Reading Time: 2 mins

ఈగల్ మూవీ టీజర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈగల్ బ్లాస్టింగ్ టీజర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. రవితేజ డిఫరెంట్ షేడ్స్‌ని చూపించిన గతంలో విడుదల చేసిన గ్లింప్స్ వైరల్‌గా మారింది. సినిమా టీజర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించారు.

కొండలో లావని కిందకి పిలవకు ఊరు ఉండడునీ ఉనికి వుండదు  అంటూ రవితేజ పవర్‌ఫుల్ వాయిస్‌ ఓవర్‌తో, స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ టీజర్‌ ఓపెన్ అయ్యింది. ప్రజలకు అపోహగా, ప్రభుత్వాలు దాచిపెట్టిన కథగా హీరో చేసే విధ్వంసాన్ని విజువల్స్ అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. చివరిగా రవితేజ పవర్ ఫుల్ గా పరిచయమౌతూ డిఫరెంట్ అవతార్స్ లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

అత్యుత్తమ సినిమాటోగ్రాఫర్‌లలో ఒకరైన కార్తీక్ ఘట్టమనేని తన అద్భుతమైన టేకింగ్‌తో డైరెక్షన్‌లో తన నైపుణ్యాన్ని చూపించారు. ప్రిమైజ్, నెరేటివ్ ప్రామెసింగ్ గా వున్నాయి. కార్తీక్, కమిల్ ప్లోకీ, కర్మ్ చావ్లాతో కలిసి క్యాప్చర్ చేసిన కెమెరా బ్లాక్‌లు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దావ్‌జాంద్ చేసిన అద్భుతమైన స్కోర్ విజువల్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ విలువలు ఆత్యున్నతంగా వున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల మాస్టర్ వర్క్ ఆకట్టుకుంది.

క్లిప్ చివరిలో రవితేజ కనిపించనప్పటికీ టీజర్ మొత్తం తన మాస్ వైబ్ ని చాటుకున్నారు. మాస్ మహారాజా డిఫరెంట్ గెటప్‌లు, షేడ్స్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అద్భుతంగా అలరించారు. అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల మధ్య సంభాషణ, నవదీప్ మాటలు రవితేజ పాత్రకు మరింత ఎలివేషన్ ఇచ్చాయి. వినయ్ రాయ్ డెడ్లీ విలన్‌గా కనిపించారు. కావ్యా థాపర్‌ మరో కథానాయిక కాగా, మధుబాల కీలక పాత్రలో కనిపించనుంది.

కార్తీక్ గడ్డంనేని రచన, దర్శకత్వం, ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు.

మాస్ స్టఫ్‌తో లోడ్ చేయబడిన ఈ పాన్ ఇండియా చిత్రం టీజర్ సినిమాపై మరింత హైప్‌ను పెంచింది.

2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈగల్ అన్ని దక్షిణ భారత భాషల్లో, హిందీలో విడుదల కానుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.

తారాగణం :

రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా, అక్షర

సాంకేతిక విభాగం :

ఎడిటింగ్, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: టిజి విశ్వ ప్రసాద్
సంగీతం: దావ్‌జాంద్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కార్తీక్ గట్టమ్నేని, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా