ఊల్లాల.. ఊల్లాల ఆడియో ఆవిష్కరణ
సత్యప్రకాశ్‌లో ఇంత టాలెంట్ ఉందనుకోలేదు – ‘ఊల్లాల.. ఊల్లాల’ ఆడియో వేడుకలో రామ్‌గోపాల్ వర్మ
500పైగా చిత్రాల్లో విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై ‘లవర్స్ డే’ ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మించిన చిత్రం “ఊల్లాల ఊల్లాల”. సత్యప్రకాష్ తనయుడు నటరాజ్ ఈ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నూరిన్, అంకిత కథానాయికలు.ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ బిగ్ సీడీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా
రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ”సినిమాకు సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్ చాలా బావున్నాయి. మేకింగ్ వీడియోలో సత్యప్రకాష్‌ను చూసి ఆశ్చర్యపోయా. తనలో ఇంత టాలెంట్ వుందా అనిపించింది. ఇక నాయికగా నటించిన అంకిత బాగా డాన్స్ చేసింది. ఈ చిత్ర నిర్మాత గురురాజ్‌కు సక్సెస్ రావాలని కోరుకుంటున్నా . హీరో నటరాజ్ కి ,అలాగే చిత్ర యూనిట్ కి నా బెస్ట్ విషెస్ అందిస్తున్నాను”అని తెలిపారు.
నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ ”ఈ సినిమా కొసం వందలాది మంది పని చేశారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మాది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జనవరి 1 న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము ” అన్నారు
చిత్ర దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ.. ”జనవరి 1న సినిమా విడుదల చేస్తున్నాం. మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నా. ఈ సినిమాను నిర్మించి విడుదలకు తీసుకు వచ్చిన గురురాజ్‌కు ధన్యవాదాలు. ఆయనతో జర్నీ చాలా ఆనందంగా వుంది. ప్రతి సన్నివేశాన్ని ఇద్దరం చర్చించుకుని తెరకెక్కించాం. అదేవిధంగా సినిమాకు ఏ టైటిల్ పెడదామని చర్చించుకుంటుండగా సడన్‌గా ఆయన మదిలో మెదిలిన ఆలోచనతో టైటిల్ దొరికిందంటూ.. ‘ఊల్లాల..ఊల్లాల’ అని పాడుకుంటూ వచ్చారు. ఈ టైటిల్ చిత్ర యూనిట్‌కూ నచ్చింది. వర్మగారు కూడా బాగుందన్నారు. వర్మగారు రావడానికి గురురాజ్, రామకృష్ణ గౌడ్‌లే కారణం” అన్నారు.
సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ..”రెగ్యులర్ ప్రొఫెషన్ నుంచి రూటుమారి దర్శకుడు అయ్యాడు సత్యప్రకాష్. కొత్తవారితో తీయడమంటే కొన్ని ఆర్థిక సమస్యలుంటాయి. కానీ గురురాజ్ సినిమాకు విడుదలచేస్తాడనే భరోసానే సత్యప్రకాష్‌ను నడిపించింది. ఇక రాము రావడం ఈ చిత్రానికి ఎనర్జీ. ఈ సినిమా గురించి ట్వీట్ చేయాలి” అని వర్మను కోరారు.
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..
”సినిమా చూశాను. చాలా బాగుంది. ప్రతీ సన్నివేశాన్ని అద్భుతంగా మలిచారు. అన్ని హంగులతో ప్రేమ, యాక్షన్, కామెడీ, హార్రర్ అంశాలతో తీశారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా” అన్నారు.
హీరో నటరాజ్ మాట్లాడుతూ ” ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అంటే.. నిర్మాత గురురాజ్ , మా నాన్న సత్య ప్రకాష్ గారు. వీళ్లు లేకపోతే ఈ సినిమా ఇక్కడివరకు వచ్చేది కాదు. ఈ సినిమాకు సంగీతం అందించిన జాయ్ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చాడు. ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు ఎంతో మంది టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. అందరికి తగిన ఫలితం దక్కుతుంది. అందరికి నా మరొకసారి నా ప్రత్యేక కృతజ్ఞతలు టీసులుపుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ అంకిత మాట్లాడుతూ ”అర్జీవి లాంటి గొప్ప డైరెక్టర్ నా పెర్ఫెమెన్స్ గురించి మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇంత పెద్ద లెజెండ్స్ తో స్టేజ్ పై ఉండటం చాలా సంతోషంగా ఉంది. అలాగే సినిమాలో నటించడానికి ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడికి అలాగే నిర్మాత గురురాజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్” అని చెప్పారు.
శివాజీరాజా మాట్లాడుతూ.. ”సత్యప్రకాష్ మాతోపాటు 35 ఏళ్ళనాడే కెరీర్ మొదలుపెట్టాడు. సత్య వేసిన పాత్రలకూ, పర్సనల్ క్యారెక్టర్‌కూ సంబంధమేలేదు. మంచి వ్యక్తిత్వం వున్న వ్యక్తి. గురురాజ్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని తెలిపారు.
నిర్మాత, నటుడు అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ”మిత్రుడు సత్యప్రకాష్ కోసమే వచ్చాను. నేను బెనర్జీ, సత్య.. క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఈ సినిమాలో ఓ సినిమా నిర్మాతగా నటించా. జనరల్‌గా నెగెటివ్ రోల్స్ వేసిన వారిని జనాలు తిట్టుకుంటారు. కానీ వారు బయట చాలా సున్నితమైన మసస్కులు. అలాంటివారిలో సత్య ప్రకాష్ ఒకరు” అని చెప్పారు.
గీతరచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ”ఈ చిత్రంలో ‘రామ్‌రామ్..’ అనే పాటను రాశాను. దాన్ని మంగ్లీ, రోల ్‌రైడా పాడారు. కాంటెంపరరీ ఇష్యూతో టైటిల్ వచ్చేలా పాటను రాశాను. సంగీత దర్శకుడు జాయ్ చిన్నవాడైనా మంచి బాణీలు ఇచ్చాడు” అని పేర్కొన్నారు.
గాయని మంగ్లీ మాట్లాడుతూ ”సత్యప్రకాష్‌ను విలన్‌గా చూశాను. కానీ బయట చాలా మంచివ్యక్తి. నిర్మాత గురురాజ్‌గారు నాతో మొదటిసారి ర్యాప్ పాట పాడించారు. ఆ తర్వాత నటించమన్నారు. అనుకోకుండా రెండు చేశాను” అని చెప్పారు.
సంగీత దర్శకుడు జాయ్ మాట్లాడుతూ… ”గీతామాధురి, అశ్విని, మంగ్లీతోపాటు సంగీతానికి సహకరించిన బ్యాక్‌గ్రౌండ్ టీంకు థ్యాంక్స్. అందరి కృషితో సినిమా పాటలు బాగా వచ్చాయి. ఆడియో బాగా వచ్చింది. ఇది రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జోనర్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి మంచి అవకాశం కల్గింది. ఇందుకు దర్శకుడు సత్యప్రకాష్ ముందుండి నడిపారు” అని తెలిపారు. హీరో నటరాజ్ మాట్లాడుతూ.. ”జాయ్.. బీట్ సాంగ్స్‌తో కిరాక్ పుట్టించాడు. మంగ్లీ, రోల్ రైడా అద్భుతంగా పాడారు” అని అన్నారు.
గీత రచయిత వెంకట్ మాట్లాడుతూ.. ”పాటకు తగిన సంగీతాన్ని అందించిన జాయ్‌గారికి ధన్యవాదాలు. ఇందులో ‘తికమకలు మకతికలుగా’ వుండే ఓ పాటను రాశాను. ఆ పాటకు లెక్క ఉంది.. ఇలాంటి తికమకలు ఎన్నో వున్న సినిమా ఇది” అని చెప్పారు.
పృథ్వీ మాట్లాడుతూ.. ”కథ చాలా బాగుంది. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన దర్శకుడు సత్య ప్రకాష్ తన కోణంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను బాగా తీశాడు” అని కితాబిచ్చారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ఆర్‌జీవి రాకతోనే చిత్రం 50 శాతం సక్సెస్ అయినట్లేనని పేర్కొన్నారు.
ఆదిత్యమ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలయింది. ఇందులో మొదటి పాటను తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆవిష్కరించారు. రెండో సాంగ్‌ను ప్రింట్ మీడియా, వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆవిష్కరించారు.