ట్యాక్సీ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
కొత్త దర్శకుడు, కొత్త హీరో సినిమా వస్తోంది అంటే పెద్దగా ఎక్సపెక్టేషన్స్ ఉండవు . కానీ ఆ టీజర్ కానీ ట్రైలర్ కానీ వైరల్ అయితే లెక్కే మారిపోతుంది. టాక్సీకు ట్రైలర్ బాగా వర్కవుట్ అయ్యింది. ఏదో విషయం ఉందని అనిపించింది. నిజంగానే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ కంటెంట్ ఉందా.ఈ కొత్త ప్రయత్నం టీమ్ కు విజయాన్ని ఇచ్చిందా ? ఇంతకీ ఈ టాక్సీ కథ ఏమిటి ?
స్టోరీ లైన్ :
యంగ్ సైంటిస్ట్ ఈశ్వర్ (వసంత్ సమీర్ పిన్నమ రాజు) నిజాయితీపరుడు.తన ప్రయోగాలు దేశానికి ఉపయోగపడాలని భావిస్తూంటాడు. అతను కాలిఫోర్నియం 252 పై ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతాడు. కాలిఫోర్నియం 252 తో బంగారం నిల్వలు కనిపెట్టవచ్చు. ఎక్కడో భూమి లోతుల్లో ఉన్న బంగార నిల్వల అంతు తేల్చచ్చు. అప్పుడు మన దేశం నెంబర్ వన్ అవుతుంది అని ఆశింతి గనుల శాఖా మంత్రి ముందు ప్రపోజల్ పెడతాడు. మరిన్ని ప్రయోగాలు కోసం సెంటర్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వమని అడుగుతాడు. అయితే కాలిఫోర్నియం 252 ఒక్కో గ్రాము 180 కోట్లు. అంతటి విలువైన సంపదను ఎవరు వదులుకుంటారు. పొలిటీషన్స్, వారిని అంటిపెట్టుకునే మాఫియా రంగంలోకి దూకుతుంది. ఈశ్వర్ లాంటి నిజాయితీ పరుడుని వంచటం కష్టం. అందుకే అతని పర్శనల్ లైఫ్ ని తమ గుప్పిట్లో తీసుకుంటే అనే ఆలోచన వస్తుంది. అక్కడ నుంచి ఈశ్వర్ పై నేరారోపణలు, అతని భార్య (అల్మాస్ మోటివాలా) మిస్సింగ్ లు జరిగిపోతూంటాయి. వాటి నుంచి ఈశ్వర్ తప్పించుకోవటానికి తన వంతు ప్రయత్నం మొదలెడతాడు.
మరో ప్రక్క ఎథికల్ హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్) కు కెరీర్ పరంగా ఎదటానికి మంచి కాంట్రాక్ట్ వస్తుంది. దాంతో స్నేహితులు,సన్నిహితులు నుంచి అప్పులు చేసి తెచ్చి మరీ తన సంస్దను డవలప్ చేస్తూ పై మెట్టు ఎక్కాలనుకుంటాడు. కానీ అనుకోని విధంగా తనకు వచ్చిన కాంట్రాక్ట్ సమస్యల్లో పడటం, ప్రాజెక్టు ఆగిపోవటం, చివరకు అప్పులు మిగలటం జరుగుతుంది. ఆ ఫైనాన్సియల్ ప్రెజర్ తట్టుకోవటానికి అతను ఓ డెసిషన్ తీసుకుంటాడు. ఇలా వేర్వేరు సమస్యలతో ఉన్న ఈశ్వర్, ఉజ్వల్ అనుకోని పరిస్దితుల్లో ఓ క్యాబ్ ఎక్కుతారు. ఆ క్యాబ్ పై కొందరు ఎటాక్ చేస్తారు. వాళ్లనుంచి తప్పించుకున్న వీళ్లిద్దరు తమపై ఎటాక్ కు ప్లాన్ చేసింది విద్యుత్ (నవీన్ పండిత) అని తెలుసుకుంటాడు. అతనెవరువీళ్లిద్దరని టార్గెట్ చేయటానికి కారణం ఏమిటి. ఎటాక్ జరిగిన తర్వాత నుంచి వాళ్ల జీవితాలు ఎలా టర్న్ తీసుకున్నాయి. మిస్సైపోయిన ఈశ్వర్ భార్యతిరిగి కనపడిందాఅతనిపై పడిన పోలీస్ కేసులు,నేరారోపణలు చివరకు ఏమయ్యాయి ఈ కథలో టాక్సీ డ్రైవర్ ( సద్దాం హుస్సేన్) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :
పెద్ద ఆడంబరాలు లేకుండా కథని చెప్పడం, ప్రేక్షకులని యంగేజ్ చేసే నేర్పు చిన్న దర్శకులకు అవసరం. ఆ విషయంలో దర్శకుడు చాలా వరకూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కొత్త పాయింట్ ని కథకు ఎంచుకోవటంలోనే చాలా భాగం సక్సెస్ అయ్యాడు. అయితే ఇలాంటి కథలకు అవసరమైన థ్రిల్లింగ్ ట్రీట్ మెంట్ సరిగ్గా సెట్ కాలేదనిపిస్తుంది. ఈ క్రమంలో కొన్ని సార్లు తడపడ్డాపడిపోకుండా టాక్సీని రైట్ ట్రాక్ లో నడిపే ప్రయత్నం చేసాడు. టాక్సీ ఎక్కిన ఇద్దరి వ్యక్తుల జీవితాలను వారి గతం ఎలా వెంబడించింది.ఒకరికొకరు తెలియకుండా టాక్సీ ఎక్కినా.వాళ్లిద్దరు ఒకరికొకరు ఎలా ఇంటర్ లింక్ అయ్యి ఉన్నారు వంటి ఆసక్తికరమైన ట్విస్ట్ లు రాసుకుని ఈ దర్శకుడు తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ వరకు హీరోని సమస్యలో పడేయటం. సెకండ్ హాఫ్ లో ఆ సమస్యనుంచి బయిటపడటానికి అతను ఏం ప్రయత్నం చేసాడుఎలా తన సమస్యలను అధిగమనించాడు అన్న థోరణిలో స్క్రీన్ ప్లే రాసుకున్నారు.
సాధారణంగా ఇలాంటి కథ ఓపెన్ చేసినప్పుడు ఒక ఎమోషన్ తో ప్రేక్షకుడు కనెక్ట్ చేసేయాలి. అందుకు టైమ్ తీసుకున్నారు. అలాగే ఇలాంటి థ్రిల్లర్ కథల్లో ఉత్కంఠ నెలకొల్పడం చాలా కీలకం. విలన్ చేతిలో ఇరుక్కుపోయిన హీరోకు ఏదైనా జరుగుతుందేమో అనే టెన్షన్ క్రియేట్ కావాలి అలా చేయటంలో చాలా భాగం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దాంతో హీరోకు ఏం కాదులే అని రిలాక్స్ అవటానికి ప్రేక్షకులుకు అవకాసం దొరకలేదు. ఇది కంప్లీట్ గా దర్శకుడి సినిమా. ఇందులో ప్లస్ పాయింట్స్ కూడా వున్నాయి.ముఖ్యంగా కొత్త హీరోపైనా భారీ యాక్షన్ సీన్లు కనిపిస్తాయి. చివర్లో హ్యాకింగ్ నేపధ్యంలో డిజైన్ చేసిన ఫైట్ సీక్వెన్స్ ఒక స్పెషల్ ఎట్రాక్షన్. యాక్షన్ ని ఇష్టపడే వారికి ఇవన్నీ బాగా నచ్చుతాయి.
నటీనటులు:
వసంత్ సమీర్ పిన్నమ రాజు. ఈశ్వర్ పాత్ర ను చాలా సహజంగా చేశాడు. భారీ హీరోయిజం జోలికి పోకుండా ఒక మామూలు సైంటిస్ట్ లా కనిపించడం ఆకట్టుకుంది. హీరోయిన్ సౌమ్య మీనన్ అందంగా వుంది. మిగతా పాత్రలు పరిధిమేర చేశారు.
టెక్నికల్ :
మార్క్ k రాబిన్ నేపధ్య సంగీతం బావుంది. ఉరుకుండారెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. విజువల్స్ డీసెంట్ గా వున్నాయి. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. ఓ నాణ్యమైన చిత్రాన్ని ఇవ్వాలన్న తపన నిర్మాతల్లో కనిపించింది. ఫైట్స్, చేజింగ్ సీన్స్ బాగా తీశారు. డైలాగులు చాలా చోట్ల బాగా పేలాయి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో విషయం ఫైట్ మాస్టర్ బి.జె శ్రీధర్ కొత్త తరహాలో చేసిన స్టంట్స్.
దర్శకుడు హరీష్ సజ్జా ఎత్తుకున్న పాయింట్ బావుంది. అయితే దాన్ని ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా మార్చడానికి మరింత వర్క్ చేయాల్సింది. అయితే ఇప్పటివరకూ ఇది భిన్నమైన ప్రయత్నమే. టెక్నాలజీకి మోసాన్ని ముడిపెడుతూ ఓ డిఫరెంట్ కథాంశాన్ని ఈ ట్యాక్సీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. అలాగే బలవంతుడంటే బలమున్నోడు కాదు బలహీనత లేనోడు అలాంటి బలహీనత కలిగిస్తే భగవంతుడైనా బలహీనపడాల్సిందే వంటి డైలాగులు నేచురల్ గా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ఇంటర్వెల్ ముందు వచ్చే వసంత్ సమీర్ పిన్నమ రాజు చేసిన ఫైట్స్
కొన్ని కామెడీ సీన్లు
డీసెంట్ ఫిల్మ్ మేకింగ్
మైనస్ లు :
కొన్ని రొటీన్ ఎలిమెంట్స్
అక్కడక్కడా సాగదీత
ఫైనల్ వర్దిక్ట్ :
ఈ టాక్సీలో ప్రయాణం సుఖంగానే ఉంటుంది
నటీనటులు :
వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు.
సాంకేతికవర్గం :
బ్యానర్: హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్
సంగీతం : మార్క్ k రాబిన్
సినిమాటోగ్రఫీ : ఉరుకుండారెడ్డి
విఎఫ్ఎక్స్ : ఆనంద్ పల్లకి
ఎడిటర్: టి.సి. ప్రసన్న
దర్శకత్వం: హరీష్ సజ్జా
నిర్మాత: హరిత సజ్జా
రన్ టైమ్ : 124 మినిట్స్
విడుదల తేదీ:10, మార్చి 2023.