కాత్యాయని చిత్రం ప్రెస్ మీట్
శ్రీ రాపాక ప్రధాన పాత్రలో హెల్పింగ్ హ్యాండ్ క్రియేషన్స్ చిత్రం “కాత్యాయని”
ప్రముఖ సంగ సేవకుడు, తనవంతు సహాయాన్ని అందిస్తున్న పరమేష్ బొగ్గుల దాదాపు 60 విలేజ్ లకు సరిపడా అత్యాధునిక సౌకర్యాలతో ఒక హాస్పిటల్ని కట్టడానికి రూపకల్పన చేశారు.. అందులో భాగంగా హెల్పింగ్ హాండ్స్ క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. దీని ద్వారా వచ్చే ఆదాయంతో ప్రజలకు మరింత హెల్ప్ చేయడానికి దోహదపడుతుందనె ఉద్దేశంతో తొలి ప్రయత్నంగా కాత్యాయని చిత్రాన్ని ప్రారంభించారు. నాక్డ్ ఫేమ్ శ్రీ రాపాక ప్రధాన పాత్రలో నటిస్తోంది. హెల్పింగ్ హ్యాండ్ క్రియేషన్ పతాకంపై సాయి రాజేష్ దర్శకత్వంలో పరమేష్ బొగ్గుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను తెలపడానికి చిత్ర యూనిట్ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రంలో ప్రముఖ నిర్మాతలు దామోదర ప్రసాద్, సుధాకర్ గౌడ్, నటి శ్రీ రాపాక, దర్శకుడు సాగర్, చిత్ర దర్శకుడు సాయి రాజేష్, చిత్ర నిర్మాత పరమేష్ బొగ్గుల పాల్గొన్నారు..
నిర్మాతల మండలి కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ… శ్రీ నాకు పదేళ్లుగా తెలుసు. ఫస్ట్ తను ఫాషన్ డిజైనర్. చాలా సినిమాలకు వర్క్ చేసింది. బేసిగ్గా శ్రీకి నటన, డాన్స్ పై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. దాంతో ఆర్జీవి నాక్డ్ మూవీలో ఆక్ట్ చేసింది. ఆ చిత్రంతో నటిగా మంచి పేరు సంపాదించుకుంది. అక్కడనుండి వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది.. శ్రీ వెరీ గుడ్ ఆర్టిస్ట్, డిఫరెంట్ మూవీస్ చేస్తుంది. ఇప్పుడు కాత్యాయని మూవీ చేయడం వెరీ హ్యాపీ. ఈ సినిమా పెద్ద హిట్ అయి దర్శక, నిర్మాతలకు మంచి పేరుతో బాటు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
దర్శకుడు సాగర్ మాట్లాడుతూ.. శ్రీ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. తను మాటమీద నిలబడే మనిషి. తనతో నేను ఒక సినిమా చేస్తున్నాను. కాత్యాయని టైటిల్ చాలా బాగుంది. టైటిల్ కి తగ్గట్లుగానే శ్రీని ఎంపిక చేసుకోవడం ఇంకా బాగుంది. ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్..అన్నారు.
నిర్మాత సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. సాయి రాజేష్ మంచి రచయిత, దర్శకుడు. ఈ సినిమా టైటిల్ కి తగ్గట్లుగానే శ్రీ రాపాక గారిని సెలెక్ట్ చేసుకోవడం బాగుంది. ఈ సినిమాతో సాయి రాజేష్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నిలబడతాడు.. అన్నారు.
నటి శ్రీ రాపాక మాట్లాడుతూ… మూడు సంవత్సరాల క్రితమే సాయి రాజేష్ ఈ కథ చెప్పాడు. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అందరికీ నచ్చుతుంది. ప్రొడ్యూసర్ పరమేష్ గారు ఒక 60 విలేజెస్ లో హాస్పటల్ కట్టి ప్రజలకు హెల్ప్ చేస్తున్నారని తెలిసి ఆయన కోసం ఈసినిమా చెయ్యలనుకున్నాను. నాకు ఆర్జీవి గారు మంచి లైఫ్ ఇచ్చారు.. ఆయనకి నా థాంక్స్. అలాగే ఇండస్ట్రీలో నా గాడ్ ఫాదర్ దాము గారు. ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్న.. అన్నారు.
చిత్ర దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. హెల్పింగ్ హాండ్ క్రియేషన్ బ్యానర్ లో తొలి చిత్రంగా కాత్యాయని చిత్రం నిర్మిస్తోన్న పరమేష్ గారికి నా థాంక్స్. ఇదొక 1990లోజరిగే లవ్ స్టొరీ. 2020లో జరిగే మూడు ప్రేమకథలకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వాటిని కాత్యాయని ఎలా డీల్ చేసింది అనేది మెయిన్ కాన్సెప్ట్. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లో శ్రీ రాపాక నటిస్తోంది. లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రాన్ని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.. అన్నారు.
చిత్ర నిర్మాత పరమేష్ బొగ్గుల మాట్లాడుతూ.. మంచి కథ కథనాలతో రూపొందుతున్న కాత్యాయని చిత్రం అందరికీ నచ్చుతుంది. శ్రీ రాపాక టైటిలే పాత్రలో నటిస్తుంది. ఈ రోజు పోస్టర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం అన్నారు. అనంతరం నిర్మాత తనయుడు మహేష్ పుట్టినరోజు వేడుకను ఇదే వేదికపై భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందించారు.
శ్రీ రాపాక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీ,నటులు నటిస్తున్నారు. హెల్పింగ్ హ్యాండ్ క్రియేషన్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రానికి కో-డైరెక్టర్: ఎ. మధుసూదన్ రెడ్డి, పి ఆర్ ఓ: సాయి సతీష్, రచన-దర్శకత్వం: సాయి రాజేష్, నిర్మాత: పరమేష్ బొగ్గుల.