Reading Time: 2 mins
అడివి శేష్ ఇంటర్వ్యూ
 
 
‘క్షణం’ సినిమాతో హీరోగా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అడివి శేష్ ‘గూఢచారి’ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ‘ఎవరు’ అంటూ రేపే రాబోతున్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ఆ వివరాలు శేష్ మాటల్లోనే…
 
కాస్ట్లీ లెసన్
 
నిజానికి నేను రిచ్ కిడ్ అనుకుంటారు కానీ కాదు. యుఎస్ లో మాది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలా కష్టపడి పైకొచ్చాను. నా దగ్గర ఉన్న అన్ని డబ్బులు ‘కిస్’ సినిమాకే పెట్టేసాను. ఆ సినిమాకు సంబంధించి పోస్టర్లకు వాడే మైదా ఖర్చు కూడా రాలేదు. అది నాకొక కాస్ట్లీ లెసన్. సో దర్శకుడిగా నేను ఫెయిల్ అయ్యాను. అందుకే ప్రస్తుతం అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నటుడి చేస్తూ స్క్రీన్ ప్లే రైటర్ వ్యవహరిస్తున్నాడు.
 
‘క్షణం’ తర్వాత ఇదే
 
‘క్షణం’ అందరినీ అక్కట్టుకున్న థ్రిల్లర్ సినిమా ఆ తర్వాత నేను చేసిన ‘అమీ తుమీ’ ఒక రొమాంటిక్ కామెడీ ఫిలిం. ‘గూఢచారి’లో కొన్ని థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఉన్నప్పటికీ అదొక యాక్షన్ డ్రామా. సో క్షణం తర్వాత నేను చేసిన కంప్లీట్ థ్రిల్లర్ సినిమా ఇదే. ఆ విషయం సినిమా చూస్తే తెలిసిపోద్ది.
 
షాకయ్యాం
 
‘క్షణం’ సినిమాను ముందుగా కొందరికీ చూపిస్తే అస్సలు బాలేదు కష్టం అని అన్నారు. నాకు డైరెక్టర్ కి అలాగే ముఖ్యంగా ప్రొడ్యుసర్ కి అందరం షాకయ్యాం. తీరా చూస్తే చూస్తే అది సూపర్ హిట్టైంది. ఎప్పుడూ ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేయని బన్నీ ఆ సినిమా ట్వీట్ చేసాడు. సో ఆ సినిమా రిజల్ట్ తర్వాత సినిమా ఎవరికీ చూపించాలి ఎవరి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నది తెలుసుకున్నాను.
 
ఎవరు …వాట్ ఈజ్ క్రైం
 
‘ఎవరు’ మీరు ఊహించినట్టు క్రైం చేసింది ఎవరు అనే దాని చుట్టూ తిరిగే సినిమా కాదు. అసలు ఏం క్రైం జరిగింది.  ఎవరు చేసారు.. ఎవరి మీద చేసారు అనేదాని మీద కథ నడుస్తుంది. సినిమా చూసాక కచ్చితంగా థ్రిల్ అవుతారు.
 
కథలో ఉంటుంది..నటీ నటుల్లో కాదు
 
ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ తో థ్రిల్ అవ్వరు. కథే మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. లైక్ గూఢచారిలో క్లైమాక్స్ లో ఉండే జగపతి బాబు గారి క్యారెక్టర్ ట్విస్ట్ లా కాకుండా కథతోనే థ్రిల్ అవుతారు.
 
అందుకే ప్రీమియర్
 
ఒకరోజు నిర్మాత పీవిపీ గారు సినిమాకు సంబంధించి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని అన్నాడు.  సర్ ఆ ఈవెంట్ లో ఏం చెప్తాం ? అని ప్రశ్నించాను. ట్రైలర్ వేసి సినిమాలో కంటెంట్ ఏంటో తెలియజేద్దాం అన్నారు. అలాంటప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకుండా సినిమానే ముందుగా చూపిస్తే బాగుంటుంది కదా అని రిక్వెస్ట్ చేసాను. సో ఆయన కూడా సినిమా మీదున్న నమ్మకంతో వెంటనే ఒకే అన్నారు. అలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బదులు ప్రీమియర్ ప్లాన్ చేశాం.
 
నా బెస్, బిగ్గెస్ట్ క్రిటిక్ వాడే
 
ఈ సినిమాను వెన్నెల కిషోర్ కి చూపించాను. సో సినిమా చూసి నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. సినిమాల్లో సరదాగా కమెడీ చేస్తాడు. కానీ బయట సీరియస్ గా ఉంటాడు. వాడికి సినిమా మీద మంచి నాలెడ్జ్ ఉంది.  నిజానికి వాడే నా బెస్ట్ క్రిటిక్. ప్రతీ సారి వాడి ఫీడ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తుంటాను.
ఆ సినిమా కాదు..ఇంకొన్ని గంటల్లో
‘ఎవరు’ సినిమాను బద్లా సినిమాతో పోలుస్తున్నారు. కానీ ఇంకొన్ని గంటల్లో సినిమా ఏ సినిమాలా ఉందన్నది తెలిసిపోతుంది.
 
మేజర్ … అక్టోబర్ నుండి
 
నేను చేయబోయే నెక్స్ట్ సినిమా మేజర్ అక్టోబర్ లో మొదలవుతుంది.  మేజర్ ఉన్ని కృష్ణన్ గారి జీవితంపై ఆ సినిమా రాబోతుంది. ఒక గొప్ప వ్యక్తి చూడబోతున్నారు. ఆ సినిమాలో మహేష్ బాబు గారితో కొలబ్రేట్ అవ్వడం గ్రేట్ అచీవ్ మెంట్ గా ఫీలవుతున్నాను. ఆ తర్వాత తర్వాత ‘గూఢచారి 2’ సినిమా స్టార్ట్ చేస్తాను.