ఇ ఎమ్ ఐ చిత్రo ఫస్ట్ లుక్ లాంచ్
శ్రీ అవధూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్ లో దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి లు నిర్మాతలుగా దొంతు రమేష్ దర్శకత్వంలో భానుశ్రీ, నోయల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇ ఎమ్ ఐ’. ఈ అమ్మాయి అనే ద్వందార్థం వచ్చే ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు పోస్టర్ లాంచ్ కార్యక్రమం విజయదశమి పండుగ సందర్బంగా మంగళవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో అతిథులు ప్రసన్న కుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా జరిగింది. ఈ వేడుకలో మొదట
హీరోయిన్ భానుశ్రీ మాట్లాడుతూ.. నా పుట్టిన రోజు సందర్బంగా నేను లీడ్ రోల్ లో నటించిన ఇ ఎమ్ ఐ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లంచ్ అవడం సంతోషంగా ఉంది. చాలా కష్టపడి సినిమా చేసాము. ఈ చిత్ర దర్శకుడు రమేష్ కు నిర్మాత బుచ్చయ్య తండ్రి కావడంతో సినిమా సాఫీగా జరిగింది. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది.. కొన్ని ప్యాచ్ వర్కులతో పాటు సాంగ్స్ మిగిలి ఉన్నాయి.. త్వరలో అది కూడా పూర్తి చేసుకొని విడుదల కు వస్తాము. స్టోరీ లైన్ చాలా నచ్చి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా.. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ఇది. ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికీ ఇ ఎమ్ ఐ లు ఉంటాయి. అలా ఇ ఎమ్ ఐ ల వలన లేడీస్ ఎలాంటి స్ట్రగుల్ అవుతుంటారు అని తెలిపేదే ఈ చిత్ర కథాంశం. కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… ఇ ఎమ్ ఐ సౌండింగ్ చూస్తే ఈ అమ్మాయి అని వస్తుంది. అదే ఈ సినిమా టైటిల్ కూడా అలానే ఉంది. పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ లు కూడా చాలా బాగున్నాయి. సినిమాలోఎంతో కొంత స్టఫ్ కూడా కనపడుతోంది. ముఖ్యం గా పోస్టర్ ను చూస్తుంటే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ సినిమా లా అనిపిస్తోంది.. నిర్మాతలు హ్యాపీ గా ఉంటె అంతా హ్యాపీ గా ఉన్నట్టే.. ఆ హ్యాపీనెస్ నాకు ఈ చిత్ర నిర్మాత బుచ్చయ్య మాటల్లో అర్థమయింది. ఆ క్రెడిట్ దర్శకుడు రమేష్ కే దక్కుతుంది. మంచి టెక్నీషియన్స్ కూడా ఈ చిత్రానికి పనిచేశారు. కనుక సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతున్నా అన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. మంచి గ్లామర్ ఉన్న హీరోయిన్ ను పెట్టి సినిమా చేశారు.. యూత్ ను అట్రాక్ట్ చేసే పోస్టర్ లు ఉంటేనే ఓపెనింగ్స్ బాగుంటాయి. ఆతరువాత కంటెంట్ బాగుంటే ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమా కూడా అదేవిదంగానే ఉంది కనుక సినిమా అందరికీ నచ్చి తీరుతుంది. చిన్న సినిమాలు హిట్ అయితే వంద కుటుంబాలు బాగుపడతాయి. మంచి పబ్లిసిటీ తో సినిమాను రిలీజ్ చేస్తే తప్ప సక్సెస్ అవుతుందని చెప్పారు.
దర్శకుడు రమేష్ మాట్లాడుతూ.. నిర్మాతల సహకారం వలనే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకోగలిగి ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు రాగలిగాము. కొన్ని సాంగ్స్ బ్యాంకాక్ లో షూట్ చేయాల్సి ఉంది అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాము. సినిమా చాలా బాగొచ్చింది. మా సినిమాలోని పాటలు సాంగ్స్ ఆఫ్ ది బెస్ట్ గా నిలుస్తాయని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. అంతేకాదు మా సినిమా చూసిన ఏ ఒక్కరైనా బోర్ అని ఫీల్ అయితే వారి ఒక నెల ఇ ఎమ్ ఐ నేను కడతానని ఈ విజయదశమి పండుగ సందర్బంగా తెలియచేస్తున్నా అని అన్నారు.
నిర్మాత బుచ్చయ్య మాట్లాడుతూ… నా తనయుడిని దర్శకుడుగా పరిచయం చేస్తూ తీసిన సినిమా ఇది. మంచి సబ్జెక్టు. చాలా కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ స్టోరీ తో పాటు అందరికీ కనెక్ట్ అయ్యేలా కథాంశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఇ ఎమ్ ఐ అనే పదం తెలియని వారుండరు. నెల.. నెలా.. అది కట్టని వారుండరు. ఈ లైన్ ను తీసుకొనే మా అబ్బాయి రమేష్ ఎంటెర్టైనేమేంట్ తో పాటు ఎమోషన్ ను కూడా కలగలిపేలా సినిమాను తెరకెక్కించాడు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని తెలియచేసారు.
ప్రసన్న కుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్, స్వామి, లయన్ సాయి వెంకట్, సుమన్,సంధ్య, రవిశంకర్, చంద్ర కిరణ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నోయల్,భానుశ్రీ, సంధ్, చమ్మక్ చంద్ర, బిత్తిరి సత్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఘటికాచలం, పాటలు: సుద్దాల అశోక్ తేజ, శ్రీమణి, చక్రావురి విజయకుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, కెమెరా: ఎమ్. మోహన్ చంద్, సంగీతం: ఎస్. రవికుమార్, ఆర్ట్: వాసు, ఫైట్స్: సతీష్, డాన్స్: చంద్ర కిరణ్, కో డైరెక్టర్: కె. శ్రీనివాస్ రావు, స్టోరీ -స్క్రీన్ ప్లే- డైరెక్షన్: దొంతు రమేష్, నిర్మాతలు: దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి