Reading Time: 2 mins

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం ప్రెస్ మీట్

నా కెరీర్‌లో ఫస్ట్ టైం ఎలాగైనా హిట్ కొట్టాలి అని `ఇస్మార్ట్ శంకర్`  తీశాను – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ 

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మించిన చిత్రం `ఇస్మార్ట్‌ శంకర్‌`. నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగావిడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతూ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి తొమ్మిది రోజుల్లోనే రూ.63 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఈ సందర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో….
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ – “అందరూ నన్ను చాలా పొగుడుతున్నారు. నేను ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఫస్ట్ టైం ఎలాగైనా హిట్ కొట్టాలి అని ఈ సినిమా తీశాను. మీ అందరి ఆదరణతో ఈ సినిమా ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా చూసి చాలా మంది నా మిత్రులు అప్రిసియేట్ చేసారు. అలాగే నన్ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్‌. బాలకృష్ణ గారు ఈ రోజే సినిమా చూస్తున్నారు. ఆయనకు నా ధన్యవాదాలు . అఖిల్, రానా ఇలా ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. నేను ఇప్పటినుండి ఇలాంటి మాస్ సినిమాలే తీయాలని డిసైడ్ అయ్యాను. హిట్ సినిమాలే తీస్తాను. త్వరలోనే తెలంగాణలో సక్సెస్ టూర్‌ని ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్ష‌కులంద‌రినీ వచ్చి కలుస్తాం. అలానే త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్ చేస్తాను“ అన్నారు .

ప్రొడ్యూసర్ ఛార్మి మాట్లాడుతూ – ” మా సినిమాను ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ చేసిన అందరికి థాంక్స్. సక్సెస్ టూర్ లో ఎక్కడికి వెళ్లినా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వరలోనే తెలంగాణ అంతటా పర్యటించనున్నాం. రామ్ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే నిధి, నభా న‌టేశ్‌, ఇద్ద‌రూ చాలా బాగా నటించారు. ఇంత రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇదికేవలం 9 రోజుల కలెక్షన్ మాత్రమే… నంబర్స్ ఇంకా పెరుగుతాయి” అన్నారు.

హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ – “నాకు చాలా  క్రూషియల్ టైమ్‌లో ఈ హిట్ వచ్చింది. ఇది కెరీర్‌కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన పూరి గారికి, అలాగే నాకు ఎంతో సపోర్ట్ చేసిన ఛార్మి గారికి థాంక్స్. రామ్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే న‌భా న‌టేశ్‌ బాగా నటించింది’ అన్నారు.

నటుడు సత్య దేవ్ మాట్లాడుతూ – “ ఈ సినిమా రిలీజ్ రోజు నేను  కాశ్మీర్ లో షూటింగ్‌లో ఉన్నాను. ఫోన్ చేసి అడిగితే హిట్ అన్నారు. నేను నమ్మలేదు నాకు తెలిసిన థియేటర్ ఓనర్‌కి ఫోన్ చేశాను. సర్ వన్ ఇయర్ తరువాత ఇప్పుడే హౌస్ ఫుల్ బోర్డు తీసి క్లీన్ చేసి పెట్టామ‌న్నారు. ఇంత పెద్ద విజయం లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. పూరి గారు ఒక డ్రగ్. దానికి అలవాటు అయితే అంతే. ఇది కేవలం తొమ్మిది రోజుల కలెక్షన్. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయాలనికోరుకుంటున్నాను“ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ భాస్కర బట్ల, కాసర్ల శ్యాం,  ఎడిటర్ జునైద్ ,నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను పాల్గొని ఇస్మార్ట్ శంకర్ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.