`ఆహా`లో ఆర్కా మీడియా బ్యానర్ నిర్మిస్తున్న సరికొత్త హారర్ వెబ్ సిరీస్ `అన్యాస్ టూటోరియల్`
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం `ఆహా`లో `మెయిల్, లెవన్త్ అవర్, కుడిఎడమైతే` వంటి వెబ్ ఒరిజినల్స్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు `అన్యాస్ టూటోరియల్` అనే సరికొత్త వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది `ఆహా`. రెజీనా కసండ్ర, నివేదా సతీశ్, అగస్త్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను `బాహుబలి` వంటి సెన్సేషనల్ మూవీని నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన సంస్థ ఆర్కా మీడియా బ్యానర్లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
అన్య అనే పాత్ర చుట్టూ తిరిగే కథతో రూపొందిన సిరీస్ `అన్యాస్ టూటోరియల్`. అన్య ఓ పాపులర్ వెబ్ చానెల్‌ను నడుపుతుంటుంది. ఆమె ఇంట్లో ఆత్మలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు ఆమె జీవితం తలకిందులవుతుంది. ఆమె దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుందా లేక తగిన మూల్యం చెల్లించిందా? అనేది తెలియాలంటే అన్యాస్ టూటోరియల్ చూడాల్సిందేంటున్నారు యూనిట్. ఈ వారంలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రేక్షకుల ఆసక్తిన, ఉత్సాహాన్ని పెంచేలా ఈ సిరీస్ ఉంటుందని మేం ప్రామిస్ చేస్తున్నామంటున్నారు మేకర్స్.
ఈ షోతో దర్శకురాలిగా పరిచయం అవుతున్న పల్లవి గంగిరెడ్డి ఆహా క్రియేటివ్ టీమ్‌లో సభ్యురాలు. ఈ షోతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. తొలి ప్రాజెక్ట్ అన్యాస్ టూటోరియిల్ను ఆర్కా మీడియా సంస్థలో చేయడం విశేషం. ఇంతకు ముందెన్నడూ చూడని హారర్ ఎలిమెంట్స్‌ను ఇందులో చూడొచ్చు. మేం ఏడాదిన్నరగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కంటెంట్‌ను అందిస్తున్నాం. దానికి ప్రేక్షకులు నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి థ్రిల్ అయ్యాను. ఇప్పటి వరకు ఆహా యాప్‌ను కోటి మంది డౌన్ లోడ్ చేసుకున్నారని ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని సరికొత్త పాత్ బ్రేకింగ్ కంటెంట్న్ఉ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం“ అని తెలిపారు ఆహా వ్యవస్థాపకుడు అల్లు అరవింద్.
దర్శకురాలు పల్లవి గంగిరెడ్డి మాట్లాడుతూ “అన్యాస్ టూటోరియల్ కథపై నేను, సౌమ్యా శర్మ వర్క్ చేశాం. ఈ ఆలోచనను అల్లు అరవింద్‌గారు, శోభు యార్లగడ్డగారికి చెప్పినప్పుడు వారికి నచ్చడంతో మా ఆలోచన రూపం పోసుకుంది. లాక్డౌన్ సమయంలో మా కల నిజమైంది. రెజీనా, నివేదాలతో షోను చేయాలని ముందుగానే అనుకున్నాం. త్వరలోనే ఈ కథను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నామని తెలియజేయడానికి సంతోషపడుతున్నాం“ అన్నారు.
రెజీనా కసండ్ర మాట్లాడుతూ “నేను పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు కండ నాల్ ముదల్ అనే సినిమాలో నటించాను. ఆ సినిమాను ప్రియా అనే మహిళా దర్శకురాలు తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగులో నేను చేస్తున్న వెబ్ సిరీస్ దర్శకురాలు, రైటర్ ఇద్దరూ మహిళలే కావడం యాదృచ్చికమే అయినా ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆర్కామీడియా సంస్థలో పనిచేయడం సంతోషంగా ఉంది. అన్యాస్ టూటోరియల్ అనే కథ విన్నప్పుడు నేనెలా థ్రిల్ అయ్యానో అలాగే ప్రేక్షకులు కూడా అవుతారని భావిస్తున్నాను“ అన్నారు.
ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ మాట్లాడుతూ “మన తెలుగు ఇండస్ట్రీ మీద అల్లు అరవింద్‌గారు ఎంత పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంటారు. ఆయన ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి. ఆహా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో టాప్‌గా, లాండ్ మార్క్‌గా మారింది. ఆహా ద్వారా ఎంతో మంది కొత్త తరం దర్శకులు, టెక్నీషియన్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. సరికొత్త కంటెంట్‌ను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కష్టమైన విషయం. ఆహాతో అరవింద్‌గారు దాన్ని సుసాధ్యం చేస్తున్నారు. ఇక అన్యాస్ టూటోరియల్ విషయానికి వస్తే నేను సౌమ్య నెరేషన్ విన్నప్పుడు ఎలా థ్రిల్ ఫీలయ్యానో రేపు ఆడియెన్స్ దాన్ని ఆహాలో చూసి అలాగే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఏదో ఒకరోజు నేను, అరవింద్‌గారు కలిసి బాహుబలి రేంజ్ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తాం“ అన్నారు.
అక్టోబర్ నెలలో అన్యాస్ టూటోరియల్ షూటింగ్ పూర్తి చేస్తారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఏడాదిలో క్రిస్మస్ వారాంతంలో విడుడదల చేస్తారు. ఏడు ఎపిసోడ్స్‌తో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ వ్యవధి ముప్పై నిమిషాలుంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి క్రాక్, జాంబి రెడ్డి, నాంది, చావు కబురు చల్లగా, సుల్తాన్, లెవన్త్ అవర్, అర్ధ శతాబ్దం, కాలా, లుకా, షైలాక్, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, కుడిఎడమైతే షోస్, సినిమాలు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి.