నటీనటులు : అజయ్ అమన్ ,అంబికా ,ఝాన్సీ ,శివన్నారాయణ, సాయికిరణ్ తదితరులు
సంగీతం : సాహిణి శ్రీనివాస్
సినిమాటోగ్రఫర్ : గణేశన్
రచన: బి.కె.ఈశ్వర్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రేమ్ భగీరథ్
నిర్మాత : మాగాపు సూర్య కమల-వై.రాజేంద్ర
విడుదల తేదీ: జనవరి 04, 2019