డబుల్ ఇస్మార్ట్ మూవీ 4 మార్చి 2024 రిలీజ్
ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరి కనెక్ట్స్ పాన్ ఇండియా మూవీ టైటిల్ డబుల్ ఇస్మార్ట్, మార్చి 8, 2024 మహా శివరాత్రికి థియేట్రికల్ రిలీజ్
మాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలైయింది. ఉస్తాద్ రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్ మచ్ బిగ్గర్ ప్రాజెక్ట్ కోసం మళ్లీ కలుస్తుంది. పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విషు రెడ్డి సీఈవో. రామ్ పుట్టినరోజు (మే 15)కి ఒక రోజు ముందు సినిమా టైటిల్, విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి డబుల్ ఇస్మార్ట్ అని పేరు పెట్టారు. ఇది ఈసారి రెట్టింపు మాస్ ,రెట్టింపు వినోదాన్ని ఇవ్వబోతుంది. పూరి జగన్నాధ్ చాలా పెద్ద స్పాన్ కలిగిన కథను రాశారు. అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో హై బడ్జెట్‌తో రూపొందించబడుతుంది.
డబుల్ ఇస్మార్ట్ టైటిల్ పోస్టర్లో త్రిశూల్స్ పై రక్తపు గుర్తులు ఉన్నాయి. ఈ పోస్టర్ ఇస్మార్ట్ శంకర్ సెకండ్ ఫ్రాంచైజీ నేపథ్యం గురించి సూచిస్తోంది
డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. మహా శివరాత్రికి మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అనౌన్స్ చేస్తారు.
తారాగణం :
రామ్ పోతినేని
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్