Reading Time: 2 mins

జ‌ర్న‌లిస్ట్ చిత్రం పాత్రికేయుల స‌మావేశం

నిజాల‌ను నిర్భ‌యంగా రాసే `జ‌ర్న‌లిస్ట్`ల చిత్రం – ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌
 
నంది అవార్డ్ గెలుచుకున్న  `గంగ‌పుత్రులు` చిత్రం  ఫేం రాంకీ హీరోగా న‌టిస్తూ నిర్మించిన  చిత్రం `జ‌ర్న‌లిస్ట్`. జి.ఆర్ .కె ఫిలింస్ ప‌తాకంపై  రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌. కె.మ‌హేష్ దర్శ‌కులు. త‌షు కౌశిక్ హ‌రోయిన్ గా న‌టించ‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఎన్.శంక‌ర్, సీనియ‌ర్ న‌టుడు సురేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం ఈ నెల 5న విడుద‌లై పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌ర్నలిస్ట్ ల కోసం సినిమాను ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు.  ఈ చిత్రంలో  కీల‌క పాత్ర‌లో న‌టించిన ఎన్‌.శంక‌ర్ మరియు చిత్ర యూనిట్ తో పాటు జ‌ర్నలిస్ట్ చిత్రాన్ని వీక్షించారు. 
 
అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ…“ ఈ నెల 5న సినిమా విడుద‌లై పాజిటివ్ టాక్ తో ర‌న్ అవుతోంది.  ఈ సినిమాలో నేను కూడా ఒక కీల‌క పాత్ర‌లో న‌టించాను.  ఈ రోజు జ‌ర్న‌లిస్ట్ మిత్రుల‌తో క‌లిసి `జ‌ర్నలిస్ట్` సినిమా చూడ‌టం చాలా ఆనందంగా ఉంది. చూసిన వారంద‌రూ ఆలోచింప‌జేసే చిత్రాన్ని చేశారు అంటున్నారు. ఒక సిన్సియ‌ర్ జ‌ర్నలిస్ట్ స్టోరీని ఈ చిత్రంలో చూపించే ప్ర‌య‌త్నం జ‌రిగింది. జనం కోస‌మే క‌లం అంటూ జ‌ర్న‌లిస్ట్ ల బాధ్య‌త  ఏంటో  ఈ చిత్రం ద్వారా చూపించాం.  ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమా చూసి ఇంకా పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు. 
 
హీరో రాంకీ మాట్లాడుతూ…“మ‌హేష్ ఈ క‌థ  చెప్పాక హీరోని స‌పోర్ట్ చేసే పాత్ర‌లో ఎవ‌రైతే బావుంటుంద‌ని చాలా ఆలోచించాం. మొద‌ట కొంత మంది న‌టుల‌ను అనుకున్నాం. కానీ దీనికి రియ‌లిస్టిక్ గా ఉంటూనే  నిజ జీవితంలో కూడా అంత బాధ్య‌త‌తో ఉంటే వారైతే బావుంటుంద‌ని |భావించాం. ఎందుకంటే ఆయ‌న ప్ర‌త్యేక తెలంగాణ కోసం త‌న వంతు బాథ్య‌త‌గా సినిమాలు తీస్తూ ప్ర‌త్య‌క్ష ఉద్య‌మాల్లో కూడా పాల్గొని త‌న గొంతుక‌ వినిపించారు. కాబ‌ట్టి శంక‌ర్ గారిని తీసుకుందామ‌ని వెళ్లి క‌లిశాం. మొద‌ట చేయ‌న‌న్నారు. కానీ కంటెంట్ విని న‌చ్చాక ఎటువంటి రెమ్యూనిరేషన్ తీసుకోకుండా నాకు ఫ్రీగా సినిమా చేసి పెట్టారు. అనుక్ష‌ణం న‌న్ను ముందుండి న‌డిపించారు. ఈ రోజు మా సినిమాకు ఇంత మంచి పేరు వ‌స్తోందంటే అందులో శంక‌ర్ గారి పాత్ర కూడా ప్ర‌ధాన కార‌ణం“ అన్నారు.
 
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో  స‌మ‌ర్ప‌కులు రాజ్  కుమార్ పాల్గొని సినిమాకు వ‌స్తోన్న రెస్పాన్స్ ప‌ట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. 
   
ఎన్.శంక‌ర్, చ‌ల‌ప‌తిరావు, సురేష్ మైసూర్, గిరి త‌దిత‌రులు న‌టించిన‌ ఈ చిత్రానికి సంగీతంః ర‌ఘుకుంచె, డా.జోశ్య‌భ‌ట్ల‌, సినిమాటోగ్ర‌ఫీః ముజీర్ మాలిక్‌; ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వ‌రావు, పీఆర్ ఓః ర‌మేష్ చందు (బాక్సాఫీస్‌) ద‌ర్శ‌క‌త్వంః కె.మ‌హేష్‌;  నిర్మాతః జి.రామ‌కృష్ణ‌.