Reading Time: < 1 min
క్రాక్ చిత్రం షూటింగ్‌ వ‌ర్కింగ్ వీడియో విడుద‌ల
 
‘క్రాక్’ చిత్రంలో “స్టేష‌న్‌లో ఉన్న‌ప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి దొబ్బిచ్చుకో” అంటున్న ర‌వితేజ‌

మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’. ఇదివ‌ర‌కు ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ‘డాన్ శీను’, ‘బ‌లుపు’ సినిమాలు ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి హిట్ట‌య్యాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్‌పై క‌న్నేశారు.

‘క్రాక్’ షూటింగ్ గ‌త వారం రామోజీ ఫిల్మ్ సిటీలో పునఃప్రారంభ‌మైంది. ర‌వితేజ, ఇత‌ర న‌టీన‌టుల‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్త‌వుతుంది.

సోమ‌వారం ‘క్రాక్’ షూటింగ్‌కు సంబంధించిన ఒక వ‌ర్కింగ్ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇందులో షూటింగ్ సెట్ మొత్తాన్ని ప్రాప‌ర్‌గా శానిటైజ్ చేయ‌డం, ఎంట్ర‌న్స్‌లో డిజిన్‌ఫెక్టెంట్ ట‌న్నెల్‌ను ఏర్పాటు చేయ‌డం మ‌నం చూడొచ్చు. ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని స‌హా సెట్‌లో ఉన్న ప్ర‌తి యూనిట్ మెంబ‌ర్ మాస్క్ ధ‌రించి క‌నిపిస్తున్నారు. కెమెరా ముందుకు వ‌చ్చి న‌టిస్తున్న‌ప్పుడు మాత్ర‌మే యాక్ట‌ర్లు మాస్క్‌లు తీసేస్తున్నారు.

“స్టేష‌న్‌లో ఉన్న‌ప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి దొబ్బిచ్చుకో” అని తోటి పోలీస్‌తో ర‌వితేజ గ‌ట్టిగా చెబుతున్న లేటెస్ట్ డైలాగ్ సీన్ ఒక‌దాన్ని ఈ వీడియోలో మ‌నం చూడొచ్చు. ఆ డైలాగ్‌తో ర‌వితేజ క్యారెక్ట‌రైజేష‌న్ ఏ రీతిలో ఉంటుందో చిత్ర బృందం మ‌న‌కు హింట్ ఇస్తోంది.

అలాగే త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ క‌థ‌లోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసే రీతిలో ఆక‌ట్టుకుంటోంది.

ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు, మాస్ ఎలిమెంట్స్‌తో క‌నిపించిన టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ రావ‌డ‌మే కాకుండా, ర‌వితేజ ఫ్యాన్స్‌ను, ప్రేక్ష‌కుల‌ను అవి అమితంగా ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు వ‌ర్కింగ్‌ వీడియోతో ఈ చిత్రంపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకొనే అంశాల‌తో, ఉద్వేగ‌భ‌రితమైన‌ క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన పాట‌లు, ట్రైల‌ర్ త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా త‌యార‌వుతున్న ‘క్రాక్’ మూవీలో శ్రుతి హాస‌న్ నాయిక‌గా న‌టిస్తున్నారు. పేరుపొందిన త‌మిళ న‌టులు స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్లు పోషిస్తున్నారు.

స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ‘మెర్సాల్‌’, ‘బిగిల్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌నిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి.

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌:  బి. మ‌ధు
బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  జి.కె. విష్ణు
డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా
కూర్పు: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌
ఫైట్స్‌:  రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు:  రామ‌జోగ‌య్య శాస్త్రి