అశ్వద్ధామ మూవీ రివ్యూ
Rating:2/5
ప్రస్తుతం థ్రిల్లర్స్, సైకో థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ థ్రిల్ ఇచ్చి భాక్సాఫీస్ ని మెప్పించవచ్చు అని మిడిల్ హీరోలు భావిస్తున్నారు. అయితే థ్రిల్లర్స్ అంటేనే కత్తిమీద సాము. ఏ మాత్రం ప్రేక్షకుడు మనకన్నా ముందే ట్విస్ట్ లు ఊహించినా ఫలితం ఊహించేదే. గదిలో కూర్చుని తయారు చేసే కథ, థియోటర్ లో కూర్చుని చూసే ప్రేక్షకుడుకి అంతుపట్టకుండా ఉండాలి. అలాంటి కథ తనే తయారు చేసానంటూ హీరో నాగశౌర్య ఈ థ్రిల్లర్ తో ధైర్యం చేసాడు. మరి ఈ సైకో థ్రిల్లర్ ఏ మేరకు థ్రిల్స్ ని పంచింది. ఈ కథతో చెప్తున్న పాయింట్ ఏమిటి, కొత్త దర్శకుడు ఏ మేరకు ఈ థ్రిల్లర్ కు న్యాయం చేసాడు వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
ఓ ప్రక్క ఎంగేజ్మెంట్ జరుగుతూంటే ఆనందంగా ఉండక…సూసైడ్ కు తన చెల్లి ప్రియ (సర్గున్ కౌర్) ప్రయత్నించటం ఊహించలేకపోతాడు గణ (నాగశౌర్య). దాంతో విషయం ఏంటని తన చెల్లిని అడిగితే..తను…గర్బవతిని అని రివీల్ చేస్తుంది. అందుకు కారణం ఎవరో తెలియదని,తనకు లవ్,ఎఫైర్స్ వంటివి ఏమీ లేవని వివరిస్తుంది. దాంతో తన చెల్లి ప్రెగ్నిన్సీ కారణం ఎవరా అని ఆరా తీస్తున్న క్రమంలో మరో నిజం తెలుస్తుంది. తన చెల్లి లాంటి మరికొందరు ఇలాగే తమ ప్రెగ్నిన్సీలకు కారణం ఎవరో తెలియక తికమకపడుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని. వీరందరి వెనక జరుగుతున్న క్రైమ్ ఏమిటని సీరియస్ గా గణ ఇన్విస్టిగేట్ చేయటం మొదలెడతాడు. అందులో గణ విజయం సాధించాడా..ఎవరు ఈ ప్రెగ్నిన్సీలకు కారణం, అదెలా జరుగుతోంది..ఆ క్రైమ్ ని ఎలా ఛేధించాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే సంగతి
ఇలాంటి స్టోరీ లైన్స్ సాధారణంగా స్క్రీన్ ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతాయి. రైటింగ్ కే ప్రాధాన్యత ఉంటుంది. ఒక గ్రిప్పింగ్ స్క్రిప్ట్ గా మలచాల్సి ఉంటుంది. తర్వాతి ఏం జరుగుతుందా…. అనే ఉత్కంఠ రేకెత్తించేలా సీన్స్ ఉండాలి. అయితే ఆ విషయంలో దర్శకుడు తడబడ్డాడనే చెప్పాలి. ఇంట్రస్టింగ్ పాయింట్ తో కథను రాసుకున్న దానికి తగ్గ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించలేకపోయారు. ప్రెడక్టుబులిటీ ఈచిత్రంలో ప్రధాన మైనస్ అని చెప్పొచ్చు. కథలో తెలిసిన సీన్స్ లేకుండా ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే. సినిమా అంతా సీరియస్ నోట్ లో సాగడంతో ఎంటెర్టైనెర్మెంట్ కరువయ్యింది. ఎత్తుగడకు మంచి పాయింట్ ను ఎంచుకున్న దర్శకుడు ఇంకా ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించే అవకాశం వున్నా ఆ ఛాన్స్ ను వినియోగించుకోలేక పోయాడు.
దర్శకుడి పనితనం
ఈ సినిమాతో పరిచయమైన రమణ తేజ…మేకింగ్ పరంగా డీసెంట్ జాబ్ చేసినా, ఆడియన్స్ పల్స్ ని పట్టుకోలేక తడబడ్డాడు. ఇలాంటి సినిమాలని నిలబెట్టే స్క్రీన్ ప్లే విషయంలో మరింతగా కష్టపడాల్సి ఉంది. దానికి తోడు యాక్షన్ హీరో అనిపించుకోవాలని తనకు తనే ఓ కథ రాసుకున్న నాగశౌర్య …సన్నని స్టోరీ లైన్ కూడా కలిసి రాలేదు. అయితే మంచి కథ పడితే ఈ దర్శకుడు డీల్ చేయగలడనిపిస్తుంది.
నటుడుగా నాగ శౌర్య
తన ఇంటెన్స్ ఫెరపార్మెన్స్ తో నటుడుగా నాగ శౌర్య మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. తన చెల్లికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని పట్టుదలతో..క్లూలు దొరకని క్రైమ్ మిస్టరీని ఛేధిస్తూ కన్ఫూజన్, ఏంగ్జయిటీ కలిగిన పాత్రలో ఫెరఫెక్ట్ గా జీవించాడు. మెహరీన్ కు చెప్పుకునేందుకు ఏమీ లేదు. బెంగాళి నటుడు జిషు సేన్ గుప్తా సైకో నటుడుగా క్లాస్ గా చేసాడు. సత్య,పోసాని ఇలా మిగతా పాత్రలన్ని అలా చేసుకుంటూ పోయారు. ప్రత్యేకమైన ప్రత్యేకత లేదు.
టెక్నికల్ గా చూస్తే…
జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..చాలా సీన్స్ ని లేపి నిలబెట్టింది. ముఖ్యంగా ఇంటర్వెల్, సెకండాఫ్ లో కొన్ని కీ సీన్స్ కు ఈ స్కోర్ లేకపోతే ఆ స్దాయి ఊహించలేం. పాటల విషయానికి వస్తే…యావరేజ్ గా ఉన్నా..నిజానికి ఈ సినిమాకు అనవసరం. యాక్షన్ సీన్స్ బాగున్నాయి కానీ ఇలాంటి మిస్టరీ కథలకు అవి సెట్ కావేమో. కెమెరా వర్క్ , ఎడిటింగ్ రెండు నీట్ గా ఉన్నాయి. డైలాగులు జస్ట్ ఓకే.
—
చూడచ్చా
మొత్తానికి థ్రిల్లర్లు ఇష్టపడేవాళ్లకు ఈవారం ఇది వీకెండ్ ఛాయిసే. కాకపోతే మరీ ఎక్కువగా ఎక్సపెక్ట్ చేసుకుని వెళ్లకూడదు. టైమ్ పాస్ కోరుకుంటే మాత్రం టికెట్టు డబ్బులు గిట్టుబాటే.
—
తెర ముందు…వెనక
నటీనటులు: నాగశౌర్య, మెహరీన్, సత్య, పోసాని కృష్ణమురళి, ప్రిన్స్, జిషు సేన్ గుప్తా, హరీష్ ఉత్తమన్, కాశీ విశ్వనాథ్, సర్గున్ కౌర్ తదితరులు.
ఛాయాగ్రహణం: మనోజ్ రెడ్డి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నేపథ్య సంగీతం: జిబ్రాన్
సంభాషణలు: పరుశురాం శ్రీనివాస్
కథ: నాగశౌర్య
నిర్మాత: ఉషా ముల్పూరి
దర్శకత్వం: రమణ తేజ
సంస్థ: ఐరా క్రియేషన్స్
విడుదల: 31 జనవరి 2020