Reading Time: 2 mins

ఖిలాడి చిత్రO థియేటర్స్‌లోనే విడుదల

థియేటర్స్‌లోనే విడుదల కానున్న మాస్‌ మహారాజా రవితేజ, రమేష్‌ వర్మ, కోనేరు సత్యానారాయణ ‘ఖిలాడి’.

మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్‌’ అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలైన ‘ఖిలాడి’ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. దీంతో ‘ఖిలాడి’ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో కూడా అంచనాలు పెరిగిపోయాయి. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఖిలాడి’ సినిమా హవిష్‌ ప్రొడక్షన్స్, పెన్‌ స్టూడియోస్, ఏ స్టూడియోస్‌ పతాకాలపై కోనేరు సత్యానారాయణ నిర్మిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ‘ఖిలాడి’ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ‘ఖిలాడి’ చిత్రాన్ని థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని ‘ఖిలాడి’ చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోనేరు సత్య నారాయణ మాట్లాడుతూ–‘‘ఖిలాడి’ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. థియేటర్స్‌లో చూసి ప్రేక్షకులు ఆస్వాదించేలా ‘ఖిలాడి’ సినిమాను చిత్రీకరిస్తున్నాము. నిర్మాణ విలువల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడలేదు. ‘ఖిలాడి’ సినిమా కథ, కథనం, సాంకేతిక విలువలు అన్నీ అత్యద్భుతంగా ఉంటాయి. థియేటర్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసమే ‘ఖిలాడి’ చిత్రాన్ని తీస్తున్నాము. ఈ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తాం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా దర్శకుడు రమేష్‌ వర్మ ‘ఖిలాడి’ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. యాక్షన్, రొమాన్స్, కథ, కథనం ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. అలాగే ఇటీవల ఇటీలీలో తీసిన యాక్షన్‌ సీక్వెన్సెస్‌ మరో హైలైట్‌. ఇక దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం, స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ డిజైన్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ సినిమాకు అదనపు ఆకర్షణలు. సాంగ్స్‌ విడుదలను గురించి త్వరలో వివరాలు వెల్లడించబోతున్నాం. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని అన్నారు.

సుజిత్‌ వాసుదేవ్, జీకే విష్ణు ఈ సినిమాకు ఛాయగ్రాహకులు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ తమ్ముడు సాగర్, శ్రీకాంత్‌ విస్సా ఈ సినిమాకు డైలాగ్స్‌ అందిస్తున్నారు. శ్రీమణి లిరిక్స్‌ రాస్తుండగా, అమర్‌ రెడ్డి ఎడింటింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

నటీనటులు: రవితేజ, మీనాక్షీ చౌదరి, డింపుల్‌ హయతి

సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌: రమేష్‌ వర్మ
నిర్మాత: కోనేరు సత్యానారాయణ
ప్రొడక్షన్‌: ఏ హవిష్‌ ప్రొడక్షన్‌
సమర్పణ: జయంతిలాల్‌ గడ
మ్యూజిక్‌ డైరెక్టర్‌: దేవి శ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: సుజిత్‌ వాసుదేవ్, జీకే విష్ణు
స్క్రిప్ట్‌ కో ఆర్డినేషన్‌: పాత్రికేయ
ఫైట్స్‌: రామ్‌–లక్ష్మణ్, అన్భు–అరివు
డైలాగ్స్‌: శ్రీకాంత్‌ విస్సా, సాగర్‌
ఎడిటింగ్‌: అమర్‌ రెడ్డి
లిరిక్స్‌: శ్రీమణి
ఆర్ట్‌:  గాంధి నడికుడికర్