కంచుకోట చిత్రం టైటిల్ లాంచ్
టియఫ్‌సిసి ఛైర్మన్ లయన్ డా. ప్రతాని రామకృష్ణ బర్త్ డే సందర్భంగా `కంచుకోట` చిత్రం టైటిల్ లాంచ్
ఆర్.కె.ఫిలింస్ పతాకంపై లయన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `కంచుకోట`. రహస్యం అనేది ట్యాగ్ లైన్. హీరో రాజశేఖర్ మేనల్లుడు మదన్ హీరోగా పరిచయం అవుతుండగా ఆశ, దివ్వ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎమ్.ఏ చౌదరి, డా. వంశీ దర్శకులు. ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ నెల 18న టియఫ్‌సిసి ఛైర్మన్ లయన్ డా. ప్రతాని రామకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్ లో `కంచుకోట` చిత్రం టైటిల్ లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరి మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ…“ఎన్టీఆర్ గారు నటించిన కంచుకోట చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అదే టైటిల్‌తో ప్రతాని రామకృష్ణ గారు నిర్మిస్తోన్న ఈ కంచుకోట చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ యూనిట్ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు“ అన్నారు.
టియఫ్‌సీసీ వైస్ చైర్మన్ ఏ.గురురాజ్ మాట్లాడుతూ…“ఈ నెల 18న పుట్టిన రోజు జరుపుకోనున్న మా అన్న ప్రతాని గారికి శుభాకాంక్షలు. ఆయన పుట్టిన రోజు కంచుకోట కొత్త చిత్రం టైటిల్ ప్రకటించడం.అందులో ఆయన ఒక ముఖ్య పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. టియఫ్‌సీసీ చైర్మన్ గా ఆయన ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. సినిమాలు కూడా ఇలాగే కంటిన్యూగా నిర్మించాలని..ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.
ప్రముఖ దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ…“ముందుగా టియఫ్‌సీసీ దర్శకుల సంఘం అధ్యక్షుడుగా నన్ను ఎన్నుకున్న ప్రతాని రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ ప్రకటిస్తున్నారు. టియఫ్ సిసీ ద్వారా ఎన్నో మంచి పనులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నందమూరి తారకరామారావు గారు నటించిన కంచుకోట చిత్రం పెద్ద సక్సెస్ అయింది. ఆ కోవలో ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించాలన్నారు.
టియఫ్‌సిసి ఛైర్మన్, చిత్ర నిర్మాత లయన్ డా. ప్రతాని రామకృష్ణ మాట్లాడుతూ…“మంగ్లీ పాడిన ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలో ఆ పాటను వంశీ కొరియోగ్రఫీలో చిత్రీకరించనున్నాం. ఇదొక హిస్టారికల్ పిక్చర్. 40 శాతం గ్రాఫిక్ వర్క్ ఉంటుంది. ఇందులో నేను గురూజీ పాత్రలో నటించాను. నందమూరి తారక రామారావు గారు నటించిన కంచుకోట చిత్రం పెద్ద సక్సెస్ అయింది. అదే స్థాయిలో ఈ కంచుకోట చిత్రాన్ని కూడా పెద్ద సక్సెస్ చేయడానికి మా టీమ్ ఎంతో కృషి చేస్తోంది. హీరో రాజశేఖర్ గారి మేనల్లుడు మదన్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే బ్రహ్మానందం గారు, పృథ్వీ, సత్య ప్రకాశ్ , నాగరాజు కీలక పాత్రల్లో నటించారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చె నెల సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం` అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు, కొరియోగ్రాఫర్ వంశీ, హీరోయిన్లు దివ్య, ఆశ, ఈవియన్ చారి, సినిమాటోగ్రాఫర్ వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.