మే 3న గ్రాండ్ గా రిలీజవుతున్న `గీతా .. ఛలో`
ఛలో, గీత గోవిందం, దేవదాస్… ఇలా వరుస విజయాలతో తనకంటూ తెలుగులో మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు రష్మికా మందన. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక నటించిన `గీతా.. ఛలో` మే3న విడుదలవుతోంది. దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ రాజేశ్వరి ఫిలింస్ -మూవీ మాక్స్ బ్యానర్లపై ఈ చిత్రం విడుదలవుతోంది. రిలీజ్ సందర్భ ంగా చిత్రయూనిట్ హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో పాత్రికేయులతో ముచ్చటించింది.
నిర్మాతలు మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ మాట్లాడుతూ -“యువతరం మెచ్చే అన్ని హంగులు ఉన్న చిత్రమిది . వీకెండ్ పార్టీలు యువతకు మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? అనే పాయింట్ చుట్టూ ఉన్న కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. కన్నడలో ఛమ్మక్ పేరుతో విడుదలైన ఈ చిత్రం దాదాపు 30 కోట్లు వసూలు చేసింది. మంచి చిత్రాన్ని అందరూ చూడాలనే వాయిదా వేసి మే 3న విడుదల చేస్తున్నాం. డబ్బింగ్ సినిమా అయినా స్ట్రెయిట్ చిత్రంగా దీనిని ప్రమోషన్ చేస్తున్నాం“ అని తెలిపారు.
నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ- “భారీ క్రేజుతో వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. చక్కని కంటెంట్ ఉన్న చిత్రమిది. నిర్మాతలకు లాభాలు రావాలి“ అన్నారు.
రామ సత్యనారాయణ మాట్లాడుతూ -“సినిమా తీయడమే కాదు రిలీజ్ చేయడంలో చక్కని ప్రణాళికలు ఉండాలి. నిర్మాతలు పంపిణీ రంగంలో అనుభవజ్ఞులు. అవెంజర్స్ వల్ల వాయిదా వేసి సరైన టైమ్ లో రిలీజ్ చేస్తున్నారు“ అని అన్నారు.
సాయి వెంకట్ మాట్లాడుతూ -“ మే 3న రిలీజవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. రష్మిక క్రేజుకు తగ్గట్టే విజయం దక్కించుకుంటుంది. ఆల్ ది బెస్ట్“ అన్నారు.
సమర్పకుడు దివాకర్ మాట్లాడుతూ – “గీత గోవిందంతో 100 కోట్ల క్లబ్ నాయికగా రష్మిక నిర్మాతల బంగారు బాతులా మారారు. తను నంబర్ వన్ స్థాయిలో ఉన్నారు. గీతా ఛలో పెద్ద విజయం సాధిస్తుంది“ అన్నారు.
బెక్క ం వేణు గోపాల్ మాట్లాడుతూ- “డబ్బింగ్ సినిమాలు ఎన్నో వస్తుంటాయి. అయితే అభిరుచితో తెచ్చే చిత్రాలు విజయం సాధిస్తాయి. కన్నడలో పెద్ద హిట్టయిన చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు“ అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ- “రెండు బ్లాక్ బస్టర్ టైటిల్స్ ని పెట్టుకుని వస్తున్న చిత్రమిది. అవెంజర్స్ లాంటి సునామీ ముందు రిలీజ్ చేయకుండా వాయిదా వేయడం మంచికే. మే 3న ఎక్కువ థియేటర్లలో రిలీజవుతోంది.. విజయం సాధించాలి..“ అన్నారు.
శోభా రాణి మాట్లాడుతూ – “మామిడాల శ్రీనివాస్ చాలా కాలంగా పరిశ్రమలో ఎంతో సన్నిహితులు. సినిమా విజయానికి టైటిల్ ముఖ్య ం . గీత గోవిందం .. ఛలో లాంటి బ్లాక్ బస్టర్ టైటిల్స్ ని కలిపి గీతా ఛలో అనే టైటిల్ పెట్టారు. అంత పెద్ద హిట్టవ్వాలి“ అన్నారు.
బాలాజీ నాగలింగం.. సహా పలువురు అతిధులు ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.