జి.కె.మిరాకిల్స్ ప్రొడక్షన్ no 1 ప్రారంభం
రామానాయుడు స్టూడియో లో ప్రారంభమైన జి.కె.మిరాకిల్స్ ప్రొడక్షన్ no 1
సంగీత ప్రధానంగా సాగే సస్సెన్స్ థ్రిల్లర్ ప్రారంభం
సందీప్, శివ, విశ్వాస్, ఠాగూర్, సాన్య, జోయా హీరోహీరోయిన్లుగా గంటాడి కృష్ణ దర్శకత్వంలో ఓ నూతన చిత్రం రూపొందుతుంది. గడ్డం రవి సమర్పణలో జి.కె.మిరాకిల్స్ పతాకంపై గంటాడి కృష్ణ, సురేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి క్లాప్ నివ్వగా, టీఆర్ ఎస్ నాయకులు కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.
ఈ సందర్భంగా వారు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
చిత్ర దర్శకుడు గంటాడి కృష్ణ మాట్లాడుతూ, మంచి కథ, కథనాలతో, సంగీత ప్రధానంగా సాగే సస్సెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. సినిమాలో అన్ని రకాల అంశాలుంటాయి. గతంలో వచ్చిన విజయవంతమైన సినిమా 6టీన్స్ ని పోలి, అదే జోనర్లో ఈ చిత్రం ఉంటుంది. అది ఎంతటి విజయాన్ని సాధించిందో, ఆ సినిమాని ఎంతగా ఆదరించారో, ఈ సినిమాని కూడా అలానే ఆదరించాలని కోరుతున్నా. సినిమాలో ఆరు పాటలుంటాయి. అవి కథలో భాగంగా వచ్చి ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. ఇందులో నటీనటులంతా కొత్తవారు నటిస్తున్నారు. నా తోటి నిర్మాత సురేష్ రెడ్డి, రవి, మహేష్, రత్నాకర్, ఇంకా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని అన్నారు.
నిర్మాత సురేష్ రెడ్డి చెబుతూ, దర్శకుడు ఓ కొత్త కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మంచి కథతో వస్తున్నాం. ఆదరించి సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుతున్నా అని చెప్పారు.
హీరో సందీప్ మాట్లాడుతూ, ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. అందరం ఇష్టపడి సినిమా చేస్తున్నాం. కచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకం ఉంది అని అన్నారు.
విశ్వాస్ చెబుతూ, డాన్ పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర అందరిని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా అని అన్నారు.
కథానాయికలు సాన్య, జోయా చెబుతూ, మాకిది తొలి చిత్రం. తెలుగు సినిమాతో కథానాయికలుగా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్లో పాల్గొనేందుకు ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిత్ర బృందం పాల్గొంది.
అప్పారావు, కాదంబరి కిరణ్, రమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ః శివ సర్వాని, కెమెరాః జగదీష్ బామ్మిశెట్టి, ఫైట్స్ః రియల్ సతీష్, డైలాగ్స్ః జి.కె. అండ్ నవీన్, కో ప్రొడ్యూసర్స్ః రాధాకృష్ణ, మహేష్ కల్లె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ః రాహుల్, పరిటాల. పీఆర్ ఓః సతీష్, కథ, సంగీతం, దర్శకత్వంః గంటాడి కృష్ణ. నిర్మాతలుః గంటాడి కృష్ణ, సురేష్ రెడ్డి