Reading Time: 2 mins

క్లూ సినిమా టీజర్ లాంచ్

“క్లూ” సినిమా పెద్ద హిట్ అయి టీం అందరికీ మంచి పేరు తేవాలి.. టీజర్ లాంచ్ లో అతిధుల ఆకాంక్ష
 
పృద్వి శేఖర్ హీరోగా సబీనా జాస్మిన్ హీరోయిన్ గా రమేష్ రాణా దర్శకత్వంలో యస్ అండ్ యమ్ క్రియేషన్స్ పతాకంపై సుబాని అబ్దుల్ నిర్మించిన చిత్రం “క్లూ”. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో నవంబర్18న ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోలు జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్, ఆకాష్ పూరి, రాహుల్ విజయ్,   ప్రముఖ దర్శకుడు వీర శంకర్, ఫైట్ మాస్టర్ విజయ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. 
 
హీరో పృద్వి శేఖర్ మాట్లాడుతూ.. ఫైట్ మాస్టర్ గా చాలా ఆఫీసులకి తిరిగాను. లక్కీగా ఒక ప్రొడక్షన్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చాలా తాపత్రయ పడే వాడ్ని. ఆ టైంలో ఈ సినిమా ఛాన్స్ వచ్చింది. నిర్మత సుబాని అబ్దుల్ హీరోగా  అవకాశం ఇచ్చారు. రాహుల్, ఆకాష్ నన్ను బ్లెస్స్ చేయడానికి వచ్చినందుకు చాలా థాంక్స్..అన్నారు.
 
జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పృద్వి మాస్టర్ హీరోగా చేసిన క్లూ చిత్రం మంచి హిట్ అయి నిర్మాత దర్శకులకు మంచి పేరు రావాలి.. అన్నారు. 
 
ఆకాష్ పూరి మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుంది.  పృద్వి  శేఖర్ మంచి ఈజ్ తో చెసారు.  ఫైట్స్ చాలా బాగా చేశారు. మేము ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా అద్భుతంగా చేశారు . ఫ్యూచర్ లో వన్ ఆప్ ది టాప్ మోస్ట్ ఫైట్ మాస్టర్ అవుతారు . హీరోగా కూడా మాస్టర్ సక్సెస్ అవ్వాలి..విజయ్ మాస్టర్ అంత పేరు తెచ్చుకోవాలి..అన్నారు. 
 
ప్రముఖ దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు చూసాను. చాలా ఇంట్రెస్టింగా బాగా తీసాడు రమేష్. ఈ సినిమా పెద్ద హిట్ అయి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు తీసుకు రావాలి అన్నారు. 
 
ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ.. పృద్వి మా అబ్బాయి. ఇద్దరం కలిసి అలానే పనిచేసాం. మంచి మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా లాంచ్ అవుతున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయి  మా పృద్వి హీరోగా కూడా సక్సెస్ అవ్వాలి అన్నారు. 
 
చిత్ర దర్శకుడు రమేష్ రాణా మాట్లాడుతూ.. వందల సంవత్సరాల క్రితం కనుమరుగైన అపార సంపదని ఎలా వెతికారు.. ఆ ప్రయాణంలో ఎదురైనా దుష్ట శక్తులను ఎలా ఎదిరించారు..అనేది  చిత్ర కథాంశం. ఆధ్యాంతం ఆసక్తి రేపే  వైవిధ్యమైన కథ,కథనాలతో ఎక్కడ నిర్మాణ  విలువలు తగ్గకుండా అద్భుతమైన లోకేషన్లలో షూటింగ్ చేసాం.. అన్నారు. 
 
చిత్ర నిర్మాత సుబాని అబ్దుల్ మాట్లాడుతూ.. వరుస చిత్రాలతో తెలుగు చిత్ర సీమకు విందు భోజనం లాంటి సంగీతాన్ని అందిస్తున్న సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మా చిత్రానికి అదనపు బలంగా నిలుస్తుంది. రమేష్ రాణా అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు. పృద్వి మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలబడతాడు..అన్నారు. 
 
సబీనా  జాస్మిన్ , శుభాంగి పంత్ , సంజన నాయుడు , శియాజీ షిండే , మధు నారాయణన్ , రాజా రవీంద్ర , జీవా మరియు దేవ్ గిల్ ముఖ్య పాత్రలు పోషించారు. 
 
ఈ చిత్రానికి ఆర్ట్: విజయ్ కృష్ణ , ఫైట్లు–షావోలిన్ మల్లేష్ , కుంగ్ ఫు శేఖర్ , నృత్యo:అనీష్, సంగీతం: ర్యాప్ రాక్ షకీల్, స్క్రీన్ ప్లై-మాటలు: అప్సర్, కెమెరా: శ్రీనివాస్ సబ్బి, ఎడిటర్: సాయి భరద్వాజ విప్పర్తి, దర్శకత్వం: రమేష్ రాణా, నిర్మాత: సుబాని అబ్దుల్.