గల్లీరౌడీ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గల్లీరౌడీ’. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల సక్సెస్‌లో కీలక పాత్రను పోషించిన స్టార్ రైటర్ కోన వెంకటన్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు.
కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో సీమశాస్త్రి, సీమటపాకాయ్, దేనికైనా రెఢీ, ఈడోరకం ఆడోరకం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు.
సెప్టెంబర్ 17న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోన రఘుపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ ‘‘ఈరోజుల్లో సినిమా చేయడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వర్క్ చేసి సినిమా చేస్తే మనం ఏదో కామెంట్ చేసి బయటకు వెళ్లిపోతాం. సినిమాలో అద్భుతమైన కామెడీ ట్రాక్ రాయడంలో వెంకట్‌ను మించినవాడు లేడని నేను అనుకుంటాను. తనో స్టార్ రైటర్. తన సర్టిఫికేట్ ఇచ్చిన ఈ సినిమా తప్పకుండా బాగానే ఉంటుందని నమ్ముతున్నాను. సత్యనారాయణగారిలోనే ప్యాషన్ అది రాజకీయమైన, సినిమా రంగమైనా.. ఆయన టాప్‌లోనే ఉన్నారు. ఆయనకు అభినందనలు. నాగేశ్వర్ రెడ్డిగారికి అభినందనలు. సందీప్‌కిషన్ చేసిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చూశాను. తను నేచురల్ స్టార్. తనని చూస్తే ధనుశ్‌ను చూసినట్లు స్పార్క్ కనిపించింది. తనకు ఈ సినిమా తప్పకుండా ఈ సినిమా పెద్ద మైల్‌స్టోన్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను. ట్రైలర్, పాటలు బావున్నాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
చిత్ర సమర్పకుడు, రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ ‘‘ఇక నుంచి సినిమాయే మాట్లాడుతుంది. సినిమా కథ రాసింది భాను, నందు, తీసింది నాగేశ్వర్ రెడ్డిగారు. కానీ పోస్టర్‌పై ఢీ, రెఢీ, దూకుడు సినిమా పేర్లు ఎందుకు పెట్టామంటే, ఆ సినిమాల స్టైల్లో ఇది కూడా ఉంటుందని చెప్పడానికి మాత్రమే. నేను పస్ట్ టైమ్ విష్ణుతో ఢీ, రామ్‌తో రెఢీ, మహేశ్‌తో దూకుడు, ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమాలు చేశాను. అన్నీ బ్లాక్‌బస్టర్ చిత్రాలే. అలాగే ఫస్ట్ టైమ్ సందీప్‌తో చేసిన గల్లీరౌడీ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాను. సినిమాకు అన్ని చక్కగా కుదిరాయి. అందరూ మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కుదిరాయి. కామన్ మేన్ హీరో సందీప్ కిషన్. సినిమా సినిమాకు తన గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ఇది తన గ్రాప్‌ను మరింత పెంచుతుంది. ఇంకా తను గొప్ప స్థాయికి చేరుకుంటాడు. చిరంజీవిగారు అంత టైమ్ తీసుకుని మా ట్రైలర్‌ను విడుదల చేసి మా టీమ్‌ను ఎంకరేజ్ చేసిందనుకు ఆయనకు పాదాభివందనాలు’’ అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘‘‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ తర్వాత ఎక్కువ ఆలోచించకుండా సరదాగా నవ్వుకునే ఓ సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో వివాహ భోజనంబు సినిమాను రూపొందించిన భాను, సాయి గల్లీ రౌడీ కథతో నా దగ్గరకు వచ్చారు. వాళ్లు మరో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆ కథనను నాగేశ్వర్ రెడ్డిగారి దగ్గరకు పంపాను. ఆయనకు నచ్చింది. సినిమా చేద్దామని అన్నారు. అక్కడ నుంచి కోనగారి దగ్గరకు కథ వెళ్లింది. కోన వెంకట్‌గారు, ఎం.వి.సత్యనారాయణగారితో మా ప్రయాణం ప్రారంభమైంది. జీవీగారు నిర్మాతగా ముందుండి మమ్మల్ని నడిపించారు. ఈ సినిమాను, క్యారెక్టర్స్‌ను చాలా సరదాగా పూర్తి చేశాం. రాజేంద్రప్రసాద్‌గారు, బాబీసింహగారు, కల్పలతగారు, నిజాయతీగా అందర్నీ నవ్వించడానికి చేసిన ప్రయత్నమే గల్లీరౌడీ. ఓ క్రైమ్ కామెడీని ఫ్యామిలీ జోనర్‌లో తీస్తే ఎలా ఉంటుందో అనేదే సినిమా. హీరోయిన్ నేహాశెట్టి రోల్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సాయికార్తీక్‌తో నేను చేసిన మూడో సినిమా. సినిమాటోగ్రాఫర్ సిద్ధార్థ్ ఇటు కోనగారిని, అటు నాగేశ్వర్‌రెడ్డిగారిని చక్కగా బ్యాలెన్స్ చేశాడు. సినిమా ప్రపంచం మారుతుంది. దాన్ని మనo అడాప్ట్ చేసుకోవాలి. మీరు థియేటర్స్‌కు వెళ్లి టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసినప్పుడు, అందులో రూపాయో, పైసానో మా మెతుకుపై మీ పేరు ఉంటుంది. మీరు సినిమా చూడటమే నాకు ముఖ్యం. థియేటర్‌లో సినిమా చూసే అవకాశం ఉంటే తప్పకుండా అలాగే చేస్తాం. మంచి సినిమా తీశాం. అందరూ హ్యాపీగా నవ్వుకుంటారని నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులు మా సినిమాను చూసి బావుందని అప్రిషియేట్ చేస్తే చాలు. అదే మా సక్సెస్. ట్రైలర్ చూసిన చిరంజీవిగారు సందీప్ నీకు ఇలాంటి క్యారెక్టర్స్ చాలా బావుంటాయి. ఇలాంటి పాత్రలు బాగా నప్పుతాయని అన్నారు. అది ఆయన గొప్పతనం. దేశంలో మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే పరేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు. అది ఒకరికొకరు ఇచ్చే సాయం. మీరందరూ మాకు ఇచ్చే నమ్మకం. థియేటర్స్‌లో సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘గల్లీ రౌడీ చాలా పెద్ద హిట్ అవుతుందని నిర్మాతగా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నేను, నా మిత్రుడు కోన వెంకట్‌గారు కలిసి గీతాంజలి నుంచి జర్నీ స్టార్ట్ చేశాం. పాలిటిక్స్‌లో ఉండటం వల్ల కొన్ని రోజుల పాటు సినిమా నిర్మాణానికి దూరం అయ్యాను. ఆ సమయంలో ఓ రోజు కోన వెంకట్‌గారు ఫోన్ చేసి, మంచి కథ ఉంది. వినమని కథను వినిపించారు. కథ వినే సమయంలో బాగా ఎంజాయ్ చేశాను. నా స్నేహితుడు జి.వికి కథను వినిపించాను. ఆయనకు కూడా బాగా నచ్చింది. సినిమా చేద్దామని కోన వెంకట్‌గారితో చెప్పాం. ఎక్కువ టైమ్ తీసుకోకుండానే సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. అరవై రోజుల్లో సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. ఇంత మంచి సినిమాను అందించిన కోన వెంకట్‌గారికి, డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డిగారికి థాంక్స్. సందీప్ కిషన్ చాలా మంచి హీరో. హీరోయిన్ నేహ, రాజేంద్ర ప్రసాద్ సహా టీమ్ అందరం ఓ ఫ్యామిలీలా కలిసి పోయి చేసిన సినిమా ఇది. ఈ సినిమా మా ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కాకపోతే, నెక్ట్స్ సినిమా చేయను అని చెప్పగలను అనేంత కాన్ఫిడెన్స్‌ను ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు.
చిత్ర దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘సినిమా స్టార్ట్ కావడానికి ముఖ్య కారణమైన సందీప్‌కు థాంక్స్. అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కోనవెంకట్‌గారికి, మాకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్న నిర్మాతలు ఎం.వి.విగారు, జీవీగారికి థాంక్స్. సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చక్కగా సపోర్ట్ చేశారు. నా కెరీర్‌లోనే ఇదొక బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అందరికీ పేరు పేరునా థాంక్స్’’ అన్నారు.
నటకిరిటీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘ ప్యాండమిక్ పరిస్థితుల్లో అందరూ దాదాపు ఆరు నెలల పాటు ఇళ్లకే పరిమితమయ్యారు. జీవితంలో ఎలా జాగ్రత్తగా ఉండాలనే విషయాలను కూడా కోవిడ్ ద్వారా నేర్చుకున్నాం. కరోనా వల్ల ప్రపంచం దెబ్బ తింది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ కూడా దెబ్బతింది. ఇలాంటి కోవిడ్ సిట్యువేషన్స్‌లో గల్లీ రౌడీ సినిమాను ఎందుకు చూడాలనే ప్రశ్న వస్తుంది. ఈ కథను సందీప్ కిషనే తెచ్చుకున్నాడు. అదొక మంచి విషయం. అలాగే కుటుంబం అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. అన్ని ఎలిమెంట్స్ ఉండే సినిమా. కోనవెంకట్, నాగేశ్వర్‌రెడ్డి, ఎం.వి.వి.సత్యనారాయణ ఎంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని చూశారో, అంతే కంఫర్ట్‌లో ఉంచారు. సందీప్ కిషన్ బిడ్డలా కంఫర్ట్‌ను ఇచ్చాడు. గల్లీ రౌడీ సినిమాను డిసప్పాయింట్ చేయదని యాక్టర్‌గా గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు.
విష్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘కోన వెంకట్‌గారు హిట్ మిషన్. సందీప్ కిషన్‌ను ఇన్‌స్పైర్ అయ్యాను. తను నాకు చాలా మంచి స్నేహితుడు. గల్లీ రౌడీ.. ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే ప్రామిసింగ్‌గా ఉంది. ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. థియేటర్స్‌కు ఆడియెన్స్ వస్తే..రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకుంటారు. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘గల్లీ రౌడీ సినిమా చూశాను. పర్‌ఫెక్ట్ ఎంట్‌టైనర్. సినిమా కొచ్చే ప్రేక్షకులు రెండున్నర గంటలు వారి బాధలను మరచిపోయి ఎంజాయ్ చేస్తారు. సందీప్ కిషన్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఈ సినిమా తనకు పెద్ద హిట్ అవుతుంది. నేహాశెట్టి హీరోయిన్‌గా తనేంటో ప్రూవ్ చేసుకుంటుంది. నాగేశ్వరరెడ్డిగారితో వర్క్ చేయాలని ఎదురుచూస్తున్నాను. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ ‘‘సాంగ్స్ చాలా బావున్నాయి. దర్శకుడిగా నాకు కోనవెంకట్‌గారితో మంచి అనుబంధం ఉంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్ సినిమాలు వచ్చాయి. ఇక గల్లీరౌడీ సినిమా ట్రైలర్ చూసినప్పుడు.. నేను, కోనవెంకట్‌గారు కలిసి చేసిన లౌక్యం సినిమాలో ఎనర్జీ కనిపించింది. కామెడీ ఫీల్ బాగా వర్కవుట్ అయినట్లు తెలుస్తుంది. ఇక సందీప్ గురించి చెప్పాలంటే.. అందరితో కలుపుగోలుగా ఉండే హీరో. ఇక డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డిగారు కామెడీ సినిమాలు తీయడంలో దిట్ట. కోనగారు వర్క్ చేసిన రెఢీ, దేనికైనా రెఢీ వంటి సినిమాల తరహాలో ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సమయంలో ఇలాంటి సినిమా అవసరం. మనకున్న ఇబ్బందులను మరచిపోయే నవ్వుకునే సినిమా రావడం మంచిది. నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణగారు మంచి టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్. కోనగారు, సత్యనారాయణగారి కాంబినేషన్‌లో ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఎంటైర్‌టీమ్‌కు అభినందనలు’’ అన్నారు.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం వర్క్ చేసిన అందరూ నాకెంతో పరిచయం. ముఖ్యంగా కోన వెంకట్‌గారితో మంచి అనుబంధం ఉంది. చిన్నికృష్ణగారి తర్వాత నాకు గురువులాంటి వ్యక్తి కోనగారు. ఇదొక కంప్లీట్ కామెడీ సినిమా. అన్ని అడ్డంకులను దాటి సినిమాను పూర్తి చేశారు. ఓటీటీకి మంచి డీల్ వచ్చిన దాన్ని కూడా వద్దనుకుని సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణగారు నిర్మాతగా మంచి సినిమాలను చేస్తూ వస్తున్నారు. ఇక హీరో సందీప్ విభిన్నమైన సినిమాలతో పాటు నిర్మాతలకు డబ్బులు వచ్చే సినిమాలను చేస్తూ వస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ సాయికార్తీక్, చౌరస్తారామ్‌లకు అభినందనలు. సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్ వర్క్ ఫెంటాస్టిక్‌గా ఉంది. రాజేంద్రప్రసాద్‌గారికి నేను పెద్ద అభిమానిని. త్వరలోనే నేను చేయబోయే సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారి కోసం ఓ పాత్రను రాసుకున్నాను. ఇవివిగారు తర్వాత నాగేశ్వర్‌రెడ్డిగారి సినిమాలను ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాను. హీరోయిన్ నేహాశెట్టి సహా టీమ్‌కు ఆల్‌ది బెస్ట్’’ అన్నారు.
డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ ‘‘ కోనవెంకట్గారితో మంచి అనుబంధం ఉంది. ‘గల్లీ రౌడీ’ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘‘నాగేశ్వర్ రెడ్డిగారు సాగర్‌గారి దగ్గర మా కంటే ముందుగా కోడైరెక్టర్‌గా వర్క్ చేశారు. అప్పటి నుంచి ఆయనతో మంచి అనుబంధం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఎన్నో విజయాలను సాధించిన ఎం.వి.వి.సత్యనారాయణగారు సినిమా రంగంపై ప్యాషన్‌తో నిర్మాతగా మారారు. సందీప్ ఛోటాకు మేనల్లుడు అంటే నాకు మేనల్లుడే. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే సందీప్ యాక్టింగ్ బాగా నచ్చింది. తనకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. కోన వెంకట్ గురించి చెప్పాలంటే, తను చాలా బిజీ. ఎప్పుడూ అప్ డేట్‌లో ఉంటాడు. ఈ సినిమా పెద్ద హిట్టై గీతాంజలి, నిన్నుకోరి చిత్రాలకు ఎంత మంచి పేరు వచ్చిందో అంతే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీలో నాకు దొరికిన అన్నయ్య కోనవెంకట్‌గారు. అలాగే ఎం.వి.వి.సత్యనారాయణగారితో మంచి అనుబంధం ఉంది. నాగేశ్వర్ రెడ్డిగారితో నేను పని చేసిన నాలుగో సినిమా ఇది. సందీప్‌కిషన్‌గారితోనూ నాలుగో సినిమా ఇది. సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయాలని వెయిట్ చేసి విడుదల చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాను అందరూ థియేటర్స్‌లోనే చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ ‘‘నేను దర్శకుడిగా మారడానికి ప్రధాన కారణం కోన వెంకట్‌గారు. ఆయన లేకపోతే ఈ స్టేజ్‌కు రావడానికి ఇంకెనేళ్లు పట్టేదో తెలియడం లేదు. నాలాంటి వారినెందరినో డైరెక్టర్స్‌ను చేశారు, రైటర్స్‌ను చేశారు, స్క్రీన్‌ప్లే రైటర్స్‌ను చేశారు. కోనగారితో పరిచయం అయిన్పపటి నుంచి సత్యనారాయణగారితో ట్రావెల్ అవుతున్నాను. అప్పుడు ఎంత ఆప్యాయంగా ఉన్నారో మినిష్టర్ అయిన తర్వాత కూడా అంతే అప్యాయంగా ఉంటున్నారు. ట్రైలర్ చూస్తే సందీప్‌లో కాన్ఫిడెన్స్ తెలుస్తుంది. సాయికార్తీక్ సాలిడ్ మ్యూజిక్‌ను అందించాడు.అసిస్టెంట్స్, రైటర్స్ నుంచి మంచి వర్క్ తెచ్చుకోగల డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డిగారు. ఆయనకు ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలి. గల్లీ రౌడీ సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్ర యూనిట్ సభ్యులు సినిమా చాలా పెద్ద హిట్ కావాలని అభినందించారు.