చెక్ మూవీ రివ్యూ
ఛస్: నితిన్ ‘చెక్’ రివ్యూ
Rating:2.5/5
భీష్మ వంటి కమర్షియల్ ఎంటర్టైనర్ తో హిట్ వచ్చాక ఏ హీరో అయినా అంతకు మించిన కమర్షియల్ కథతో ముందుకు వెళ్ళాలనుకుంటారు. కానీ నితిన్ …తన కెరీర్ లో ఎన్నో కమర్షియల్ సినిమాలు చేసాడు. ఎత్తుపల్లాలు చూసాడు. దాంతో తనకు నచ్చిన కథ అది కమర్షియల్ కాకపోయినా ఫర్వాలేదు అన్న రీతిలో ఈ సినిమాని వాంటెడ్‌గా ఓకే చేసినట్లు అనిపిస్తోంది. ఖచ్చితంగా సినిమా చూసిన వారు.. నితిన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు ఈ సినిమా డిఫరెంట్ అని చెబుతారు. అయితే ఆ డిఫరెంట్ అనేది ఎంతవరకూ భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అవుతుంది. యేలేటి వంటి తెలివైన దర్శకుడు నితిన్ ఎలా ప్రజెంట్ చేసారు. సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందా… ఈ చిత్రం కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీలైన్
హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 40 మంది చనిపోతారు. ఆ తర్వాత పోలీస్ ఇన్విస్టిగేషన్ లో నలుగురు టెర్రరిస్టులకు, ఆ టెర్రరిస్టులకు సహకరించినందుకు ఆదిత్య(నితిన్)కి కూడా ఉరిశిక్ష పడుతుంది. కానీ ఆదిత్య నిర్దోషి ..ఆ విషయం చెప్పినా ఎవరూ నమ్మరు. చివరకు అతని తరుపున వాదించటానికి కూడా లాయిర్స్ ఎవరూ ముందుకు రారు. ఆ క్రమంలో తాను ఆ కేస్ ని డీల్ చేస్తానని మానస(రకుల్ ప్రీత్ సింగ్) ముందుకు వస్తుంది. ఈలోగా జైల్లో అప్పటికే శిక్ష అనుభవిస్తూ ఉన్న చెస్ పిచ్చోడు శ్రీమన్నారాయణ(సాయి చంద్) కలుస్తాడు. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా చెస్ వైపు ఆకర్షితుడు అవుతాడు ఆదిత్య. కథ మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలో అసలు ఆదిత్య ఎలా టెర్రరిస్ట్ కేసులో ఇరుక్కున్నాడు. నిర్దోషి అయ్యి జైలు నుంచి బయిటకు వచ్చాడా..దానికి చెస్ కు లింకేంటి..ఈ కథలో యాత్ర (ప్రియాంక వారియర్) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ..
ఈ సినిమా చాలా బద్దకంగా,బరువుగా అనిపిస్తుంది అందుకు కారణం దాదాపు సినిమాలో ఎనభై శాతం జైలులో కథ నడవటమే. దాంతో కథ ఎక్కడికి వెళ్లినట్లు అనిపించదు. అక్కడక్కడే తిరుగుతున్నట్లు ఉంటుంది. దానికి తోడు కథలోనూ పెద్దగా మలుపులు ఉండవు. టెర్రరిస్ట్ కేసులో ఇరుక్కోవటం చూపారు కానీ దాన్నుంచి బయిటపడి అసలు తనను ఇరికించిన వాళ్లను పట్టుకునే ప్రాసెస్ ఏమీ ఉండదు. అలాగే జైలు నుంచి బయిటపడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంగా చెస్ ని ఎంచుకోవటం బాగుంది కానీ..అది సినిమాటెక్ లిబర్టీగా అనిపిస్తుంది. దానికి తోడు కథలో కీలకంగా నిలిచే ప్రియా ప్రకాశ్ వారియర్ పాత్ర ట్విస్ట్ వెనక ఉన్న అసలు కథని రివీల్ చేయలేదు . అసలు టెర్రరిస్ట్ లు నితిన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? అనే విషయాలపై క్లారిటీ లేదు. ఇక జైలులో హీరోను చెస్ ఛాంపియన్‌గా ఎదిగే క్రమం వింటానికి బాగానే ఉంటుంది కానీ విజువల్ గా పెద్దగా ఏమీ ఉండక బోర్ కొట్టేసింది. కథలో ప్రొసీడింగ్స్ ఎక్కువ అయ్యాయి. హీరో పాత్ర చాలా ప్యాసివ్ గా రన్ అవుతుంది. దాంతో సెకండాఫ్ పూర్తిగా స్లోగా నడుస్తుంది. క్లైమాక్స్ ఉన్నంతలో కాస్తంత ఇంట్రస్టింగ్.
టెక్నికల్ గా …
యేలేటి వంటి విషయం ఉన్న దర్శకుడు సినిమాకు కెప్టెన్ అయ్యినప్పుడు అన్ని డిపార్టమెంట్స్ తమ అవుట్ ఫుట్ ని బాగా ఇస్తాయి. ఆ క్రమంలో బ్యాక్ గ్రౌండ్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. డైలాగులు బాగా రాసారు. ఎడిటింగ్ డిపార్టమెంట్ కాస్తం సెకండాఫ్ పై దృష్టి పెడితే ఓ అరగంట టైమ్ ప్రేక్షకుడుకి కలిసొచ్చేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
చూడచ్చా
చెస్ తెలిసి ఉంటే కొద్దిగా ఎంజాయ్ చేయచ్చు.మిగతావాళ్లకు ఛస్ అనిపిస్తుంది.
తెర వెనక,ముందు
బ్యానర్: భవ్య క్రియేషన్స్
నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణ మురళీ, మురళీ శర్మ తదితరులు మ్యూజిక్: కల్యాణి మాలిక్
సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీవాస్తవ్
ఎడిటింగ్: సనల్ అనిరుధన్
రన్ టైమ్: 2 గం.20 ని
నిర్మాత: వీ ఆనంద ప్రసాద్
రచన, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి
రిలీజ్: 2021-06-26