Reading Time: < 1 min

                కిరణ్ అబ్భవరం న్యూ మూవీ  క  టీజర్ విడుదల

 

ఈరోజు యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం పుట్టినరోజు సంధర్భంగా అతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”క” టీజర్ లాంఛ్ ఈవెంట్ అమీర్ పేట్ లోని సత్యం AAA సినిమాస్ లో గ్రాండ్ గా జరిగింది. ఇప్ప‌టికే టైటిల్ పోస్టర్ రిలీజ్ తో ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను అనౌన్స్ చేయ‌గానే అభిమానుల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ‘క’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఈ సినిమాపై మరింత అంచ‌నాలు పెరిగేలా చేస్తోంది.

శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై, చింతా గోపాల్ రెడ్డి, చింతా వినీషా రెడ్డి నిర్మాతలుగా, విశ్వస్ డేనియల్, సతీష్ రెడ్డి ద్వయం సినిమాటోగ్రఫీ అందించారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ డిజైనింగ్ చేసిన సుధీర్ మాచర్ల 1970 పీరియడ్ లోకి తీసుకెళ్ళలా ఆర్ట్ వర్క్ మెప్పించారనే చెప్పాలి.

1970 నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఓ పోస్ట్ మెన్ గా క‌నిపిస్తున్నాడు. అయితే, అత‌డికి సంబంధించిన‌ గ‌తం గురించి తెలుసుకునే క‌థే ఈ సినిమా మెయిన్ ప్లాట్ గా ఉండ‌నున్న‌ట్లు ఈ టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. యాక్ష‌న్ కు ఏమాత్రం కొదువ లేకుండా ఈ టీజ‌ర్ క‌ట్ ఉండటంతో సినిమాపై మంచి ఆస‌క్తి నెల‌కొంది. ఇక కిర‌ణ్ అబ్బ‌వ‌రం మేకోవ‌ర్ కూడా ప‌ర్ఫెక్ట్ గా ఉండ‌టంతో అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస‌క్తిగా చూస్తున్నారు.

ఈ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు మరియు ‘ శతమానం భవతి ‘ డైరక్టర్ సతీష్ వేగేశ్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో తాన్వి రామ్, న‌య‌న్ సారిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా కిర‌ణ్ అబ్బ‌వ‌రం కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ‌డ్జెట్ మూవీగా రానుంది. ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి పనిచేసిన వారంతా ఖచ్చితంగా హిట్ కొడతామన్న కాన్ఫిడెన్స్ గా వున్నారు.