టాప్ గేర్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్
ఈ టాప్ గేర్ సినిమాతో ఆది కేరీర్ బ్రేకులు లేకుండా సాగిపోవాలి టాప్ గేర్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్ సినీ అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా జరిగిన టాప్ గేర్ ప్రి రిలీజ్ వేడుక డిసెంబర్ 30 న గ్రాండ్ రిలీజ్
యంగ్ అండ్ లవ్లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు టాప్ గేర్ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, సాయి కుమార్, బెక్కం వేణుగోపాల్, యన్ శంకర్, నిర్మాతలు దామోదర ప్రసాద్, అనిల్ సుంకర, రాధా మోహన్, నటుడు డి. యస్. రావు, డైరెక్టర్ శేఖర్ సూరి, సత్తి బాబు, నారాయణ్ గౌడ్, హరీష్, సుదర్శన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిదిలుగా పాల్గొన్నారు. హీరో సందీప్ కిషన్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు టాప్ గేర్ బిగ్ టికెట్ ను లాంచ్ చేశారు
అనంతరం డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ మా నాన్న తో మొదలైన మా జర్నీ ఇప్పుడు ఆది వరకు వచ్చింది. ఆదిని ఒక క్రికెటర్ అవ్వాలని అనుకొన్నాము. కానీ మెగాస్టార్ అన్నయ్య సాంగ్ తో ఇండస్ట్రీ కు వచ్చాడు. మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అందరూ ఈ టాప్ గేర్ సినిమా ట్రైలర్, టీజర్ బాగుందని మెచ్చుకుంటున్నారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మా ఆది కి బిగ్ బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ కొత్త సంవత్సరంలో వస్తున్న ఈ సినిమా నిర్మాత శ్రీధర్ రెడ్డి గారి కి నిజంగా టాప్ గేర్ అవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్ హర్ష మంచి మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల వెన్నెల సాంగ్ చాలా బాగుంది. ఆదికి శశికి, హర్ష, శ్రీధర్ రెడ్డి లకు అందరికీ ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ శశి నాకు ఏడు సంవత్సరాలనుండి మంచి ఫ్రెండ్.తను ఈ సినిమాకు దర్శకత్వం వహించడం చాలా హ్యాపీ గా ఉంది. ప్రస్థానం సినిమాతో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ సినిమాకు నేను కొత్త అయినా సాయి కుమార్ గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆది నాకు బెస్ట్ ఫ్రెండ్. ఈ సినిమాలో తను చాలా బాగా నటించాడు.తనకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వడమే కాకుండా ఈ టాప్ గేర్ సినిమాతో ఆది కేరీర్ బ్రేక్ లేకుండా సాగిపోవాలి. అలాగే రాబోయే 2023 లో ఆది తో నేను ఒక సినిమా తియ్యడానికి ప్లానింగ్ చేస్తున్నాను. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ టాప్ గేర్ సినిమా నిర్మాత శ్రీధర్ రెడ్డి గారికి, శశికి టెక్నిషియన్స్ అందరికీ ఈ సినిమా పెద్ద విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దర్శకుడు శశి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. హీరో, హీరోయిన్స్ ఆది, రియా లిద్దరూ చాలా బాగా నటించారు.ఎన్నో హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన సాయి శ్రీరామ్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ఈ సినిమాకు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం హైలెట్ అవ్వనుంది. ఈ సినిమాకు పని చేసిన వారందరూ తమ సినిమా అనుకొని ఓన్ చేసుకొని ఈ సినిమాకు వర్క్ చేయడం వలన ఈ సినిమా చాలా బాగా వచ్చింది.ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న టాప్ గేర్ సినిమా ఆది ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని అన్నారు.
హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ శ్రీధర్ గారు చాలా పాజిటివిటి ఉన్న వ్యక్తి. సినిమాను ఇంకా బాగా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకునే వ్వక్తి. తను ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తియ్యాలి. శశి గారు చాలా డెడికేషన్ ఉన్న వ్వక్తి. తను ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేశారు. సాయి శ్రీరామ్ గారి ఫ్రెమింగ్ చాలా బాగుంటుంది. తను నన్ను, రియా ను చాలా బాగా చూపించారు హర్ష గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సిధ్ శ్రీరామ్ పాడిన వెన్నెల వెన్నెల పాట పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. దీంతో సినిమా మీద ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. టెక్నిషియన్స్ అందరు ఫుల్ సపోర్ట్ చేశారు. అందుకే సినిమా బాగా వచ్చింది ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా టాప్ గేర్ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు శశికాంత్ మాట్లాడుతూ థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్నీ ఏమోషన్స్ ఉన్న ఇలాంటి మంచి కథ ఉన్న సినిమాకు ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి గారు లభించడమే కాకుండా ఈ సినిమాకు నన్ను సెలెక్ట్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి శ్రీ రామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. హర్ష గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.టెక్నిషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అందుకే సినిమా చాలా బాగా వచ్చింది.ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా టాప్ గేర్ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ రియా మాట్లాడుతూ ఇలాంటి మంచి సినిమాలో బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. హర్షవర్ధన్ గారు మంచి బి.జి. యం ఇచ్చారు. థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్నీ ఏమోషన్స్ ఉన్న ఈ సినిమా ఫుల్ టాప్ గేర్ లో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వారందరూ ట్రాన్స్ లో ఉండేలా ఈ సినిమా చాలా బాగుంటుంది . ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ ఇచ్చే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ సాయి కుమార్ గారి నాన్న దగ్గర నుంచి ఇండస్ట్రీకి వారందించిన సేవలు, కృషి చాలా గొప్పవి. ఆ బ్లెస్సింగ్స్ ఇప్పుడు ఆదికి ఉపయోగ పడతున్నాయని నమ్ముతాను. దానికి తగ్గట్టే ఆది సినిమా తర్వాత సినిమా చేస్తూ ఇండస్ట్రీ లో తనేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు నేను ఒక పాట రాశాను. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ హర్ష గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా శిష్యుడు శశి మంచి కథను రాసుకుని సినిమా తీశాడు. ఈ సినిమాతో మొదలవుతున్న శశి జర్నీ నిరంతరం టాప్ గేర్ లో ముందుకు వెళ్లాలి. నిర్మాత శ్రీధర్ రెడ్డి గారికి ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
దర్శకుడు యన్ శంకర్ మాట్లాడుతూ నిర్మాత శ్రీధర్ రెడ్డి తన ఫస్ట్ గేర్ నాతో స్టార్ట్ చేశాడు. ఆ తరువాత సినిమాలు చేస్తూ కన్నడలో కూడా మంచి సినిమా నిర్మించాడు. ఇప్పుడు చేస్తున్న ఐదవ సినిమాకు ఉమేష్ గుప్తా సపోర్టుతో ధనలక్ష్మి ప్రొడక్షన్స్ లో మంచి కథను సెలెక్ట్ చేసుకొని టాప్ గేర్ లోకి ఎంటర్ అయ్యాడు. ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి గారు పాట రాయడం ఒక ఎత్తయితే ఈ పాటను సిద్ శ్రీ రాం పాడడంతో పాటకు నిండుతనం వచ్చింది. ప్రేక్షకులనుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది .హర్ష ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఈ సినిమాకు ఇలా అన్ని కలిసి రావడంతో సినిమా బాగా వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే ఇందులో ఆది ఫస్ట్ టైం చాలా కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఎనర్జిటిక్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. తనతో ఎంత పెద్ద యాక్షన్ సినిమా అయినా తీయొచ్చు అనే విధంగా చాలా బాగా నటించాడు. మంచి కథతో వస్తున్న ఈ టాప్ గేర్ సినిమా ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. అలాగే నిర్మాత శ్రీధర్ రెడ్డి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా చాలా సినిమాలు నిర్మించాలని కోరుతున్నాను అన్నారు.
నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ మధ్య చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇది శుభపరిణామమే కానీ వచ్చిన వారందరూ టెక్నిషియన్స్ కు రెస్పెక్ట్ ఇవ్వడమే కాకుండా తను చేసే పనిని గౌరవిస్తూ చాలా హార్డ్ వర్క్ చెయ్యాలి. అప్పుడే ఇండస్ట్రీ లో కొనసాగతారు. డిజిటల్ వచ్చిన తరువాత ఇండస్ట్రీ కి రావడం ఈజీ అయినా దాన్ని నిలుపు కోవడం చాలా కష్టం. ఆది ప్రతి సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. దర్శకుడు సినిమాను చాలా బాగా తీశాడు.టాప్ గేర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా నిర్మాత శ్రీధర్ రెడ్డికి బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ టాప్ గేర్ సినిమా ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. ఇందులో నటించిన వారందరూ చాలా బాగా నటించారు. అలాగే ఈ సినిమాకు అందరూ టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఆది నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమా ఆదికి కచ్చితంగా బిగ్ బ్రేక్ అవుతుంది. అలాగే మంచి కథతో వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ శశి తో ఇంతకు ముందు ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల సినిమా చేయలేక పోయాను. తను ఈ సినిమాను చాలా బాగా తీశాడు. ఆదితో ఇంతకు ముందు రెండు సినిమాలు చేశాను. తను చాలా డిసిప్లిన్, టాలెంట్ ఉన్న ఆర్టిస్టు. ఈ టాప్ గేర్ తర్వాత ఆది గేర్ మార్చకుండా ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. మ్యూజిక్ బాగుంది. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ నిర్మాత శ్రీధర్ రెడ్డి నాకు మంచి మిత్రుడు, ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి షెడ్యూల్ గురించి చెప్పేవాడు. తను సెలెక్ట్ చేసుకున్న కథ బాగుంది. అందుకే తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తనకు ఈ సినిమా ఫుల్ సక్సెస్ కావాలి. ఆది చాలా కష్టపడతాడు. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. తనకోసం ఒక సరి కొత్త కథను తయారు చేసుకున్నాను. సంక్రాంతి తర్వాత తనతో ఒక సినిమా చేస్తున్నాను. ఇప్పుడు వస్తున్న ఈ టాప్ గేర్ ఆదికి బిగ్ సక్సెస్ అవ్వాలి. డైరెక్టర్ శశికాంత్ చాలా ప్లానింగ్ ప్రకారంగా టోటల్ నైట్ షూట్ చేశాడు. సాయి శ్రీరామ్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. టెక్నికల్ గా సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టు ఈ సినిమా డిజైన్ చేయబడింది కాబట్టి నిర్మాత శ్రీధర్ రెడ్డి కి ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అన్నారు.
డైరెక్టర్ శేఖర్ సూరి మాట్లాడుతూ ట్రైలర్ చూస్తుంటే చాలా కాంటెంపరరీగా చాలా బాగుంది. నైట్ షూట్ చేయడం చాలా కష్టం. సాయి శ్రీ రామ్ గారి కెమెరా పని తనం అద్భుతంగా ఉంది. మ్యూజిక్ బాగుంది. దర్శకుడు ఈ సినిమాను చాలా బాగా తీశాడు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా టీమ్ అందరికీ సినిమా పెద్ద విజయం సాధించాలి అన్నారు.
డైరెక్టర్ సత్తిబాబు మాట్లాడుతూ ఆది ఇయర్ ఎండింగ్ కి గుడ్ బై చెపుతూ టాప్ గేర్ తో న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్తూ ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ కు దర్శక, నిర్మాతలకు ఈ సినిమా హిట్ తో టాప్ గేర్ లో ముందుకు వెళ్లాలని కోరుతూ ఈ నెల 30 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
నటుడు డి.ఎస్.రావు మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి లు నాకు మంచి మిత్రులు. వారితో పార్ట్నర్స్ గా కలసి సినిమా తీశాము. నిర్మాత శ్రీధర్ ఏ సినిమా చేసినా చాలా ఆలోచించి చేస్తాడు. కన్నడ లో కూడా సినిమా తీసి మంచి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వస్తున్న టాప్ గేర్ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుంది. సినిమా ట్రైలర్, టీజర్ లు చాలా బాగున్నాయి. విజువల్స్ చూస్తుంటే డైరెక్టర్ కొత్త వాడైనా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. శ్రీ రామ్ గారి ఫోటోగ్రఫీ చాలా గొప్పగా వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. సాయికుమార్ కోరుకున్నట్లు ఈ సినిమా తర్వాత ఆది ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో నిలబడతాడని కచ్చితంగా నమ్ముతున్నాను. టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ
డైరెక్టర్ శశికాంత్ చాలా కాలంగా తెలుసు. ఎప్పుడు కలిసినా కథల గురించే డిస్కర్షన్ చేసేవాడు. అలాంటి తనకు ఆది, శ్రీధర్ రెడ్డి లు ఛాన్స్ ఇవ్వడం తో దర్శకుడు శశి డిఫరెంట్ గా సినిమా బాగా తీశాడు అనుకుంటున్నాను. మ్యూజిక్ చాలా బాగుంది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాతో అందరికీ మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను.
నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో రెగ్యులర్ సినిమాలు చేసే హీరోల మాదిరే ఆది కూడా సినిమా తర్వాత సినిమా చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇలాంటి హీరోలు ఉండడం వలన మాలాంటి ఆర్టిస్టులకు నిరంతరం వర్క్ దొరుకుతుంది. ఇందులో నాకు దర్శక, నిర్మాతలు మంచి పాత్ర ఇచ్చారు. నైట్ షూట్ చేయడమంటే చాలా కష్టం. అలాంటిది ఈ సినిమా ఎక్కువగా నైట్ షూట్ చేయడం జరిగింది. టెక్నీషియన్లు ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డారు. నిర్మాత డైరెక్టర్ కోరికల్ని కాదనకుండా ఏది కావాలంటే అది సమకూర్చడంతో సినిమా బాగా వచ్చింది ఈ నెల 30 న వస్తున్న ఈ సినిమా నిర్మాత శ్రీధర్ రెడ్డికి బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
నటీనటులు :
ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు
టెక్నీషియన్స్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.శశికాంత్
సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్
మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ప్రొడ్యూసర్: K. V. శ్రీధర్ రెడ్డి
బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్