ఏజెంట్ చిత్రం యాక్షన్ షెడ్యూల్ వైజాగ్ పోర్ట్ లో ప్రారంభం
అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ కొత్త యాక్షన్ షెడ్యూల్ వైజాగ్ పోర్ట్ లో ప్రారంభం.
యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా స్టయిలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ వైజాగ్ పోర్ట్ లో మొదలైయింది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించనున్నారు.
షూటింగ్ లో భాగంగా వైజాగ్ చేరుకున్న హీరో అఖిల్ కు ఎయిర్ పోర్ట్ లో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అఖిల్ ని చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్ బైక్ భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానం చాటుకున్నారు. అభిమానులు నుంచి వస్తున్న ఈ భారీ స్పందన అఖిల్ కి వున్న క్రేజుకి అద్దం పడుతుంది.
హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఏజెంట్ గా అఖిల్ లుక్ అందరిలో ఆసక్తిని పెంచుతుంది. తాజాగా అఖిల్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన పోస్టర్ కి కూడా మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ రచయిత, దర్శకులు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు.
ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
అజయ్ సుంకర, దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు.
తారాగణం: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
బ్యానర్లు: ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా
కథ: వక్కంతం వంశీ
సంగీతం: హిప్ హాప్ తమిజా
డీవోపీ : రసూల్ ఎల్లోర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
స్టంట్స్: శివ