కూతురు తో కలిసి మొక్కలు నాటిన రేణు దేశాయ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి తన కూతురు తో కలిసి మొక్కలు నాటిన హీరోయిన్ రేణు దేశాయ్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన కూతురు మరియు కూతురి స్నేహితురాలు తో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కు లో మొక్కలు నాటిన హీరోయిన్ రేణు దేశాయ్.
ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న జీవన విధానంలో మనందరం అపార్ట్మెంట్ కల్చర్ కి అలవాటు పడ్డామని మన చిన్నతనంలో స్వంత గృహాలలో ఉండడంవల్ల ఆ చుట్టు పక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకునేది అని. కానీ ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి పెంచాలని విషయం తెలియడం లేదని. కాబట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉదయభాను నాకిచ్చిన చాలెంజ్ స్వీకరించి ఈ రోజు నా కూతురు ఆద్య మరియు కూతురు స్నేహితురాలు యషిక ఇద్దరినీ నేను ఇక్కడికి తీసుకు వచ్చాను వారి వయసు 10 సంవత్సరాలు వారికి మొక్కలను ఏ విధంగా నాటాలి మొక్కలు నాటడం వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాన్ని తెలపటం కోసం వాళ్ళిద్దరు తీసుకురావడం జరిగిందని .ఇప్పుడు నాటే మొక్కలు తక్షణమే ఫలితం ఇవ్వకున్న కూడా భవిష్యత్ తరాలకు పది పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాటిన మొక్క యొక్క ఉపయోగం ఉంటుందని తెలిపారు. దాని ఫలాలు భవిష్యత్ తరాలవారు అందుకుంటారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా కూతురు తో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నీను ముగ్గురికి చాలెంజ్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నాను. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.