Reading Time: 2 mins

గం గం గణేశా మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

గణేశ్ (ఆనంద్ దేవరకొండ), అతని  ఫ్రెండ్ (జబర్దస్త్ ఇమాన్యూయల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అటు శ్రుతి (నయన్ సారిక)తో బాగా డీప్ గా ప్రేమలో ఉంటాడు. ఐతే, శ్రుతి మాత్రం తనకు బెటర్ ఆప్షన్ దొరకగానే గణేశ్ కి హ్యాండ్ ఇస్తోంది. అమ్మాయి మనసు గెల్చుకోవాలంటే డబ్బే సంపాదించాలని డైమండ్ దొంగతనం చేసే డీల్ ఒప్పుకొంటాడు. ఇదిలా ఉంటే కర్నూల్ లో కిశోర్ రెడ్డి (అర్జున్ రాజ్) ఎలక్షన్స్ లో డబ్బు పంచడం కోసం 100కోట్లు వినాయకుడి బొమ్మలో పెట్టి ముంబై నుంచి తెప్పిస్తుంటాడు.  గణేష్ దొంగతనం చేసినా  ఆ డైమండ్ వినాయకుడి  విగ్రహంలోకి ఎలా వెళ్ళింది ?,  ఇంతకీ.. గణేశ్ లైఫ్ లోకి నీలవేణి (ప్రగతి శ్రీవాస్తవ) ఎలా వచ్చింది ?, చివరకు గణేశ్ లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేది మిగిలిన కథ.

ఎనాలసిస్ :

అమ్మాయి మోసం చేసిందనే భాదతో ..ఎలాగైనా డబ్బున్నోడు అవ్వాలని హీరో డైమండ్ దొంగతనం చేస్తే..అతని లైఫ్ మలుపులు తిరగడం .

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

ఆనంద్ దేవరకొండ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు.హీరోయిన్స్ ప్రగతి శ్రీవాస్తవ,నయన్ సారిక కూడా చాలా బాగా నటించారు.  వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ కామెడీ పర్వాలేదు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నికల్ గా :

దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి చిన్న స్టోరీ లైన్ ని బాగా డైరెక్ట్ చేసాడు. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. ఆదిత్య జవ్వాది వాటిని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాతలు కేదర్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

న‌టీన‌టుల యాక్టింగ్‌,

కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్ :

కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే స్లో గా ఉంటుంది

తీర్పు :

బోర్ కొట్టని గణేష్..

నటీనటులు:

ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు.

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : గం గం గణేశా

బ్యానర్: HyLife Entertainment Banner

విడుదల తేదీ: 31-05-2024

సెన్సార్ రేటింగ్: “ U/A “

దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి

సంగీతం: చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది

ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్

నిర్మాత: కేదర్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి

రన్టైమ్: 140 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్