కుడి ఎడమైతే టీజర్ విడుదల
తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో విడుదలైన సై ఫై క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ `కుడి ఎడమైతే` టీజర్
ప్రతి వారం హండ్రెడ్ పర్సెంట్ తెలుగు మాధ్యమం ఆహా లేటెస్ట్ బ్లాక్ బస్టర్స్, క్వాలిటీ వెబ్ షోస్, ఒరిజినల్స్‌తో తెలుగు ప్రేక్షకులమను మెప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో జూలైలో తన మార్కును చాటుకుంటూ ఆహా ధృవ్ సర్జా, రష్మిక మందన్న నటించిన `పొగరు`, ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?` చిత్రాలను అందించింది.
అదే ఊపులో ఈ నెలలో ప్రేక్షకులు మరో ఆశ్చర్యాన్ని అందిస్తోంది `ఆహా`. మోస్ట్ అవెయిటెడ్ సై ఫై క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ `కుడి ఎడమైతే`ను జూలై 16న వీక్షకులకు అందిస్తోంది. యూ టర్న్, లూసియా వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో సూపర్ డూపర్ విజయాలను అందించిన డైరెక్టర్ పవన్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. అమలాపాల్, రాహుల్ విజయ్, పద్మిని సేట్టం, రాజ్ మాదిరాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ టీజర్ శనివారం `ఆహా`లో విడుదలైంది. ఈ టీజర్‌ను చూస్తుంటే సిరీస్‌ను చూడటానికి ఇంకా ఎంతసేపు వేచి చూడాలనే భావన అందరిలోనూ కలుగుతుంది. ఓ నిర్ణీత సమయంలో జరిగిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, క్రైమ్ డ్రామాగా సిరీస్ రూపొందిందనే టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. ఎలాంటి విచక్షణ లేని, మంచి చెడు గురించి ఆలోచించని పోలీస్ ఆఫీసర్ దుర్గ(అమలాపాల్), డెలివరీ బాయ్ ఆది(రాహుల్ విజయ్) జీవితాల్లో ఓ చెడు ఘటన ఒకే రోజు, ఒకే సమయంలో ఒకేసారి ఎలా జరిగింది అనే పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. అయితే ఈ టైమ్ లూప్ ఎలా ముగుస్తుందో తెలియాలంటే జూలై 16వరకు ప్రేక్షకులు ఉత్కంఠతతో వేచి చూడాల్సిందే.
ఈ వారం ప్రారంభంలో తెలుగు ప్రేక్షకుల కోసం బెస్ట్ కంటెంట్‌ను ఆహా డిజిటల్ మాధ్యమం అందిస్తోంది. సూపర్ హిట్స్ అనే ప్రచార కార్యక్రమం ద్వారా ఔత్సాహికుల్లో తీసుకొచ్చింది. అందులో భాగంగా ప్రేక్షకుల ఇష్టమైన సినిమాలు, వెబ్ ఒరిజినల్స్ అందిస్తున్నారు. కార్తి నుంచి రవితేజ, అలాగే సమంత, తమన్నా, అల్లరి నరేశ్, ఫహాద్ ఫాజిల్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫామెన్స్ చిత్రాలు. క్రాక్, నాంది, లెవన్త్ అవర్, సామ్ జామ్, ట్రాన్స్లను తీసుకొచ్చింది ఆహా. అలాగే ప్రేక్షకులకు తిరగులేని ఎంటర్టైన్మెంట్ అందిస్తామని ప్రకటించినట్లే శేఖర్ కమ్ముల `లవ్‌స్టోరి`(నాగచైతన్య, సాయిపల్లవి), రొమాంటిక్ కామెడీ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్(అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే), నాగశౌర్య స్పోర్ట్స్ డ్రామా లక్ష్య వంటి మరిన్ని అద్భుతమైన చిత్రాలను అందించనుంది.
వేదికపై ఇష్టమైన చిత్రాలు మరియు వెబ్ ఒరిజినల్స్ ద్వారా తమ అభిమాన తారల ప్రకాశాన్ని జరుపుకునే ప్రేక్షకుల వద్ద ఆహా సూపర్‌హిట్స్ దర్శకత్వం వహించబడతాయి.
`క్రాక్, జాంబిరెడ్డి, నాంది, చావు కబురు చల్లగా, సుల్తాన్, లెవన్త్ అవర్, అర్ధ శతాబ్దం, కాలా, లుకా, షైలాక్, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు, వెబ్ షోస్‌తో 2021ని స్టార్ట్ చేసిన ఆహా మరింత గొప్ప ఎంటర్టైన్మెంట్ను అందించడానికి సిద్ధంగా ఉంది.