గూగ్లీ షార్ట్ ఫిల్మ్ రివ్యూ
గూగ్లీ అంటే…బౌలింగ్‌లో అదొక టైప్ బౌలింగ్. బాల్ వేసిన తర్వాత అది ఎప్పుడు ఎక్కడ ఎలా పడుతుందో ఎవరికీ తెలియదు. మనిషి స్వభావం,చాలా సార్లు మనకు ఎదురయ్యే పరిస్దితులు కూడా అలాంటివే. ఒక మనిషి మీద ఓ విధమైన ఎక్సపెక్టేషన్స్, మనిషి స్వభావం మీద ఓ రకమైన నమ్మకం పెట్టుకుంటాం. అయితే ఒక్కోసారి అవి రివర్స్ లో వచ్చి మనని పలకరిస్తాయి. వెక్కరిస్తాయి. అలాంటిదే ఈ కథ. కథేంటో చెప్పేసి, ఆ గుట్టు విప్పేసి మీకు గూగ్లీ విసరదలుచుకోలేదు.
ఇంతకీ ఎలా ఉందీ,చూడచ్చా అంటే సరదాగా నవ్వుకోవటానికి చేసిన ఈ ప్రయత్నం..చాలా వరకూ ఫలించిందనే చెప్పాలి. అయితే డైలాగులు ఎక్కువ పార్ట్ ఉండటంతో కొంచెం హెవీగా అనిపించింది. షార్ట్ ఫిల్మ్ ల్లో అయినా కాస్తంత విజువల్ కి ప్రయారిటీ ఇస్తే బాగుండును అనిపించింది. అలాగని ఎక్కడా నిరాశపరచదు. ముఖ్యంగా సునీల్ గా వేసినతను(షైనింగ్ ఫణి) ఎక్సప్రెషన్స్ అయితే కేక. డైలాగు చెప్పే తీరు కూడా బాగుంది. అతనికి కమిడయన్ గా మంచి భవిష్యత్తు(గట్టిగా ట్రై చేస్తే) ఉందనిపిస్తోంది.
మూడు పాత్రలతో అదీ స్త్రీ పాత్ర లేని నాటకంలా తీయటం, దాన్ని ఒప్పించటం దర్శకుడుకి పెద్ద టాస్కే. అయితే ఎక్కడా ఆ ఫీల్ కనపడనీయకుండా దర్శకుడు లాక్కెళ్లిపోయాడు. అయితే మరీ లెంగ్త్ కోసం అన్నట్లు కొన్ని షాట్స్ (బండి వేసుకుని రోడ్డు మీద వెళ్లి బ్రదర్ ని తీసుకురావటం) వంటివి కాస్త ఎక్కవ అనిపిస్తాయి.
ఇక ఇలాంటి జోక్స్ ..ఎంత తక్కువ లెంగ్త్ ఉంటే అంత టైట్ గా ఉండి ఫక్కున నవ్వేలా చేస్తాయి. లేకపోతే లాఫ్ ని లాగినట్లు ఉంటుంది. ఎందుకంటే మనం ముందే ఆ ఫన్ ని గెస్ చేసేస్తాం కాబట్టి. డైలాగు డ్రామానే కాబట్టి దీన్ని చూసి దర్శకుడి సామర్ధ్యం అంచనా వేయలేం (అందుకోసం ఈ ఫిల్మ్ తీసి ఉంటే). సరదాగా చిన్న ప్రయత్నం…బాగుంది…అద్బుతం కాదు.. టెక్నికల్ గా కూడా సౌండ్ గానే ఉంది. డైలాగులు కూడా ట్రెండీగా ఉన్నాయి. ప్రశాంత్ ఎర్రమెల్లి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ నీట్ గా ఉన్నాయి. దర్శకుడు కనక వెంకటేష్ ఉన్న కంటెంట్ ని చక్కగా,నీటుగా ప్రజెంట్ చేసారు. ఎక్కడా కామెడీ పేరు చెప్పి అతికి వెళ్లకుండా. ఫైనల్ గా ఈ షార్ట్ ఫిల్మ్ కు WTF అని పెడితే బాగుండేది అనిపించింది.
నటీనటులు : షైనింగ్ ఫణి, ప్రసాద్ బోలిశెట్టి, రామ్ మారెళ్ల
సంగీతం : యతీష్
సినిమాటోగ్రఫీ : విజయ్ కుమార్ ఎస్ వి కే
ఎడిటర్ : శశిధర్
డైరక్షన్ టీమ్ : అహం గస్తే, వెంకటేష్ దబ్బుగట్టు
నిర్మాణం :ప్రశాంత్ ఎర్రమెల్లి
కథ – మాటలు : ప్రసన్న కుమార్
దర్శకత్వం : కనక వెంకటేష్.బి.