Reading Time: 1 min

జ‌వాన్ మూవీ సాంగ్ టీజర్ విడుదల

జ‌వాన్ AskSRK సెష‌న్‌లో నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా సాంగ్ టీజర్ విడుదల చేసిన కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్

కింగ్ ఆఫ్ బాలీవుడ్‌ షారూఖ్ ఖాన్ తాజా చిత్రం జవాన్. సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిఅభిమానులు, ఆడియెన్స్‌కు బాద్‌షా ఎన్నో స‌ర్‌ప్రైజ్‌ల‌ను అందించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో స‌ర్‌ప్రైజ్‌తో అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు.ఇప్ప‌టికే జ‌వాన్ ప్రివ్యూ సహా సాంగ్స్‌తో ఆక‌ట్టుకున్న జ‌వాన్ చిత్రం నుంచి నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా అనే సాంగ్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆ పాట‌కు సంబంధించిన సాంగ్‌ టీజ‌ర్‌ను త‌న సోష‌ల్ మీడియాలో షారూఖ్ పోస్ట్ చేశారు. రీసెంట్‌గా AskSRK సెష‌న్‌లో పాల్గొన్న కింగ్ ఖాన్ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఈ విష‌యం తెగ వైర‌ల్ అవుతోంది.

ఇప్ప‌టికే జ‌వాన్ సినిమా నుంచి దుమ్మే దులిపేలా అనే పాట‌తో పాటు ఛ‌లోనా అనే రొమాంటిక్ సాంగ్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు పాట‌ల‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాట‌గా నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా ను రిలీజ్ చేస్తున్నారు. దీంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరుగుతున్నాయి. AskSRK సెష‌న్‌లో నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా టీజ‌ర్‌ను విడుదల చేస్తూనే ఇప్పుడు అంద‌రూ ట్రైల‌ర్‌ను అంద‌రూ కోరుకుంటున్నారు. దాని కంటే ముందుగా పాట‌ను విడుద‌ల చేయాల‌ని టీ సిరీస్‌, అనిరుద్‌, డైరెక్ట‌ర్ అట్లీ భావించారు. అందుకునే ఆ సాంగ్‌కి సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. ఆంటోని రూబెన్ ట్రైల‌ర్ మీద వ‌ర్క్ చేస్తున్నారు. ఇక పాట విష‌యానికి వ‌స్తే నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్య‌. బై ల‌వ్ యు ఆల్ అని షారూఖ్ పేర్కొన్నారు.

సాంగ్ టీజర్‌ను గ‌మ‌నిస్తే సాంగ్ ఎంత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తోంది. రాబోతున్న నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్య సాంగ్‌తో ఆడియెన్స్‌కి ఓ మ్యూజిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్ క‌లుగుతుందని మేక‌ర్స్ భావిస్తున్నారు.

షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న జవాన్ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.