Reading Time: 2 mins

ఐక్యూ (పవర్ అఫ్ స్టూడెంట్) మూవీ జూన్ 2 విడుదల

డిఫరెంట్ యూనిక్ పాయింట్ తో జూన్ 2 న గ్రాండ్ గా విడుదలవుతున్న ఐక్యూ (పవర్ అఫ్ స్టూడెంట్).

ఇది ఒక బ్రెయిన్ కు సంబందించిన సినిమా. మేధావి అయిన అమ్మాయి మెదడును అమ్మడానికి వాళ్ళ ప్రొఫెసర్ ఎలా ప్లాన్ చేశాడు దాని ద్వారా జరిగిన పరిణామాలు ఏంటి అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా ఐక్యూ (పవర్ అఫ్ స్టూడెంట్). కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కె. యల్. పి మూవీస్ పతాకంపై సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీ నటులుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 2 న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, దుబాయ్, యు.కె, యు. యస్. ఏ, నేపాల్ లలో గ్రాండ్ విడుదలకు సిద్దమైన సందర్బంగా

చిత్ర నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ.. యూత్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు రానటువంటి డిఫరెంట్ యూనిక్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది .సినిమాలో మా అబ్బాయి హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాలో సీనియర్ నటులు సుమన్, బెనర్జీ, సత్య ప్రకాష్ , సూర్య, పల్లె రఘునాథ్ రెడ్డి, జబర్దస్త్ శేషు, గీతా సింగ్, వంటి నటీనటులతో కలసి హీరోగా నటిస్తున్న మా అబ్బాయికి ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను.నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమాను త్వరగా పూర్తి చేయగలిగాము.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న మా చిత్రాన్ని జూన్ 2 న ప్రపంచం వ్యాప్తంగా గ్రాండ్ విడుదలవుతున్న మా చిత్రం చూసిన ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీనివాస్ జి.యల్. బి మాట్లాడుతూ..IQ అంటే మేధస్సుకు సంబందించిన చిత్రం. మంచి ఐక్యూ ఉన్న అమ్మాయిని హీరో ఎలా సేవే చేశాడు అనే కథ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్ తో పాటు ఇందులో నటించిన వారంతా చాలా బాగా నటించారు. మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ చిత్రానికి టెక్నిషియన్స్ అందరూ చక్కగా కుదిరారు.త్వరలో ప్రేక్షకులకు ముందుకు వస్తున్న ఈ సినిమాకు మీరందరి సపోర్ట్ కావాలని కోరుతున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు పోలూరి ఘటికాచలం మాట్లాడుతూ.. రెగ్యులర్ స్టోరీ కి భిన్నంగా వస్తున్న ఇలాంటి మంచి సినిమాకు కథ,మాటలు,సంగీతం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఇది చిన్న సినిమా అయినా మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా బాగా రావాలని చిత్ర నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను కంప్లీట్ చేశారు. జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

నటీనటులు :

సాయి చరణ్, పల్లవి, ట్ర్యాన్సీ,సుమన్, బెనర్జీ, సత్య ప్రకాష్ ,సూర్య,పల్లె రఘునాథ్ రెడ్డి,జబర్దస్త్ శేషు, గీతా సింగ్, లక్ష్మీ రావు, సత్తిపండు, జ్ఞానేశ్వర్ రావు,శీలం శ్రీనివాసరావు,, సీఎం రెడ్డి,,వాసు వర్మ, తదితరులు

సాంకేతిక నిపుణులు :

బ్యానర్ : కె. యల్. పి మూవీస్
సమర్పణ :కాయగూరల రాజేశ్వరి
స్క్రీన్ ప్లే,దర్శకత్వం : శ్రీనివాస్ GLB
నిర్మాత : కాయగూరల లక్ష్మీ పతి
కెమెరా : టి. సురేందర్ రెడ్డి
కథ,మాటలు,సంగీతం : పోలూరు ఘటికాచలం