అన్ స్టాపబుల్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్
అన్ స్టాపబుల్’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే హిలేరియస్ ఎంటర్ టైనర్: ‘అన్ స్టాపబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్
పిల్లా నువ్వు లేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’. ‘అన్ లిమిటెడ్ ఫన్’ అన్నది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సన్నీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఒక డ్రీమ్. ‘ఏటీఎం’ తో నటనకు తొలి అడుగు పడింది. ఇప్పుడు అన్ స్టాపబుల్ తో వెండితెరపై అడుగు పెట్టడం ఆనందంగా వుంది. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నిర్మాత రజిత్ అన్న నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. డైమండ్ రత్నబాబు చాలా హిలేరియస్ కథని రాశారు. సప్తగిరి అన్నతో పాటు మిగతా నటీనటులందరితో కలసి చాలా ఎంజాయ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ చేశాం. జూన్ 9న మిస్ అవ్వకుండా అన్ స్టాపబుల్ చూడండి. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ క్లీన్ ఎంటర్ టైనర్ ఇది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు” అన్నారు
సప్తగిరి మాట్లాడుతూ.. మా నుంచి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టిన దర్శకుడు డైమండ్ రత్నబాబు గారికి హ్యాట్సాఫ్. ఈ సినిమాతో ఆయనకి మంచి విజయం దక్కుతుంది. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న రజిత్ రావు గారికి అభినందనలు. చాలా ప్యాషన్ తో ఎక్కడా రాజీపడకుండా సినిమా చేశారు. సన్నీతో కలిసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాతో తనకి పెద్ద విజయం రావాలి. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జూన్ 9న అందరూ అన్ స్టాపబుల్ చూసి ఎంజాయ్ చేయాలి”అని కోరారు
దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ.. నిర్మాత రజిత్ రావు గారు సినిమా అంటే అంకిత భావం వున్న నిర్మాత. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ తప్పకుండా ప్రముఖ సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఈ చిత్రానికి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమా పోస్టర్ చూసి అందరూ ఈవీవీ గారి సినిమా లాంటి అనుభూతి కలుగుతుందని చెప్పడం ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ షో ఎక్కడ పడినా ఒక సీట్ ఈవీవీ సత్యనారాయణ గారి కోసం ఉంచుతాం. ఇది ఆయనకి మేము ఇచ్చే ఓ చిరు కానుక. సన్నీ, సప్తగిరి చాలా అద్భుతంగా చేశారు. నేను నవ్వించిన ప్రతి సినిమా విజయాన్ని సాధించింది. ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నవ్వురాకపొతే నేరుగా నాకు కాల్ చేయండి. ఇంత నమ్మకంతో చెబుతున్నా. మీ అందరినీ నవ్విస్తామని హామీ ఇస్తున్నాను” అన్నారు.
నిర్మాత రజిత్ రావు మాట్లాడుతూ.. మా అబ్బాయి పేరుతో ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ ని స్థాపించడం జరిగింది. ఈ సినిమాలో పని చేసిన సన్నీ, సప్తగిరి, దర్శకుడు రత్నబాబు.. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసే క్లీన్ ఎంటర్ టైనర్. క్వాలిటీ కామెడీ వుంటుంది. జూన్ 9న థియేటర్ లో చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
దర్శకులు ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ.. ఇంతమంది నటీనటులని చూస్తుంటే ఈవీవీ గారి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. బాలయ్య గారి అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ సినిమా కూడా అంతపెద్ద హిట్ కావాలి”అని కోరారు. ఈ వేడుకలో అక్షా ఖాన్, సంగీత దర్శకుడు భీమ్స్,సుధాకర్ కొమాకుల, పృద్వీరాజ్, మురళీధర్ గౌడ్, అభి తదితరులు పాల్గొన్నారు.