Reading Time: 2 mins

ట్రెండింగ్‌లో 118 సినిమా పాట‌



ట్రెండింగ్‌లో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌ `118` చంద‌మామే..` పాట‌!

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ పాడుతున్న `చంద‌మామే.. చేతికందే` పాట ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఆయ‌న న‌టిస్తున్న తాజా సినిమా `118`. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మ‌హేష్ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్నారు. కె.వి.గుహ‌న్ ర‌చించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, కెమెరాను హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. శేఖ‌ర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలోని `చంద‌మామే…` లిరిక‌ల్ వీడియో ఇటీవ‌ల విడుద‌లైంది. పాట రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

`చంద‌మామే చేతికందే.. వెన్నెలేమో మ‌బ్బులోనే, పూల‌చెట్టే క‌ళ్ల‌ముందే.. పువ్వులేమో కొమ్మ‌పైనే.. చూస్తూనే ఎంత సేపు.. తాకితేనే ఏంటి త‌ప్పుపాతికేళ్ల బ్ర‌హ్మ‌చారి బాధ చూడ‌వా…` అంటూ సాగే ప‌ల్ల‌వి యాజిన్ నిజార్ గొంతులో వినేకొద్దీ వినాల‌నిపించేలా చ‌క్క‌గా ఉంది. బ్ర‌హ్మ‌చారి త‌న బాధ‌ను చూడ‌మంటూ ప్రియురాలికి మొర‌పెట్టుకుంటున్నాడ‌ని వినేవారికి ఇట్టే అర్థ‌మై క‌నెక్ట్ అవుతుంది. అందుకే ప్ర‌స్తుతం ట్రెండింగ్ అవుతోంది. రామ్ ఆంజ‌నేయులు రాశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా `118` పాట‌లు విడుద‌ల‌వుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన స్టిల్స్ లో నంద‌మూరి కల్యాణ్‌రామ్ ఫ్రెష్ లుక్స్ లో క‌నిపిస్తున్నారు. షాలినీ పాండే గ్రేస్‌ఫుల్ గా క‌నిపిస్తోంది. 

నిర్మాత మ‌హేష్ ఎస్‌.కోనేరు మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వ‌చ్చింది. `118` టైటిల్ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంద‌ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన `చంద‌మామే` పాట యూత్‌కి బాగా క‌నెక్ట్ అయింది. ట్రెండింగ్‌లో ఉంది. శేఖ‌ర్ చంద్ర చాలా మంచి ట్యూన్లిచ్చారు. త‌ప్ప‌కుండా ఆడియో పెద్ద హిట్ అవుతుంది. సినిమాను మార్చి 1న విడుద‌ల చేస్తున్నాం. క‌ల్యాణ్‌రామ్ లుక్స్ ప‌రంగా ఇప్ప‌టికే స‌రికొత్త‌గా క‌నిపిస్తున్నారు. ఆయ‌న కెరీర్‌లో మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా అవుతుంది“ అని అన్నారు. 

ఈ చిత్రానికి ఎడిటింగ్‌: త‌మ్మిరాజు, యాక్ష‌న్‌:  అన్బ‌రివు, వెంక‌ట్‌, రియ‌ల్  స‌తీష్‌, మాట‌లు:  మిర్చి కిర‌ణ్‌, వి.శ్రీనివాస్‌,