Reading Time: 2 mins
అనుదీప్  శివ‌శంక‌రీ  ఫ్యూజ‌న్ కవ‌ర్  సాంగ్ లాంచ్‌
 
 టాలీవుడ్ లో టాలెంటెడ్ సింగ‌ర్ గా పేరు తెచ్చుకున్న అనుదీప్ చేసిన  `శివ‌శంక‌రీ` ఫ్యూజ‌న్ క‌వ‌ర్ సాంగ్ లాంచ్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి చేతుల మీదుగా శుక్ర‌వారం ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ఆర్.పి.ప‌ట్నాయ‌క్‌,  ర‌ఘుకుంచె, జెబి, సాయికార్తిక్, సింగ‌ర్స్ ర‌ఘురామ్‌,  ర‌మ్య‌బెహ‌ర, మాళ‌విక‌, విజ‌య‌ల‌క్ష్మి, వేణు మ‌నీషా ఎర‌బ‌త్తిని త‌దిత‌రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి మాట్లాడుతూ…“ సాంగ్  విజువ‌ల్స్ గానీ, అనుదీప్ ప్ర‌జంటేష‌న్ గానీ అద్భుతంగా ఉంది. పెండ్యాల నాగేశ్వ‌రావు గారి కంపోజిష‌న్ లో ఘంట‌సాల గారు ఆల‌పించిన  ఓ గొప్ప సాంగ్ ఇది. అలాంటి గొప్ప సాంగ్ ని మోడ్ర‌న్ గా ఫ్యూజ‌న్ క‌వ‌ర్ సాంగ్ గా  తీర్చిదిద్దాడు అనుదీప్. రియ‌ల్ ఫ్యూజ‌న్ అంటే ఇది అనేలా ప్ర‌జంటేష‌న్ ఉంది. నాకు అనుదీప్ ఎప్ప‌టినుంచో తెలుసు. త‌న‌లో ఏదో చేయాల‌న్న త‌ప‌నే ఈ రోజు ఈ సాహసం చేసేలా చేసింది. ఈ సాంగ్ తో అనుదీప్ ఒక మంచి స్థాయికి చేర‌తాడు. ఒరిజిన‌ల్ సాంగ్ ని ఏ మాత్రం చెడ‌గొట్ట‌కుండా చేయ‌డం గొప్ప విష‌యం.  ఈ సాంగ్ ని నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సాంగ్ అనుదీప్ కు మంచి పేరు తీసుక‌రావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
సంగీత దర్శ‌కుడు ఆర్.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ…“ `శివ‌శంక‌రీ` పాటలోని  సోల్ పోకుండా ప్ర‌జంట్ చేసిన అనుదీప్ ని అభినందిస్తున్నా. ఈ పాట‌ను పాడాల‌నుకోవ‌డమే ఓ సాహ‌సం. అలాంటిది సోల్ మిస్ అవ‌కుండా రీమిక్స్ చేయ‌డం మ‌రో సాహ‌సం. అనుదీప్ కి మంచి కంపోజ‌ర్ వి అవుతావు అని చాలాసార్లు  చెప్పాను. క‌చ్చితంగా మంచి సంగీత ద‌ర్శ‌కుడు అవుతాడు. సింగ‌ర్ గా ఏంటో తెలుసు. కంపోజర్ గా కూడా త‌నేంటో త్వ‌ర‌లో చూడబోతున్నాం. ఈ పాట త‌న‌కు మంచి పేరు తీసుక‌రావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
 ర‌ఘుకుంచె మాట్లాడుతూ…“అనుదీప్ లో ఏదో చేయాల‌న్న త‌ప‌న‌, క‌సి ఉంది. అదే త‌న‌ను పెద్ద స్థాయిలోకి తీసుకెళ్తుంది“ అన్నారు.
సాయికార్తిక్ మాట్లాడుతూ…“నాకు చాలా ఇష్ట‌మైన పాట ఇది.  ఈ పాట‌ను ఫ్యూజ‌న్ క‌వ‌ర్ చేసి సాహసం చేసిన అనుదీప్ కు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నా“ అన్నారు.
సింగ‌ర్ అనుదీప్ మాట్లాడుతూ…“ఏదైనా ఒక మంచి క‌వ‌ర్ సాంగ్ చేయాల‌నుకుంటున్న త‌రుణంలో `శివ‌శంక‌రీ` సాంగ్ ను తీసుకుని ఫ్యూజ‌న్ క‌వ‌ర్ సాంగ్ చేసాం. దీనికి ఆట సందీప్ కొరియోగ్ర‌ఫీ చేసారు. అంద‌రికీ న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి న‌న్ను బ్లెస్ చేసిన ప్ర‌తి ఒక్క‌కిరీ నా కృత‌జ్క్ష‌త‌లు“ అన్నారు.