Reading Time: 2 mins

కార్తికేయ ’90 ఎమ్‌.ఎల్‌’ సినిమా రివ్యూ

కిక్ సరిపోదు (కార్తికేయ ’90 ఎమ్‌.ఎల్‌’  రివ్యూ)

Rating: 2

అప్పుడప్పుడూ  తాగేవాళ్లనే అందరూ దూరం పెడుతూంటారు. అలాంటిది పుట్టుకతోటే తాగుబోతుగా మారిన ఓ వ్యక్తి జీవితం ఎలా గడుస్తుంది. అతనికు ఉద్యోగం ఎవరు ఇస్తారు..అతన్ని ఎవరు ప్రేమిస్తారు..జీవితం ఎవరు పంచుకుంటారు…ఇవన్నీ ఇంట్రస్టింగ్ విషయాలే సరిగ్గా తెరకెక్కిస్తే. అదే చేసానంటూ  ’90 ఎమ్‌.ఎల్‌’ సినిమా మన ముందుకు వచ్చింది. టైటిల్, ట్రైలర్ తోనే ఆసక్తి రేపిన ఈ చిత్రం కథేంటి..వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న కార్తికేయ కెరిర్ కు కిక్కు ఇచ్చే సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

దేవదాసు (కార్తికేయ)కు పుట్టుకతోటే    ‘ఫేటెల్ ఆల్కహాల్ సింట్రోమ్’ అనే అరుదైన వ్యాధి వస్తుంది. దానికి మందు ఏమిటీ రోడూ అంటే రోజూ ఓ నైంటీ ఎమ్ ఎల్ తీసుకోవాలి. ఎప్పుడైనా ఆల్కహాల్ బోర్ కొట్టి మానేస్తే అది ప్రాణాంతకం. దాంతో ఆ ఆల్కహాల్ నే మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ గా తీసుకుని తన లైఫ్ ని ముందుకు తీసుకెళ్తూంటాడు దేవదాసు. ఇలాంటి దేవదాసు జీవితంలోకి సువాసన (నేహా సోలంకి) వస్తుంది. ఆమె ఓ ఫిజియో థెరిఫిస్ట్. ఆమెతో తొలి చూపులోనే  ప్రేమలో పడిన దేవదాసుకు ఇప్పుడు తన తాగుడే పెద్ద సమస్య గా తమ లవ్ స్టోరీకి నిలుస్తుందని తెలుసుకోలేకపోతాడు. ఆమెకు గానీ ఆమె తండ్రి (రావు రమేష్) కు కానీ తాగుడు అన్నా, తాగేవాళ్లన్నా పడదు. దాంతో ఓ రోజు దేవదాసు మ్యాటర్ ఆమెకు తెలిసిపోతుంది.  ఆమె ఇతను తాగుబోతు అని తెలుసుకుని బ్రేకప్ చెప్పేస్తుంది. అప్పుడు దేవదాసు ఏం చేసాడు. ఇప్పుడు ప్రేమలో విఫలమయ్యాను అని మరింత తాగటం మొదలెట్టాడా… తాగుడు వదిలేసి తన లవర్ తో పెళ్లి కు సిద్దపడ్డాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కిక్ ఇవ్వని కథ, కథనం

ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుంది…
ఓ పెళ్లి జరుగుతూంటుంది..పెళ్లి కొడుకు తాగి ఉంటాడు. అతన్ని అందరూ కొట్టబోతాడు. అప్పుడు హీరో ఎంట్రీ ఇస్తాడు. చాలా తెలివిగా మీలో ఎవరూ జీవింతంలో ఓ చుక్క ఆల్కహాలు కూడా టేస్ట్ చేయనివాళ్లు ఉంటే కనుక వాళ్లు ముందుకు వచ్చి అతన్ని కొట్టండి అంటాడు..అప్పుడు కెమెరా అందరి వైపూ ప్యాన్ చేస్తుంది. పెళ్లి కూతురుతో సహా అందరూ తలవంచుకుంటారు. అంటే అందరూ అప్పుడో..ఎప్పుడో ఓ పెగ్గేసినవాళ్లే అన్నమాట. ఈ విషయం ఖరారు చేస్తూ..హీరో తాగుడు గొప్పతనం గురించి ఓ గొప్ప డైలాగు చెప్పి అప్పుడు ఇంట్రడక్షన్ సాంగ్ వేసుకుంటాడు.  ఇదీ ఈ సినిమా స్టాండర్డ్. ఇలాంటి సీన్స్ ,డైలాగులు ఈ సినిమాలో మనం ఏరుకోదగినన్ని ఉంటాయి. ఇదీ ఈ సినిమా స్టాండర్డ్.

ఇక దర్శకుడు కేవలం  ఫేటెల్ ఆల్కహాల్ సిండ్రోమ్  అనే ఒకే ఒక విషయం పెట్టి కథ నడిపేద్దామనుకున్నాడు. అంతేకానీ దాని చుట్టూ కథ అల్లాలి. అదీ హాస్యాస్పందంగా మారకూడదు అనుకోలేదు. పరమ రొటీన్ టెంప్లేట్ లో ఈ పాయింట్ ని కూర్చోపెట్టి ఓ లవ్ స్టోరీ, ఓ చిన్న విలన్ ట్రాక్ పెట్టుకుని లాగేసాడు. దాంతో ఈ సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే ఎన్నో సార్లు చూసిన సినిమా మళ్లీ చూస్తున్న ఫీల్ తీసుకొచ్చింది. పోనీ ఫస్టాఫ్ లో అలాగుంది..సెకండాఫ్ లో ఏమన్నా కొత్త మలుపులు ఉంటాయా అదీ ఉండదు. చాలా ప్రెడిక్టబుల్ గా నడిచే కథ,కథనం. ఈ కాలం సినిమాలకు మహారాజ పోషకులైన యూత్ ..ప్రపంచ సినిమా చూసేస్తున్నారు. వారిని మెప్పించాలి, జై కొట్టించుకుని,కలెక్షన్స్ కుమ్ముకోవాలంటే ఈ కిక్ సరిపోదు. కథ,కథనంపై మరింత కసరత్తు చేస్తేనే సినిమా నడక బాగుంటుంది. ఆ విషయంలో పూర్తిగా ఫెయిలైందీ సినిమా.

పోనీ మిగతా సీన్స్ అయినా కొత్తగా ఉంటాయా అంటే…అవీ పరమ రొటీన్ గానే సాగుతాయి. హీరోయిన్  ట్రాఫిక్ కంట్రోలు చేస్తూ ఓ మంచి పౌరురాలిగా మనకు పరిచయం అవటం, వెంటనే అది చూసి ఆమెతో ప్రేమలో పడటం జరుగుతుంది. అలాగే సువాసన అని హీరోయిన్ కు పేరు పెట్టడటం..హీరోకు దేవదాసు అని పేరు పెట్టడం…అన్నీ కామెడీగా ఉంటాయి. ఎక్కడా సీరియస్ నెస్ గా కనిపించదు. డైరక్టర్ ఈ సినిమాని ఎంత లైట్ తీసుకున్నాడో అర్దమవుతుంది.

సాంకేతికంగా..

ఈ సినిమా టెక్నికల్ గా అవుట్ స్టాండెట్ గా ఏమీ లేదు. సినిమా కథ కు తగ్గట్లే అన్ని విభాగాలు నీరసంగా అమిరాయి. అనూప్ రూబెన్స్ వంటి స్టార్ మ్యూజిక్ డైరక్టర్ సైతం మొక్కుబడిగా చేసినట్లు చేసారు. ఎడిటర్ కూడా ప్రేక్షకులకు అన్యాయం చేసాడు.
ఉన్నంతంలో సినిమాటోగ్రఫీ మాత్రమే బాగుంది.

ఇక దర్శకుడు యెర్ర శేఖర్ రెడ్డి  కొత్త  పాయింట్ ఎత్తుకున్నా పాత ట్రీట్మెంట్ తో పాడు చేసాడు.  

చూడచ్చా…

చూసాక మనకూ ఓ నైంటీ ఎమ్ ఎలా వేసుకోవాలనిపించవచ్చు.

తెర ముందు..వెనక

నటీనటలు: కార్తికేయ, నేహా సోలంకి, ప్రగతి, రావు రమేష్, రవి కిషన్  తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌,
కెమెరా: జె.యువ‌రాజ్‌,
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌,
ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌,
ఫైట్స్: వెంక‌ట్‌.
కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం: శేఖర్ రెడ్డి